For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘లాక్ డౌన్ వల్ల లావు పెరిగిపోయా... ఇప్పుడేమో అది భరించలేకపోతున్నా’

|

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో అత్యవసర సేవలు మినహా అన్నింటినీ క్లోజ్ చేసేశారు. అయితే ఇప్పుడిప్పుడే అన్ లాక్ మొదలవుతోంది.

కానీ పూర్తి స్థాయిలో ఎక్కడా మినహాయింపులు రాలేదు. ముఖ్యంగా ఓపెన్ పార్కులు, మైదానాలు ఇంకా మూతపడే ఉన్నాయి. దీంతో చాలా మంది జాగింగ్, వాకింగ్ వెళ్లే వారికి చాలా ఇబ్బందులొచ్చాయి.

లాక్ డౌన్ కారణంగా బయటకు రాని వాళ్లలో చాలా మంది ఇప్పుడు తాము లావు పెరిగిపోయామని బాధపడుతున్నారు. అలాంటి వారిలో ఓ వివాహిత తను లావు పెరగడం వల్ల తన భర్త తనను ఎగతాళి చేస్తున్నాడని బాధపడుతోంది. ఇందుకోసం నిపుణుల సలహాలు, సూచనలు కోరింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'తనతో కలిసి ఎగిరిపోతే ఎంతో బాగుండనిపిస్తోంది... కానీ నాకేమో..''తనతో కలిసి ఎగిరిపోతే ఎంతో బాగుండనిపిస్తోంది... కానీ నాకేమో..'

పెళ్లి తర్వాత..

పెళ్లి తర్వాత..

హాయ్ ‘నా పేరు రాణి(పేరు మార్చాం). నేను చూడటానికి చాలా చిన్నగా ఉంటాను. నేను పెళ్లికి ముందు చాలా చిన్నగా ఉండేదాన్ని. అంటే చాలా తక్కువ పర్సనాలిటీలో ఉండేదాన్ని. అయితే పెళ్లి తర్వాత మా ఇద్దరి కలయిక వల్ల నా శరీరంలో చాలా మార్పులొచ్చాయి. ఇక పిల్లలు పుట్టిన తర్వాత నా బరువు చాలా పెరిగిపోయింది. నాకు వివాహం జరిగింది దాదాపు నాలుగేళ్లు కావస్తోంది.

లైట్ తీసుకునేదాన్ని..

లైట్ తీసుకునేదాన్ని..

మా ఇద్దరికీ పెళ్లి అయిన కొత్తలో నా భాగస్వామి నన్ను చాలా చిన్నగా ఉన్నావు అని ఆటపట్టించేవాడు. నేను కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సరదాగా అంటున్నాడని లైట్ తీసుకునేదాన్ని.

లావయ్యానని..

లావయ్యానని..

అయితే ఇప్పుడు మళ్లీ నేను లావయ్యానని... నన్ను ఎగతాళి చేస్తున్నాడు. దీన్ని నేను పెద్దగా కేర్ చేసే దాన్ని కాదు. ఇంట్లో ఉన్నప్పుడు నాలుగు గోడల మధ్య నన్ను ఏమన్నా పడతాను కానీ.. ఇతరులు ఇంట్లో ఉన్నప్పుడు.. లేదా ఎక్కడికైనా మేము కలిసి వెళ్లినప్పుడు కూడా అలానే చేస్తే నాకు ఒళ్లు మండిపోయినట్టు అనిపిస్తోంది.

ఈ రాశి స్త్రీలు రిలేషన్ షిప్ లో పైచేయి సాధిస్తారట... మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?ఈ రాశి స్త్రీలు రిలేషన్ షిప్ లో పైచేయి సాధిస్తారట... మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

ఏదో ఒక ఆటంకం..

ఏదో ఒక ఆటంకం..

ఆ విషయం నాలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. ఇది నా ఆత్మగౌరవాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తోంది. తను అలా అన్నప్పుడల్లా నాలో బిపి ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. అదే ఆవేశంలో నేను వెంటనే లావు తగ్గాలని నిర్ణయించుకోవడం... ఏదో ఒక ఆటంకం లేదా కారణం వల్ల అందుకు తగ్గట్టు ప్రయత్నాలను చేయలేకపోవడం సర్వసాధారణమైపోయింది' అని ఓ వివాహిత మహిళ తన గోడును వెళ్లబోసుకుంది.

బరువు తగ్గలేకపోతున్నా..

బరువు తగ్గలేకపోతున్నా..

