For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిట్కాలను పాటిస్తే మీ భాగస్వామి మీతోనే ఉండిపోతుంది.. మీ కోరికలను వద్దన్నా తీరుస్తుంది..

మీ భాగస్వామి పట్ల మీకు ఉన్న నమ్మకం మరియు గౌరవం మీ రిలేషన్ షిప్ లో మీకు ఉన్న పరిపక్వత స్థాయిని ప్రతిబింబిస్తుంది.

|

ప్రేమలో లేదా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు, అపార్థాలు అత్యంత సాధారణం. మీరు వాటిని ఎంత అందంగా అధిగమిస్తారో అంతే బలంగా బంధం మరింత బలపడుతుంది. దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిత్యం మీ భాగస్వామిపై ప్రేమ మరియు శ్రద్ధను పెంచుకోవాలి.

 Relationship

మామూలుగా మీ బంధం బలపడేందుకు ప్రేమ మాత్రమే సరిపోదు అంతకంటే క్లిష్టమైన పరిస్థితులను నిర్వహించడానికి మీరు పరిణతి మెందాలి. అప్పుడే ప్రేమ మరియు ప్రేమ మరియు పరిపక్వత కలిసిపోతాయి. ఇంతకీ అలాంటి పరిపక్వత సాధించడానికి ఏమి చేయాలి.. ఎలా చేయాలి.. ఈ కింది ఆర్టికల్ ను స్క్రోల్ చేసి తెలుసుకోండి.

ఎక్కువ కాలం రిలేషన్ షిప్..

ఎక్కువ కాలం రిలేషన్ షిప్..

మీరు మీ భాగస్వామితో రిలేషన్ షిప్ ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటే, మీరు స్వార్థాన్ని విసిరేయాలి. మీరు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, మీరు మీ భాగస్వామిని నిజంగా బాగా చూసుకుంటున్నారని మరియు అతనికి లేదా ఆమెకే కట్టుబడి ఉన్నారనే వాస్తవ విషయాలను ధృవీకరించుకోవాలి. ఒకవేళ మీరు గనక ఎప్పుడూ గొడవపడుతుంటే స్వార్థాన్ని వదిలి మౌనంగా ఉండటం లేదా వద్దు అని చెబితే వాదనలను సులభంగా తప్పించుకుంటారు.

మీ భాగస్వామిని గౌరవించండి..

మీ భాగస్వామిని గౌరవించండి..

మీ భాగస్వామి పట్ల మీకు ఉన్న నమ్మకం మరియు గౌరవం మీ రిలేషన్ షిప్ లో మీకు ఉన్న పరిపక్వత స్థాయిని ప్రతిబింబిస్తుంది. కొన్ని సమయాల్లో, మీకు మరియు మీ భాగస్వామికి మధ్య అపార్థాలు ఏవైనా వస్తే, అలాంటి సమయంలో మీరు మీ భాగస్వామిని విశ్వసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ భాగస్వామి ప్రవర్తనపై మీరు కలత చెందినా లేదా ఇంకేదైనా విషయం కావచ్చు, మీరిద్దరూ ఏదైనా ఫంక్షన్ కు వెళ్లినప్పుడు, లేదా ఎక్కడికైనా బయటికి కలిసి వెళ్లినప్పుడు మీరు మీ భాగస్వామితో కలిసే నిలబడాలి. అలాంటి సమయంలో కోపం తెచ్చుకునే కంటే, మీరు మీ అభిప్రాయాన్ని వినిపించి సమస్యను పరిపక్వంగా పరిష్కరించవచ్చు.

మీ భాగస్వామి పర్ఫెక్ట్ గా ఉంటారని ఆశించొద్దు..

మీ భాగస్వామి పర్ఫెక్ట్ గా ఉంటారని ఆశించొద్దు..

ఈ ప్రపంచంలో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, కాబట్టి మీ భాగస్వామి నుండి మీరు అలా ఆశించకండి. మీ భాగస్వామి యొక్క లోపాల గురించి మాట్లాడటం వల్ల మీ రిలేషన్ షిప్ మరింత దిగజారొచ్చు. మన జీవితం బ్లాక్ అండ్ వైట్ కాదు. రిలేషన్ షిప్ కలర్ ఫుల్ గా ఉండాలి. అందువల్ల మీరు అతని/ఆమె తంత్రాలు మరియు మూడ్ స్వింగర్లను సులభంగా నిర్వహించగలరు. క్లుప్తంగా, మీరు మీ భాగస్వామి లోపాలను ఎల్లప్పుడూ అంగీకరించాలి. అతను/ఆమె బలహీనతల ఆధారంగా అతను/ఆమె తీర్పు చెప్పకూడదు. పొరపాటున మీరు కోపంతో ప్రతికూల పదాలు వాడితే మీ రిలేషన్ షిప్ దెబ్బతింటుంది. మీరు అతని/ఆమె లోపాలను ప్రశంసించాలి. ఈ విధంగా పరిపక్వత ప్రతిబింబిస్తుంది.

