For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..

రాత్రంతా ఆమె గానాన్నే గుర్తు చేసుకుంటూ నిద్రించిన అతను తెల్లవారిన వెంటనే తుమ్మెదలు మకరందం కోసం ఎలా వేట కొనసాగిస్తాయో తను కూడా ఆమె కోసం పాటలు పాడుకుంటూ అన్వేషణ మొదలెట్టాడు.

|

అందమైన వెన్నెల పున్నమి వేళ.. అమృతం కురిసే రాత్రి వేళ.. ఆమెతో అందమైన క్షణాలను గడిపేందుకు అతను ఎదురుచూసే వేళ.. వలపుల.. వరదలా.. సందేలో కలిసే చలి సావిత్రి.. అప్పుడే కిల కిల రాగాలతో, ఆహ్లాదంగా, స్వేచ్ఛగా తన స్వరంతో సంగీతం మొదలెట్టింది. ఆమె రాగానికి ముగ్ధులైన పక్షులు కూడా తమ పలుకులను ఆపేశాయి...

The first love

అంతా గప్ చుప్ అయిపోయాయి. అదే సమయంలో మిణుగురులు చల్లటి వాతావరణంలో చిమ్మ చీకటిలో తమ వెలుగులతో కొత్త ప్రపంచాన్ని చూపుతున్నాయి. మంచు మాత్రం విశ్వరూపం చూపుతోంది. అంతలోనే తెల్లవారింది.. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...

ఆమె కోసం అన్వేషణ..

ఆమె కోసం అన్వేషణ..

రాత్రంతా ఆమె గానాన్నే గుర్తు చేసుకుంటూ నిద్రించిన అతను తెల్లవారిన వెంటనే తుమ్మెదలు మకరందం కోసం ఎలా వేట కొనసాగిస్తాయో తను ఆమె కోసం అన్వేషణ మొదలెట్టాడు. అయితే అతనికి ఆమె జాడ ఎక్కడా దొరకదు. అతను తిరిగి తిరిగి బాగా అలసిపోతాడు.

మిన్ను మన్ను ఏకం చేసేలా..

మిన్ను మన్ను ఏకం చేసేలా..

‘నీ కోసం నీ కోసం జీవించా చిలక.. నా ప్రాణం నీ వేనే మణితునక.. నా కోసం.. నా కోసం.. నిన్నే నా జతగా.. ఏ దైవం పంపేనో బహుమతిగా.. నిన్ను.. నన్ను పెనవేసే ప్రేమే సాక్షిగా.. కన్ను కన్న కలబోసే కలలే పండగా.. మిన్ను మన్ను ఏకం చేద్దాం హరివిల్లుగా‘ అంటూ తను కూడా పాటలు మొదలుపెడతాడు.

అపురూపమైన అమ్మాయి..

అపురూపమైన అమ్మాయి..

అలా పాడుకుంటూ పోతున్న సమయంలో ఓ చోట నిరాశగా కూర్చున్న సమయంలో ఒక అపురూపమైన అమ్మాయి కనబడుతుంది. అప్పటివరకు ఎంతో మంది అందమైన అప్సరసలను చూసిన ఆ కళ్లు ఆ అందమైన అమ్మాయిని చూసే సరికి తనలో ఆనందం రెట్టింపు అయ్యింది. అలాంటి భూలోక మేనక మాదిరిగా ఉన్న ఆమెను అతను చూడటం అదే మొదటిసారి.

వన్ సైడ్ లవ్ స్టార్ట్

వన్ సైడ్ లవ్ స్టార్ట్

వెన్నెల సమయంలో మంచు యధేచ్ఛగా కురవడం వల్ల వాతావరణం, ప్రకృతి చాలా చల్లగా అందంగా ఉంటుంది. ఇక అప్పటి నుండి అతను ప్రతిరోజూ ఆ అందమైన అమ్మాయి దగ్గరకు వెళ్లేవాడు. ఆమెకు కనబడకుండా వన్ సైడ్ లవ్ స్టార్ట్ చేశాడు. అలా ప్రతిరోజూ తనను దూరం నుండి చూస్తూ ఆమెపై ప్రేమను పెంచుకున్నాడు. అయితే తన ప్రేమను ఆమెకు చెప్పకుండా తన మనసులోనే దాచుకున్నాడు.

తడబడుతూనే ప్రేమ విషయం..

తడబడుతూనే ప్రేమ విషయం..

అయితే ఇలా ప్రతిరోజూ చేస్తే కాలం గడిచిపోవడం తప్ప... తాను ఏమి సాధించలేనని తెలుసుకుని ఓ రోజు ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్తాడు. అందమైన అమ్మాయి దగ్గరకు వెళ్లి గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా తన ప్రేమ విషయాన్ని తడబడకుండా చెబుదామని నిర్ణయించుకుంటాడు. అయితే తను అనుకున్నట్టు కాకుండా తడబడుతూనే తన ప్రేమ విషయం చెబుతాడు. అయితే ఆ అందమైన అమ్మాయికి అతనంటే ఇష్టమున్నా తనను పరీక్షించడం కోసం అతని ప్రేమను తిరస్కరిస్తుంది.

సీన్ రివర్స్..

సీన్ రివర్స్..

అందమైన అమ్మాయి నోటి వెంట ఆ మాటలు విన్న అతని మనసు గాయపడుతుంది. దీంతో అతను ఆమెకు దూరం కావాలనుకుంటాడు. కొద్దిరోజులు ఆమె చుట్టుపక్కలకు సైతం వెళ్లడు. దీంతో ఆమెకు అనుమానం వస్తుంది. అప్పటి నుండి సీన్ కాస్త రివర్స్ అవుతుంది. అతని కోసం ఆమె అన్వేషణ మొదలెడుతుంది. అతడిని అనవసరంగా బాధ పెట్టానా అని తలచుకుని బాధపడుతుంది.

నువ్వు లేక నేను ఉండలేను..

నువ్వు లేక నేను ఉండలేను..

అతని రాక కోసం తన వేయి కళ్లతో నిరీక్షణగా చూస్తున్న ఆమెకు ఒకరోజు అకస్మాత్తుగా అతను కనిపిస్తాడు. అయితే అతను ఆమెను చూసి పక్కకు వెళ్లిపోతాడు. కానీ ఆమె అప్పుడు అతనికి అప్పుడు చెప్పింది అబద్ధమని నచ్చచెబుతుంది. తనకి కూడా అతనంటే ఇష్టమని చెబుతుంది. నువ్వు లేక నేను ఉండలేను అని తన మనసులో మాట చెబుతుంది. దీంతో ఒకరినొకరు అర్థం చేసుకుని వివాహం చేసుకుంటారు. అలా మంచు వేళలో మొదలైన ప్రేమ కథ వారి పెళ్లికి దారి తీసింది...

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే మీ బంధు మిత్రులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి అనేక ప్రేమ, ఆరోగ్య, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్ స్కై తెలుగు పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.

English summary

The first love that started in the snow

Here we talking about the first love that started in the snow. Read on
Story first published:Thursday, December 12, 2019, 18:28 [IST]
Desktop Bottom Promotion