For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జీవితభాగస్వామితో అన్ని చెప్పొద్దు, కొన్ని దాచుకోవాలి, అవేంటో తెలుసా..?

|

దాంపత్యబంధం.. దానిని ఆస్వాదించాల్సిందే కానీ దాని మాధుర్యం గురించి మాటల్లో చెప్పలేం. పూర్తిగా కొత్త వ్యక్తిని జీవితభాగస్వామిని చేసుకుని వారితో కడదాకా ప్రయాణించడం మాటల్లో చెప్పుకున్నంత సులువుగా ఏమీ ఉండదు. అర్థం చేసుకుంటూ, అడ్జస్ట్ అవుతూ ముందుకు సాగుతుంటే దాంపత్య బంధంలోని మాధుర్యం ఏమిటో అర్థం అవుతుంది. ఇష్టం, ప్రేమ, బాధ, కోపం ఇలా ప్రతి భావోద్వేగం దాంపత్యబంధంలో ఉంటుంది. ఆయా భావోద్వేగాలను నియంత్రించుకునే తత్వం, ఎదుర్కొనే శక్తిపైనే దాని దాంపత్యబంధంలోని తీపి ఆధారపడి ఉంటుంది. ఏ రెండు జంటలూ ఒకేలా ఉండవు. ఒక జంట ఆనందంగా ఉన్నా, లేదా నిత్యం గొడవలు, ఘర్షణలతో బాధగా ఉన్నా ఆ జంటలో పోలిక ఉండకూడదని చెబుతారు రిలేషన్ షిప్ నిపుణులు.

జీవితాంతం తోడుగా ఉండే భాగస్వామితో ప్రతి విషయాన్ని పంచుకోవాలని అప్పుడే ఎలాంటి అపార్థాలు లేకుండా దాంపత్యబంధాన్ని కొనసాగించవచ్చని కొందరు అంటుంటారు. అయితే భాగస్వామితో అన్ని విషయాలు పంచుకోవాల్సిన అవసరం లేదని, కొన్ని విషయాలను దాచిపెడితేనే ప్రయాణం సాఫీగా సాగుతుందని అంటున్నారు నిపుణులు.

మరి జీవిత భాగస్వాముల నుండి దాచాల్సిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మరి జీవిత భాగస్వాముల నుండి దాచాల్సిన ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మీకు వారి కుటుంబం అంటే ఇష్టలేదా..

మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమించినా, వారి కుటుంబం పట్ల మీకు అదే భావాలు ఉండాల్సిన అవసరం లేదు.

అయితే వారి కుటుంబం అంటే మీకు ఇష్టం లేదన్న విషయాన్ని మీ భాగస్వామితో పంచుకోవద్దని అంటున్నారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. దీని వల్ల లేనిపోని వాదనలు, వాటి నుండి గొడవ, ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. మీకు వారంటే ఇష్టం లేదన్న విషయాన్ని దాచడం వల్ల జరిగే నష్టం లేదని వివరిస్తున్నారు.

2. సోషల్ మీడియాలో మీ ఎక్స్ లేదా వారి ఎక్స్ ను ఫాలో అవుతుంటే..

2. సోషల్ మీడియాలో మీ ఎక్స్ లేదా వారి ఎక్స్ ను ఫాలో అవుతుంటే..

మీరు మీ ఎక్స్ ప్రొఫైల్‌ను ఫాలో అయ్యే విషయాన్ని మీ భాగస్వామికి చెప్పడం గొడవలకు దారి తీయవచ్చు. మీకు ఇంకా ఎక్స్ అంటే ఇష్టం ఉన్నట్లు చెప్పకే చెప్పడం వల్ల వాగ్వాదం తప్పక తలెత్తుతుంది.

