For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘నేను బాస్ తో క్లోజ్ గా ఉన్నానని... కొలీగ్స్ నా గురించి..’

|

ఈ లోకంలో ఉండే ప్రతి వ్యక్తికి ప్రేమ, స్నేహం వంటి బంధాల్లో ఉన్న వారి మధ్య ఎప్పటికీ అధికారిక విషయాలు మధ్యలో రాకూడదు. అలా వస్తే అనేక సమస్యలొచ్చేస్తాయి. ఇదిలా ఉండగా.. ఓ వివాహిత స్త్రీ, తన ఆఫీసులో తన బాస్ తో కొన్ని నెలలుగా డేటింగులో పాల్గొంటుందట.

తన బాస్ కు కూడా ఆమె బాగా ఇష్టమట. అయితే వీరిద్దరినీ చూసి ఆఫీసులో అందరూ ఏవేవో దుష్ప్రచారాలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రమోషన్ కోసమే, తను ఇలా చేస్తోందని రూమార్స్ క్రియేట్ చేశారట.

ఈ నేపథ్యంలో తను ఆ సమస్య నుండి ఎలా బయటపడింది. అందరికీ ఎలా సమాధానమిచ్చింది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆలుమగలు ఆ విషయంలో అస్సలు రాజీ పడకూడదట...!

మూడు నెలలుగా..

మూడు నెలలుగా..

హాయ్ ‘నా పేరు భానుమతి (పేరు మార్చాం). నేను ఇటీవలే కొత్తగా ఓ ఆఫీసులో చేరాను. అయితే నాకు నా రంగంలో చాలా అనుభవముంది. నేను కొత్తగా చేరిన ఆఫీసులో నా బాస్ నాకు చిన్ననాటి మిత్రుడే అని అక్కడికి చేరాక తెలిసింది. తను చూడటానికి అందంగా ఉంటాడు. నాకు చిన్నప్పటి నుండే పరిచయం కాబట్టి చాలా క్లోజ్ గా ఉండేదాన్ని.

డేట్ చేస్తున్నాం..

డేట్ చేస్తున్నాం..

మా ఇద్దరికీ ఒకరంటే ఒకరం బాగా ఇష్టం కనుక.. మేమిద్దరం మూడు నెలలుగా డేటింగులో పాల్గొంటున్నాం. మా ఇద్దరికీ మా భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచనలు లేవు. కాబట్టి ప్రస్తుతానికి బాగా ఎంజాయ్ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. కానీ అదే మాకు సమస్యగా మారింది.

ఆఫీసులో అందరూ..

ఆఫీసులో అందరూ..

అయితే మేమిద్దరం బాగా క్లోజ్ గా ఉండటాన్ని చూసిన కోలిగ్స్ నేను కేవలం ప్రమోషన్ కోసమే బాస్ ను బుట్టలో వేసుకున్నానని, అందుకే తనతో డేట్ చేస్తున్నాననీ, ఈజీగా ప్రమోషన్ కోసమే అలా చేస్తున్నాని, నా కొలీగ్స్ భావిస్తున్నారు. అంతేకాదు ఆఫీసులో అంతా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

మీరు సరైన వ్యక్తినే సెలెక్ట్ చేసుకున్నారా? ఎలా తెలుసుకోవాలంటే...

ఫోకస్ తగ్గిపోతుంది..

ఫోకస్ తగ్గిపోతుంది..

దీంతో మా ఇద్దరి మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు నాకు పని మీద ఫోకస్ చేయడం చాలా కష్టమయిపోతుంది. ఎందుకంటే మా బాస్ నాకు చాలా దగ్గర్లో కూర్చుంటాడు. ఇది నా పనిని డిస్టబ్ చేస్తోంది. అయితే మేమిద్దరం గొడవ పడ్డప్పుడల్లా.. తను నా వైపు చూసి వెకిలి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. దీంతో మేమిద్దరం ఎందుకు గొడవపడ్డామనే విషయం ఆఫీసులో చర్చగా మారుతోంది.

ఆఫీసు వాతావరణం..

ఆఫీసు వాతావరణం..

