For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగు పదుల వయసు దాటాక ఆ కార్యం కష్టమేనా? ఒకవేళ మళ్లీ అవకాశమొస్తే..

40 ఏళ్ల వయసు దాటిన తర్వాత రొమాన్స్ చేయాలనుకుంటే.. ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి.

|

'లైఫ్ లోకి 40 ఏళ్లు వచ్చాయంటే.. కళ్ల కింద క్యారీ బాగులు.. పైనేమో బట్ట.. కిందేమో పొట్ట.. మార్నింగ్ జిమ్.. ఈవినింగ్ రమ్.. కిడ్స్ బాదరింగ్.. ఫ్రెండ్స్ తో గ్యాదరింగ్.. లైఫ్ ఈజ్ టూ షార్ట్.. డోంట్ వేస్ట్ ఇట్.. ఆఫీసులో కుర్రకారు కాంపిటీషన్..ఆన్ సైట్ ఆఫర్ల లాగా లాగేస్తున్నారు.

Things To Know About Romance After the age of 40 in Telugu

వైఫ్ సీరియల్స్ లో బిజీ.. కిడ్స్ ఏమో 'జోష్'లో బిజీ బిజీ.. నేనొక్కడినే ఒంటరిగా.. నాగబాబులాగా ఫేసులో నవ్వు లేదు.. అందుకే అప్పుడప్పుడు నవ్వుతూ ఉండండి.. టీనేజో పోయి.. ఓల్డ్ ఏజ్ వచ్చే.. అన్న లైన్ కాస్త అంకుల్ ట్యాగ్ వచ్చే.. అప్పుడే వోల్టేజ్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్..' అంటూ నాలుగు పదుల వయసు ఉన్న వారు పాటలు పాడుకుంటూ.. తమ టీనేజీ లైఫ్ మళ్లీ వస్తే బాగుంటుందని భావిస్తూ ఉంటారు.

Things To Know About Romance After the age of 40 in Telugu

అయితే కొందరు మాత్రం వయసుతో పని లేకుండా ప్రేమ, రొమాన్స్ రెండూ కానిచ్చేస్తుంటారు. మరికొందరు అదంతా కేవలం యువత చేసే పని. వయసులో ఉన్నప్పుడే అని భావిస్తూ ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. నాలుగు పదుల వయసు దాటాక కూడా కొంతమందిలో ప్రేమ పుడుతుందట. ఎందుకంటే ప్రేమకు వయసుతో పనిలేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వయసులో ఆ కార్యంలో పాల్గొంటే ఏమైనా సమస్యలొస్తాయా? లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కపుల్స్ మధ్య ఈ లక్షణాలుంటే.. కలిసి బతకడం కష్టమే...!కపుల్స్ మధ్య ఈ లక్షణాలుంటే.. కలిసి బతకడం కష్టమే...!

ఆ వయసులో..

ఆ వయసులో..

నాలుగు పదుల వయసు ఒంటి మీదకొచ్చేసరికి లైటుగా పొట్ట.. పైన బట్ట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరికి మాత్రం ఇవి పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ వయసులో కూడా లవ్ చేయడం.. రొమాన్స్ చేయాలని అనిపించడం వారికి చాలా సరదాగానే ఉంటుంది. అయితే ప్రస్తుత సమాజం ఇలాంటి వాటిని అంగీకరించకపోవచ్చు.

ప్రేమ కోసం..

ప్రేమ కోసం..

ఇతరుల గురించి పక్కనబెడితే... మీరు ఏ వయసులో ఉన్న వారిని ప్రేమించినా.. వారి కోసం ఏదైనా చేయాలనుకుంటారు. వారు మిమ్మల్ని ఎలా మారాలని కోరుకున్నా ఇట్టే మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జీవితంలో 40 సంవత్సరాల వయసు దాటాక.. అన్ని విషయాలు గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏం ఉండదు కాబట్టి.. ఎదుటి వ్యక్తి కోసం మారడం చాలా సులభమే అనుకుంటారు. కానీ అలా మారాలంటే మీకు ఇష్టమైన వ్యక్తి మీ జీవితంలోకి రావాలి.

