For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

love signs:ఎవరైనా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారనే సంకేతాలివే...!

|

మనలో చాలా మంది మగాళ్లు ప్రేమ విషయంలో ఓపెన్ అయిపోతుంటారు. అయితే అమ్మాయిల్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయని వారు కూడా ఆ విషయంలో తమ మనసులోని ఫీలింగ్స్ ను బయటపెట్టేందుకు మన కన్నా ముందే ఉన్నామని చెబుతుంటారు.

అయితే అందరూ అబ్బాయిలు.. అమ్మాయిలు అలా ఉండరు. కొందరు అమ్మాయిలు మరియు అబ్బాయిలు తమ మనసులో ఫీలింగ్స్ ను అంత ఈజీగా బయటపెట్టలేరు.

అంతమాత్రాన వారు తక్కువగా ప్రేమిస్తున్నారని కాదండోయ్.. కొందరు మొహమాటం లేదా సిగ్గు వల్ల తమ ప్రేమను బయట పెట్టలేకపోతారు. అయితే వారు ప్రేమను మాటలతో కాకుండా కొన్ని సంకేతాల ద్వారా బయటపెడతారు. వారు నేరుగా మీకు ప్రేమ విషయం చెప్పనప్పటికీ.. వారిలో కొన్ని విషయాలను బట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదా తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

కేవలం 30 సెకన్ల పాటు ఈ ట్రిక్‌ని అనుసరించండి, అది భర్త అయినా..ప్రియుడైనా..మీ రిలేషన్ స్ట్రాంగ్!

కొంచెం ఇబ్బందిగా..

కొంచెం ఇబ్బందిగా..

ఒక అమ్మాయి అయినా.. లేదా అబ్బాయి అయినా మిమ్మల్ని ప్రేమిస్తుంటే.. మీతో మాట్లాడటానికి.. మీ దగ్గర ధైర్యంగా నిల్చోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమయంలో మాటలు పెదవి దాటకపోవడం.. మనసులో ఏదో అలజడి చెలరేగిన ఫీలింగులో ఉండిపోతారు. అలాంటి సమయంలో వారు చేసే చిలిపి పనులను గమనిస్తే వారి ప్రేమ విషయం మీకు తెలుస్తుంది.

మిమ్మల్ని వదిలి..

మిమ్మల్ని వదిలి..

మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఎన్ని గొడవలు జరిగినా.. మీతో ఎంతో పొట్లాడినా.. మిమ్మల్ని వదిలి ఉండలేరు. మీతో అనునిత్యం సరదాగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య గొడవలు చాలా సాధారణమే. ఇదంతా మీ భావోద్వేగాలను దాచుకోలేకపోవడం వల్లనే జరుగుతుంది.

మీకంటూ ఓ స్థానం..

మీకంటూ ఓ స్థానం..

వారి ప్రపంచంలో మీ కంటూ ప్రత్యేక స్థానాన్ని కేటాయించుకున్న వారు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మీరు ఎప్పుడు.. ఎక్కడున్నా.. ఎలా ఉన్నారని మీ గురించే ఆరా తీస్తూ ఉంటారు. అంతా మాత్రాన అది అనుమానం కాదు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన కారణంగా ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా మీతో నిత్యం టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇదంతా మీరు తనకు దూరంగా ఉన్నప్పుడు చేస్తే మీరంటే గాఢమైన ప్రేమ ఉందని తెలియజేస్తుంది.

బైక్ పై తమ బేబీతో రైడింగుకు వెళ్లాలని బాయ్స్ ఎందుకు కోరుకుంటారో తెలుసా...

మీరంటే అభిమానం..

మీరంటే అభిమానం..

ప్రేమ ఎక్కడ ఉంటుందో ఆప్యాయత, అభిమానం అనేది కచ్చితంగా ఉంటుంది. తను మిమ్మల్ని లవ్ చేస్తుంటే చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. అందరూ ఉన్నప్పుడే కాదు.. కేవలం మీతో కలిసి ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటే తనంటే మీకు ఎంతో ఇష్టం అని చెప్పొచ్చు. ఆప్యాయతతో పాటు మిమ్మల్ని అభిమానిస్తుంటే.. మీపైనే ప్రేమ ఉందని చెప్పొచ్చు..

మీకే తొలి ప్రాధాన్యం..

మీకే తొలి ప్రాధాన్యం..

మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఎప్పటికీ తొలి ప్రాధాన్యత మీకే ఇస్తారు. అందుకోసం మీపై ఎక్కువ ఫోకస్ పెడతారు. మీ మనసులో చోటు కోసం.. మీరు తన గురించి ఫీలవ్వాలని కోరుకుంటూ కొన్ని చిలిపి పనులు చేస్తుంటారు.

అన్నింటినీ షేర్ చేసుకుంటూ..

అన్నింటినీ షేర్ చేసుకుంటూ..

మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాదు మీతో తన గురించి ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకిష్టమైన వాటి గురించి మాట్లాడటం.. మీకు నచ్చే ప్రదేశాలకు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటే.. వారు మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తున్నారని చెప్పొచ్చు.

కొన్నిసార్లు అబద్ధాలు..

కొన్నిసార్లు అబద్ధాలు..

మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కొన్ని సందర్భాల్లో అబద్ధాలు కూడా చెబుతారు. ఉదాహరణకు మీతో తనకు మాట్లాడాలని అనిపిస్తే.. కావాలని ఏదైనా మెసెజ్ చేసి.. బై మిస్టెక్ వచ్చిందని అబద్ధం చెబుతారు. అందేకాదు మీరెప్పుడు ఆన్ లైనులోకి వస్తారా? మీతో ఛాటింగ్ ఎప్పుడు చేద్దామా అని ఆరాటపడుతూ ఉంటారు.

తనవైపే ఉండేలా..

తనవైపే ఉండేలా..

మీరంటే బాగా ఇష్టం ఉండే వ్యక్తులు మీరు ఎవరైన అందమైన వ్యక్తులతో మాట్లాడితే చాలా జలసీగా ఫీలవుతారు. నలుగురిలో తన చూపంతా మీ వైపే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందుకోసం అనేక తిప్పలు పడతారు. ఒకవేళ మీరు ఇతరులతో చనువుగా ఉంటే.. మీ ఇద్దరి మధ్య బలవంతంగా దూరి మాతో ఇలా ఎప్పుడు ఉంటార్లేండి అంటూ పరోక్షంగా పంచ్ లు వేస్తుంటారు.

English summary

These Signs That Show Someone Loves You in Telugu

Here are these signs that show someone loves you in Telugu. Have a look
Story first published: Wednesday, November 17, 2021, 17:35 [IST]