ఇలాంటి ఆఫీసులో ఉండే కొలీగ్స్ మధ్య ఉంటూ.. ప్రతికూల వాతావరణంలో నేను పనిచేయడం చాలా కష్టమైపోతోంది. నా పని వరకు ఓకే గానీ.. ఆఫీసు వాతావరణమే ఏ మాత్రం బాగాలేదు. ఆఫీసులో బాస్ తో ఉండే చనువు అంత చెడ్డదా? నేను ఇప్పుడేం చేయాలి. నాకో మంచి సలహా ఇవ్వగలరు' అని ఓ మహిళ తన సమస్యను చెప్పుకొచ్చింది.

దగ్గరగా కూర్చోవడం వల్ల..

దగ్గరగా కూర్చోవడం వల్ల..

మీరిద్దరూ ఆఫీసులో దగ్గరగా కూర్చోవడం వల్ల.. మీ ఇద్దరి మధ్య ఏదైనా విషయంపై చిన్న చిన్న గొడవలు రావడం అనేది అత్యంత సహజం. ఎందుకంటే ఏ ఆఫీసులో అయినా అప్పుడప్పుడు గొడవలు అవుతుంటాయి. దీంతో కొలీగ్స్ తప్పుగా అర్థం చేసుకుంటారు.

‘నేను కన్యను కాదని.. నాకు కాబోయే భర్తకు చెప్పొచ్చా..'

రూమార్స్ క్రియేట్ చేస్తే..

రూమార్స్ క్రియేట్ చేస్తే..

వారు అక్కడితో ఆగకుండా మీ గురించి.. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి కొన్ని వినకూడని మాటలను రూమార్స్ క్రియేట్ చేసేస్తారు. ఇలాంటి సమయంలో పనిపై ఫోకస్ పెట్టడం చాలా కష్టమే. అయితే మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం కాబట్టి.. మీరు డేట్ లోకి వెళ్లే ముందే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీ ఆఫీసులో ఎదురయ్యే పరిణామాల గురించి ఊహించాల్సింది. ఎందుకంటే మీరిద్దరూ కమిట్ అయి ఉన్నారు కాబట్టి.. మీ ఇద్దరూ ఈ పరిస్థితి గురించి మాట్లాడుకుని ఏం చేయాలో ఒక నిర్ణయానికి రావొచ్చు.

ఆఫీసు టైమ్ లో..

ఆఫీసు టైమ్ లో..

మీ ఆఫీసులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదంటే.. మీ ఇద్దరూ ఆఫీసులో వ్యక్తిగత విషయాలను అస్సలు ప్రస్తావన తీసుకురావొద్దు. కేవలం ఆఫీసు పని గురించి మాత్రమే మాట్లాడాలి. మీరు అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. మీరు ప్రమోషన్ కోసమే మీ బాస్ తో క్లోజ్ గా ఉంటున్నారనేందుకు అస్సలు అవకాశమివ్వద్దు. మీరు కేవలం మీ పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలి.

ఇతరులను పట్టించుకోకుండా..

ఇతరులను పట్టించుకోకుండా..

మీ ఆఫీసులో మీకు, మీ బాస్ కు మధ్య సంబంధం గురించి వ్యక్తులుగా వారి అభిప్రాయాల ప్రకారమే వారు మాట్లాడతారు. కాబట్టి మీరు ఇతరుల గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవాలి. మీ శక్తి, సామర్థ్యాలను మీ పనిలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించండి. మీరు మీ పనితో పాటు, మీ బాస్ రిలేషన్ లో హ్యాపీగా ఉన్నారు కాబట్టి.. కొలీగ్స్ వల్ల కొంత చిరాకు అనేది సహజంగానే ఉంటుంది.

కొన్ని లిమిట్స్..

కొన్ని లిమిట్స్..

మీకు, మీ బాస్ కు మధ్య ఏ రిలేషన్ ఉన్నా మీరు ఆఫీసు లోపల, ఆఫీసు బయట కొన్ని లిమిట్స్ లో ఉండాలి. ముఖ్యంగా పర్సనల్ విషయాలను ఆఫీసులో అస్సలు ప్రస్తావించకూడదు.. అలాగే పర్సనల్ గా కలిసినప్పు ఆఫీసు మ్యాటర్లు మాట్లాడకూడదు. అప్పుడు మీరు మీ పర్సనల్ లైఫ్ గురించి ఎవ్వరికీ జవాబు చెప్పే పని ఉండదు. అప్పుడు మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు.

English summary

Tips For Dealing With A Know-It-All Coworker in Telugu

Here are the tips for dealing with a know-it-all coworker in Telugu. Take a look
Story first published: Friday, May 14, 2021, 16:35 [IST]