మరో బంధంలో..

మరో బంధంలో..

కొందరు వ్యక్తులు నాలుగు పదుల వయసు దాటాక అప్పటిదాకా కొనసాగిన బంధాన్ని ముగించాలని భావిస్తారు. అందుకే విడాకులు ఇచ్చి విడిపోవడం వంటివి చేస్తుంటారు. అక్కడితో ఆగకుండా కొత్త బంధం కోసం వెతుకుతూ ఉంటారు. అయితే అంత త్వరగా ఏ బంధానికి దగ్గర కాలేరు. ఎదుటి వ్యక్తులను పూర్తిగా నమ్మలేరు కూడా. ఒకసారి తమ భాగస్వామితో బంధాన్ని కోల్పోవడం వల్ల దాని ప్రభావం వారిపై ఎక్కువగానే ఉంటుంది.

పెళ్లయ్యాక.. పిల్లలు పుట్టాక.. ఆ పని చేద్దామంటే..పెళ్లయ్యాక.. పిల్లలు పుట్టాక.. ఆ పని చేద్దామంటే..

ఇండిపెండెంట్ గా..

ఇండిపెండెంట్ గా..

40 సంవత్సరాలు దాటిన చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. అందుకే ఎవ్వరి మీద ఆధారపడాలని వారు కోరుకోరు. అందుకే వారు తొందరగా రిలేషన్ షిప్ లో ఇమడలేరు. నాలుగు పదుల వయసు దాటిన తర్వాత వారి జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తారని కూడా ఎవ్వరూ ఊహించలేరు. ఒకవేళ వచ్చినా.. వారి కంటే వయసు తక్కువ కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాల్లో కేర్ ఫుల్ గా ఉండాలి.

కొత్త ప్రపంచం..

కొత్త ప్రపంచం..

40 ఏళ్లు వచ్చే వరకు ఎలాగోలా జీవించిన వారు.. ఆ తర్వాత కొత్త ప్రపంచం కావాలని కోరుకుంటారు. అందుకే కొత్త వ్యక్తుల కోసం అన్వేషిస్తారు. వారిని కలవడానికి ఆసక్తి చూపుతారు. అయితే కొంత కాలం తర్వాత ఇలాంటి సంబంధాలలో ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కాలంలో మీరు ఎవ్వరినీ త్వరగా కలవలేరు. కొత్త అలవాట్లను అలవర్చుకోవడం కూడా కష్టమవుతుంది.

కొంచెం కష్టం..

కొంచెం కష్టం..

40 దాటాకా కొత్త సంబంధం అంటే కొంత కష్టమే. ఎందుకంటే మీ చుట్టూ ఉండే వారు మిమ్మల్ని జడ్జ్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. మీ ఫేసులోనూ గ్లో తగ్గుతుంది. మీ కళ్ల కింద క్యారీబాగులు వచ్చి ఉంటాయి. మీ వయసు కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది కాబట్టి మీతో కలవడానికి ఎవ్వరూ అంత త్వరగా రారు.

అది తగ్గుతుంది..

అది తగ్గుతుంది..

అంతేకాదు 40 సంవత్సరాలు దాటాక కొత్తగా ఆ కార్యంలో పాల్గొనాలన్నా.. రొమాన్స్ చేయాలన్నా మీలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కొందరిలో హార్మోన్ల సమస్య వస్తుంది. మరికొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి.. ఈ వయసులో ప్రేమ, డేటింగ్ అంటే కాస్త కష్టమైన పనే అని చెప్పొచ్చు.

English summary

Things To Know About Romance After the age of 40 in Telugu

Here are these things to know about romance after the age of 40 in Telugu. Have a look
Story first published:Wednesday, August 18, 2021, 16:46 [IST]
Desktop Bottom Promotion