‘నేను నా వెయిట్ తగ్గేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేసినా.. డైటింగ్ పాటించినా.. ఇంకా ఎవరెన్ని సలహాలు, సూచనలు చెప్పినా వాటన్నింటినీ పాటిస్తున్నాను. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నేను బరువు మాత్రం తగ్గడం లేదు. నేను ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా సమస్యకు సమాధానం చెప్పండి ప్లీజ్'.

ఎగతాళి చేస్తున్నట్లు..

ఎగతాళి చేస్తున్నట్లు..

ఈ సమస్య విన్న నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మీ భాగస్వామి మీరు లావుగా ఉన్నారని ఎగతాళి చేస్తున్నారని బాధపడుతున్నట్లు మీరు మాకు తెలియజేశారు.

ప్రేమే ద్వేషంగా మారొచ్చు..

ప్రేమే ద్వేషంగా మారొచ్చు..

భార్య భర్తల సంబంధంలోనే కాకుండా.. ఇతర ఏ రిలేషన్ షిప్ లో అయినా మనల్ని ఎవరైనా ఎక్కువగా అభినందించినప్పుడు లేదా అస్తమానం మనల్ని ఎత్తిపొడిచే వాళ్లంటే వాళ్లపై ఉండే ప్రేమ ఒక్కసారిగా ద్వేషంగా మారిపోయే అవకాశం ఉంది.

కోపం పెంచుకుంటే..

కోపం పెంచుకుంటే..

అలాంటి సమయంలో మన ఆత్మగౌరవం కూడా దెబ్బతిన్నట్లు అనిపించడం చాలా సహజం. ఇలాంటి సమయంలో మీరు మీ భాగస్వామిపై కోపం పెంచుకోకుండా, మీ పార్ట్ నర్ మాట్లాడే మాటలు మరియు మీకు ఎలా అనిపిస్తాయో.. మీరెంతలా బాధపడతున్నారో.. అనే విషయాన్ని అతనికి వివరించేందుకు ప్రయత్నించండి.

వీడు మాములోడు కాదండోయ్... ఏకంగా 150 మందిని తల్లుల్ని చేసేశాడు...వీడు మాములోడు కాదండోయ్... ఏకంగా 150 మందిని తల్లుల్ని చేసేశాడు...

మీ యాంగిల్ లో..

మీ యాంగిల్ లో..

మీ భాగస్వామిని ఒక్కసారి మీ స్థానంలో ఉండి.. మీ యాంగిల్ లో చూడమని చెప్పండి. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించమని చెప్పండి. అప్పుడే మీ పార్ట్ నర్ మిమ్మల్ని కొంతైనా అర్థం చేసుకోవచ్చు.

మీకు అండగా..

మీకు అండగా..

అప్పటి నుండి మిమ్మల్ని ఎగతాళి చేయకుండా.. మిమ్మల్ని అవమానించకుండా మీకు అండగా ఉండేందుకు సహాయపడొచ్చు. మీరు ఈ పరిస్థితిని ఇలా నెమ్మదిగా మార్చుకునే ప్రయత్నం చేయండి.

సానుకూలంగా..

సానుకూలంగా..

మీరు ఇలాంటి పరిస్థితులను ప్రతికూలంగా చూస్తే.. మీరు అన్ని సమస్యలే ఎదురవుతాయి. కాబట్టి మీరు ఇలాంటి వాటిని ఎక్కువగా సానుకూలంగా చూడటం వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అంటే మీ భాగస్వామి మిమ్మల్ని అస్తమానం తిడుతూ ఉండటం అతని ఉద్దేశ్యం కాదు. అలా ఎందుకు చెబుతున్నాడో అనే విషయాలను మీరు కూడా ఆలోచించాలి.

నిరాశ చెందకండి..

నిరాశ చెందకండి..

ఇలాంటి విషయాల్లో మీరు నిరాశ చెందకుండా ప్రతి విషయాన్ని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. అంతేగానీ నిరాశ చెందకండి. ముందు మిమ్మల్ని మీరేంటో గ్రహించండి. ప్రతిరోజూ ఉదయం చేయాల్సిన పనులేంటి.. బరువు తగ్గేందుకు ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వండి.

లైఫ్ హ్యాపీగా ఉండాలంటే..

లైఫ్ హ్యాపీగా ఉండాలంటే..

అన్నింటికంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి. దీని వల్ల మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇలాంటివి మీకు హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాం. అయితే మీకు ఈ సమస్య మరీ పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ ను సంప్రదించండి. తను చెప్పిన సలహాలను జాగ్రత్తగా పాటించాలి. దీని కోసం ఎలాంటి మోహమాటం పడకండి.

English summary

Things to Do When Your Partner Doesn't Satisfy You

Here are these things to do when your partner doesn't satisfy you. Take a look