మీ భాగస్వామి ఎక్స్ గురించి తెలుసుకోవడం, వారి మధ్య మళ్లీ కమ్యూనికేషన్ జరుగుతోందా అని తెలుసుకోవాలని ఉండవచ్చు. కానీ మీరు అలా చేస్తున్న విషయం మీ భాగస్వామికి తెలిస్తే పెద్ద గొడవ జరగడం మాత్రం ఖాయం. కాబట్టి మీరు అలా చేసినా మీ భాగస్వామికి తెలియకుండా చూసుకోవాలి.

3. పులిహోర కలుపుతున్నారా..

3. పులిహోర కలుపుతున్నారా..

మీరు పులిహోర కలిపినా, మీతో ఎవరైనా పులిహోరా కలిపిన ఆ విషయాన్ని మీ భాగస్వామికి తెలియకుండా చూసుకోండి. వేరే వ్యక్తులు మీకు దగ్గర అవుతున్నా, మీతో చనువుగా ఉన్నా, మీ భాగస్వామికి ఎట్టిపరిస్థితుల్లోనూ నచ్చదన్న విషయం గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఫ్లర్టింగ్ చేస్తుంటే ఆ విషయం మీ భార్యకో, భర్తకో తెలిస్తే వారిలో అభద్రతాభావం కలిగే అవకాశం ఉంటుంది. అది ఇతర పరిణామాలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు. ఇది బంధంలో ఏమాత్రం మంచిది కాదని గుర్తుంచుకోండి.

4. వారు ఇచ్చిన బహుమతి మీకు నచ్చలేదా?

4. వారు ఇచ్చిన బహుమతి మీకు నచ్చలేదా?

బంధంలో భాగస్వాములు మీకు అప్పుడప్పుడు సర్ ప్రైజ్ బహుమతులు ఇస్తుండవచ్చు. ఆ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు వారిలోని ప్రేమ చూడాలి తప్ప, ఆ బహుమతి విలువనో లేదా దాని రూపాన్నో చూడకూడదు. ఒకవేళ మీకు ఆ బహుమతి నచ్చలేదా, అయినా సరే నచ్చలేదు అని మీరు డైరెక్ట్ గా మాత్రం చెప్పొద్దు. వారు ఎంతో ప్రేమతో ఆ బహుమతి మీకోసం తెచ్చి ఉంటారు.

5. గతంలో చేసిన ఇబ్బందికరమైన విషయాలు

5. గతంలో చేసిన ఇబ్బందికరమైన విషయాలు

పెళ్లికి ముందు ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది. ఆ గతంలో ఏదో చిలిపి పని ప్రతి ఒక్కరూ చేసే ఉంటారు. అయితే నవ్వు తెప్పించే తీపి జ్ఞాపకాలను పంచుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే మీ గతంలో జరిగిన కొన్ని విషయాలు మిమ్మల్ని ఇప్పటికీ ఇబ్బండి పెట్టేవి అయితే వాటి గురించి మీ భాగస్వామికి చెప్పకపోవడమే మంచిది.

6. మీరు ఎంత డబ్బు సంపాదిస్తారు

6. మీరు ఎంత డబ్బు సంపాదిస్తారు

వేర్వేరు వ్యక్తులు వారి సంబంధాలలో వివిధ స్థాయిల పారదర్శకతను పాటిస్తారు. కొంతమందికి, వారి ఆర్థిక విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవడం చాలా ముఖ్యమని భావిస్తారు. ఇద్దరూ కలిసి వారి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ వేసుకుంటారు.

కొంతమంది మాత్రం వారు ఎంత సంపాదిస్తారు, పెట్టుబడి పెట్టడం లాంటి విషయాలను భాగస్వాములతో పంచుకోరు. ఎంత డబ్బు సంపాదిస్తారనే విషయాన్ని పంచుకోవడం, పంచుకోకపోవడం పూర్తిగా వారి ఆర్థిక సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.

English summary

Things you should never say to your spouse in Telugu

read on to know Things you should never say to your spouse in Telugu
Story first published:Friday, November 18, 2022, 10:35 [IST]
Desktop Bottom Promotion