For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేటింగ్ గురించి భయపడుతున్నారా? అయితే ఈ చిట్కాలను పాటించండి..

|

డేటింగ్ విషయానికి వస్తే లేదా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ఒక్కో రకమైన అనుభవం ఉంటుంది. మీరు కొత్తగా డేటింగ్ కు వెళ్లాలని అనుకుంటే మీరు డేటింగ్ లో పాల్గొన్న వారి అనుభవాలను కనుక్కోవాలనుకుంటే, వారు మీరు డేటింగ్ విశేషాలను తమతో షేర్ చేసుకోమని చెబితే, కొందరు మాత్రం డేటింగ్ నుండి ఫుల్ హ్యాపీగా ఉంటుందని, మేము చాలా ఆస్వాదించామని, అది చాలా లక్కీ అని చెబుతుంటారు.

అయితే చాలా మంది తమ డేటింగ్ అనుభవాలను గుర్తు చేసుకునేందుకు అంతగా ఇష్టపడరు. వారు అలాంటి విషయాలను బయటకు చెప్పేందుకు లేదా ఎవరితో అయినా పంచుకునేందుకు విముఖత చూపుతారు. అయితే కొత్తగా డేటింగ్ కు వెళ్లే వాళ్లు దీని నుండి ఎలాంటి గగుర్పాటు పడాల్సిన పనిలేదు. ఒకవేళ మీరు డేటింగ్ విషయంలో గగుర్పాటుకు గురైతే మీ భద్రతకు ఉపయోగపడే చిట్కాలను మేము ఈ స్టోరీలో వివరిస్తున్నాం. వీటిని ఫాలో అవ్వండి. మీ ఆందోళనను పక్కన పెట్టేయండి.

వ్యక్తి గురించి బాగా తెలుసుకోవాలి..

వ్యక్తి గురించి బాగా తెలుసుకోవాలి..

మీరు డేటింగుకు ఎవరైనా వ్యక్తితో వెళ్లాలనుకుంటే వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అదే విధంగా గగుర్పాటులో డేటింగ్ గడపడం కంటే కూడా వారి గురించి పూర్తిగా విచారణ చేయాలి. అంటే కాల్స్ లేదా మెసెజ్ ల ద్వారా ఒకరిని పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. అయితే ఇలాంటి సమయంలో మీరు మీ స్నేహితులను చర్చించడానికి ప్రయత్నించవచ్చు. అతను లేదా ఆమె ఎలాంటి వ్యక్తి అనే విషయం గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కూడా వెళ్లవచ్చు. అతను లేదా ఆమె సోషల్ మీడియా ప్రొఫైల్ మీకు చూపెట్టడానికి ఇష్టపడకపోతే లేదా విముఖత చూపితే, అతన్ని లేదా ఆమెను మీరు గుడ్డిగా విశ్వసించడం మానేయాలి. అది మీకే మంచిది.

గగుర్పాటు నుండి తప్పించుకునేందుకు..

గగుర్పాటు నుండి తప్పించుకునేందుకు..

మీరు డేటింగుకు వెళ్లిన సమయంలో మీకు గగుర్పాటుగా అనిపిస్తే, కొంచెం కఠినం అయినా తప్పించుకునేందుకు ఇలా చేయాలి. మీకు ఏదైనా కొంత అత్యవసర పరిస్థితి వచ్చినట్లు నటించాలి. ‘నన్ను క్షమించండి, నా రూమ్ మేట్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అయ్యారంట. నేను వెంటనే వెళ్లాలి‘ లేదా ‘ మా అమ్మ నన్ను వీలైనంత త్వరగా ఇంటికి రమ్మని కోరింది‘ అని మీరు సమాధానమివ్వాలి. మీ ఉద్దేశం గురించి అతనికి లేదా ఆమెకు తెలియజేయకుండా గగుర్పాటు డేటింగ్ నుండి తప్పించుకోవడానికి ఇలాంటివి మీకు బాగా సహాయపడతాయి.

 రెస్ట్ రూమ్ కు వెళ్లడం..

రెస్ట్ రూమ్ కు వెళ్లడం..

