For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామి ఆ విషయంలో నిబద్ధతగా ఉన్నారో లేదో ఈ సంకేతాలను బట్టి తెలుసుకోవచ్చు...!

|

పెళ్లి అయినా.. ప్రేమ అయినా ఇద్దరు వ్యక్తులను జీవితాంతం కలిపి ఉంచే బలమైన బంధం. అయితే ఈ బంధంలో ప్రతి ఒక్కరికీ సంతోషం, బాధ, సుఖం అన్నీ కచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కలిస్తేనే అది మంచి బంధంగా మారుతుంది.

అయితే బంధాల విషయంలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య నిబద్ధత(commitment) అనేది చాలా ముఖ్యం. ఇది ఎంత బలంగా ఉంటే వారు అంతకాలం హాయిగా, ఆనందంగా జీవిస్తారు.

అయితే ఇలాంటి బంధాలలో ఎక్కువగా బాధ కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. అవే ఇతరులతో వివాహేతర సంబంధాలు వంటి విషయాలు. అయితే ఒక విషయాన్ని బట్టి ఒక వ్యక్తి తన భాగస్వామిని కలకాలం ఆనందంగా చూసుకోగలడా? తన నిబద్ధత విషయంలో నిక్కచ్చిగా ఉండగలడా? అనే సందేహాలు మనలో చాలా మందికి వస్తూనే ఉంటాయి.

ఇందుకోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటారు కొందరు. అయితే అందరూ అలానే చేస్తారని మాత్రం కాదు. రిలేషన్ షిప్ లో ఉన్న ఏ ఒక్కరైనా నిబద్ధతను కోరుకోవడం అత్యంత సహజం. మీరు ఏదైనా రిలేషన్ షిప్ లో ఉండి మీ బంధం ఏమవుతుందో అని ఆందోళన చెందుతుంటే, అలాంటి వాటికి సంబంధించిన సంకేతాల గురించి తెలుసుకోండి. అప్పుడు మీరు మీ సంబంధంపై ఒక అంచనాకు వచ్చేయండి.. మంచి నిర్ణయం తీసుకోండి.

పెళ్లి తర్వాత ఈ ప్రశ్నలెదురైతే... ఇలా స్మార్ట్ గా సమాధానాలివ్వండి....

తరచూ ఆవేశం..

తరచూ ఆవేశం..

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురితమైన ఓ కథనం ప్రకారం తరచూ ఆవేశపడేవారు, తొందరలో నిర్ణయాలు తీసుకునే వారు తమ భాగస్వామికి మోసం చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. అయితే వీరు తమ భాగస్వామికి తెలియకుండా ఇతరులతో సంబంధాన్ని కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదట. దీనికి కొన్ని కారణాలను కూడా వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భావోద్వేగ సాన్నహిత్యం..

భావోద్వేగ సాన్నహిత్యం..

రిలేషన్ షిప్ లో ఉండే జంటల మధ్య కచ్చితంగా భావోద్వేగ సాన్నిహిత్యం అనేది అవసరం. ఇలాంటి వాటి వల్లే ఏ సంబంధాన్ని అయినా చాలా దూరం తీసుకెళ్లడానికి సంకేతంగా చెప్పారు. మీరు మీ భాగస్వామి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే, అతను మీతో సుదీర్ఘ కాలం పాటు సంబంధాన్ని కొనసాగించడు అని మీరు గమనించాలి.

ముచ్చట్లు అవసరం..

ముచ్చట్లు అవసరం..

రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు నిబద్ధతగా ఉండాలనుకుంటే, గతంలో జరిగిన విషయాలను మరియు ప్రస్తుత విషయాల గురించి ముచ్చటించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏ మాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి వాటికి మీ భాగస్వామి అయిష్టత చూపుతాడో మీతో దీర్ఘకాలం సంబంధం కొనసాగించేందుకు సిద్ధంగా లేడనేందుకు ఓ సంకేతం.

ఒకే మహిళపై మనసు పారేసుకున్న తండ్రీ కొడుకులు... చివరికి ఏం జరిగిందంటే...

డేటింగ్ ద్వారా..

డేటింగ్ ద్వారా..

మీరు ఇద్దరు ప్రేమలో ఉన్నప్పుడు లేదా ఏదైనా రిలేషన్ లో ఉన్నప్పుడు ఒకరితో ఒకరు డేటింగ్ చేయడం ద్వారా మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలని అనుకోవచ్చు. కానీ ఇది మీ భాగస్వామికి వర్తించదు. ఎందుకంటే డేటింగ్ లో ఉన్నప్పుడు మీరు సినిమాలకు వెళ్లడానికి, ఏదైనా టూర్లకు లేదా ఎక్కడికైనా ఏకాంతంగా ఉండే ప్రదేశాలకు ప్లాన్ చేసినప్పుడు, మీ భాగస్వామి తరచుగా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూఉంటే, వారికి మీతో బంధం కంటిక్యూ చేయడానికి ఇష్టం లేదని మీరు గమనించవచ్చు. అంతేకాదు మీతో సంబంధాన్ని తెంచుకునేందుకు కూడా సిద్ధమయ్యాడనేందుకు ఇదొక సంకేతం.

రొమాన్స్ గురించి..

రొమాన్స్ గురించి..

మీ భాగస్వామి సంబంధంలో నిబద్ధతను కోరుకోకపోతే, శారీరకంగా పాల్గొనడం గురించి వారు ఆలోచించే విధానం నుండి మీకు తెలుసు. మీ భాగస్వామికి దీనితో సంబంధం లేదు. వారు మీతో సంబంధం కలిగి ఉంటారని వాగ్దానం చేసేవారు కాదని ఇది మీకు తెలియజేస్తుంది. కొంతమంది కేవలం సెక్స్ కోసమే సంబంధంలో ఉంటారు. వారు ఎక్కువ కాలం సంబంధంలో ఉండరు.

మీ భాగస్వామిని ముద్దుల్లో ముంచెత్తే ముందు ఈ విషయాలను మరవొద్దు సుమా...!

పరిచయాలు చేయకపోవడం..

పరిచయాలు చేయకపోవడం..

ఏదైనా సంబంధం అంటే ప్రేమికులతో పాటు స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో తమను తాము పరిచయం చేసుకోవాలి. కానీ మీతో సంబంధంలో నిబద్ధత లేని ఇలాంటి పరిచయాలు చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఒకవేళ మీరు వారితో సన్నిహితంగా ఉంటూ పరిచయం చేసుకునేందుకు ప్రయత్నించినా.. వారు దీని నుండి తప్పించుకునేందుకు చూస్తారు తప్ప.. మీకు సహకరించరు. దీనర్థం వారు మీతో సంబంధంలో జీవితాంతం ఉండాలనుకోవడం లేదు.

సంభాషణలు లేకపోవడం..

సంభాషణలు లేకపోవడం..

ఏ సంబంధంలో అయినా సంభాషణలే ముఖ్యం. ఇవే మీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి. ఇవి మీ ఇద్దరి మధ్య సంబంధాలను కూడా నిర్ణయిస్తాయి. అయితే మీరు ఏదైనా అంశాన్ని మాట్లాడే ప్రతిసారీ, వారు దాని గురించి మాట్లాడటానికి ఇష్టపడకపోతే, వారు మీతో లాంగ్ రిలేషన్ షిప్ కోరుకోవడం లేదని మీరు తెలుసుకోవాలి.

English summary

These Signs that say your partner is avoiding a commitment

Here we are talking about the signs that say your partner is avoiding a commitment. Read on.
Story first published: Wednesday, June 24, 2020, 15:56 [IST]