మీరు డేటింగ్ కు వెళ్లిన సమయంలో మీ మానసిక స్థితి సరిగా లేకపోతే మీరు వెంటనే రెస్ట్ రూమ్ కు వెళ్లొచ్చు. దీనికి ఇలా చెప్పొచ్చు. ‘నేను కొంచెం రిఫ్రెష్ అవ్వాలి. నేను కొన్ని నిమిషాల్లో తిరిగి వస్తాను‘ అని చెప్పాలి. కానీ మీరు రెస్ట్ రూమ్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది మీరు సులభంగా బయటకు వెళ్లడానికి మరియు గగుర్పాటు డేటింగ్ నుండి మిమ్మల్నీ మీరు ఉపశమనం పొందేందుకు గల మరో మార్గం.

మీ బెస్ట్ ఫ్రెండ్ కు మెసెజ్ చేయండి

మీ బెస్ట్ ఫ్రెండ్ కు మెసెజ్ చేయండి

మీరు డేటింగుకు వెళ్లిన సమయంలో మీరు సెలెక్ట్ చేసుకున్న వారి చేతిలో బ్లాక్ అయ్యారని మీకు అనిపిస్తే, వెంటనే మీరు మీ బెస్ట్ ఫ్రెండ్ కు మెసేజ్ చేయండి. అక్కడికి పిలవండి. ఎందుకంటే నిజమైన స్నేహితులు మిమ్మల్ని క్లిష్ట పరిస్థితి నుండి బయటపడేయటానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. మెసేజ్ వీలు కాకపోతే నేరుగా మీ స్నేహితుడికి ఫోన్ చేసి సహాయం కోసం అడగొచ్చు. అప్పుడు అతను లేదా ఆమె తప్పనిసరిగా మీ రక్షణ కోసం వస్తారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మీరు ఎవరితో బయటకు వెళుతున్నారో జాగ్రత్తగా ఉండాలని ముందుగానే నిర్ధారించుకోండి.

ఆ సమయంలోపు ఇంటికి..

ఆ సమయంలోపు ఇంటికి..

డేటింగులో గగుర్పాటు వంటి చెత్త పరిస్థితిని ఎదుర్కోకుండా మిమ్మల్నీ మీరు రక్షించుకోవడానికి మీరు కొన్ని సాకులు చెప్పవచ్చు. మీరు ఇలాంటి సాకులు చెబితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అదేంటంటే ‘నేను రాత్రి 10.30 గంటలలోపు ఇంటికి చేరుకోవాలి, అలాగే సాయంత్రం తర్వాత బయట ఎక్కువసేపు ఉండటానికి మా తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు‘ అని చెప్పొచ్చు.

 సినిమాల్లో లాగా కాదు..

సినిమాల్లో లాగా కాదు..

మాములుగా సినిమాల్లో అయితే డేటింగ్ అంటే ఫలానా ప్రదేశానికి రమ్మని ఆహ్వానించి, ఒక కప్పు కాఫీ తాగే సంఘటనలు మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే నిజజీవితంలో కూడా జరగదు. ఎందుకంటే మీ భాగస్వామికి కొన్ని చెడు ఉద్దేశ్యాలు ఉంటే మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో అతను లేదా ఆమె స్థానంలో ఉండటానికి అతడు లేదా ఆమె ఆహ్వానాన్ని అంగీకరించకుండా ఉండండి. మీ రూమ్ మేట్ మీకోసం వేచి ఉన్నారని లేదా చాలా అలసిపోయారని మరియు మీకు విశ్రాంతి అవసరమని చెప్పడం ద్వారా మీరు అలాంటి విషయాలన సున్నితంగా తిరస్కరించవచ్చు.

ఎందుకంటే ఒకరి మనసులో ఏమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు. మీరు ఒకరిని పూర్తిగా మరియు గుడ్డిగా విశ్వసించే ముందు మీరు బాగా ఆలోచించాలి. దీని వల్ల మీరు క్లిష్ట పరిస్థితులలో చిక్కుకుండా మిమ్మల్నీ మీరు కాపాడుకోవచ్చు.

English summary

These Ways That Can Come Handy If You Are Stuck With A Creepy Date

Every person has a different experience when it comes to dating or being in relationships. There is a high chance that if you go around and ask people to share their dating stories and experiences, you will get so much to hear. Some of those people can be quite lucky to have enjoyed a happy date, while others may not prefer to recall their dating experiences. For that reason, their date could have been a creepy one!