సహనం చాలా అవసరం..

సహనం చాలా అవసరం..

ప్రతి రిలేషన్ షిప్ లోనూ ఎల్లప్పుడూ ఒడిదుడుకులు అనేవి సహజం. కానీ ఒత్తిడిలో ఉన్న సమయంలో మీ రిలేషన్ షిప్ పరిస్థితులు అధ్వానంగా మారొచ్చు. అందుకే గొడవల సమయంలో, మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ భాగస్వామిదే తప్పు అని తెలిసి కూడా, మీ గొంతు పైభాగంలో పలకడానికి బదులుగా, మీకు ఓపిక ఉండాలి. మీ భాగస్వామి మంచి మానసిక స్థితికి చేరుకున్న తర్వాత, మీరు అతనికి/ఆమెకు విషయాలను వివరించవచ్చు. మీరు కఠినమైన సమయంలో కూడా ప్రశాంతంగా మరియు ఓపికగా ఉన్నప్పుడే పరిపక్వత వస్తుంది.

అవసరాలను అర్థం చేసుకోవాలి..

అవసరాలను అర్థం చేసుకోవాలి..

ప్రతిసారీ మీరు మీ డిమాండ్లను మీ భాగస్వామి ముందు ఉంచుకుంటే అది చాలా అసభ్యంగా ఉంటుంది. ఇది పరిపక్వత స్థాయిని ఏ మాత్రం చూపించదు. మీరు ఒకరి అవసరాలను అర్థం చేసుకోవాలి. అప్పుడే మీ భాగస్వామి ఆనందంగా ఉంటారు. మీరు మీ భాగస్వామిపై శ్రద్ధ చూపుతున్నారని విశ్వసిస్తారు.

నిర్ణయం తీసుకునే ముందు..

నిర్ణయం తీసుకునే ముందు..

మీరు నిర్ణయం తీసుకునే ముందు మీ భాగస్వామి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. చాలా మంది తమ భాగస్వామి ఆలోచనలను విస్మరిస్తారు. అవతలి వ్యక్తి తప్పు అని అవలీలగా నమ్ముతారు. ఇది మీ భాగస్వామికి విరుద్ధంగా ఉండొచ్చు.

తప్పులను అంగీకరించండి..

తప్పులను అంగీకరించండి..

మీ తప్పు లేకపోయినా తప్పులను అంగీకరించడం మరియు క్షమాపణ చెప్పడం వంటివి చేయాలి. మీ రిలేషన్ లో ఇది చాలా ముఖ్యమైనది. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. కానీ మీ భాగస్వామి తమ తప్పులను అవమానంగా లేదా మనస్తాపం చెందకుండా ఉండేలా అర్థం చేసుకోవడం అంతే అవసరం. మీ భాగస్వామి తప్పుచేస్తే, తన తప్పులను గ్రహించడంలో సహాయం చేయాలి. కానీ ప్రశాంతంగా ఉండాలి. ఉదాహరణకు మీరు ఇలా చెప్పొచ్చు. ‘మీరు ఉదయం వాకింగ్ వెళ్లినప్పుడు తలుపు తీయడం నేను మరచిపోయానని అనుకుంటున్నాను. మీరు దానిని పునరావృతం చేయరని నాకు తెలుసు‘, అంతేకాదండోయ్, మీ భాగస్వామి అతను/ఆమె చేసిన తప్పులకు క్షమాపణలు చెబుతుంటే, మీరు క్షమించాలి. పగ పెంచుకోవడం ఏ సంబంధానికైనా ఆరోగ్యకరమైనది కాదు.

కట్టుబడి ఉండాలి..

కట్టుబడి ఉండాలి..

మీరు మీ భాగస్వామికి ఏదైనా వాగ్దానం చేస్తే మీరు దానికి కట్టుబడి ఉండాలి. మీ సంబంధం గురించి మీరు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో దీని ద్వారా తెలుస్తుంది. రిలేషన్ షిప్ లో పని చేయడానికి ఒక పెద్ద మొత్తంలో పరిపక్వత కలిగి ఉండాలి. నిబద్ధతను చూపించాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలోనే దేన్ని వదిలేయొద్దు.

English summary

Tips That Will Make You More Mature In Your Relationship

Your trust and respect for your partner reflects the level of maturity you have in your relationship ship. Sometimes, if there are any misunderstandings between you and your partner, you need to trust your partner at that point. Whether you are upset about your partner's behavior or something else, you should meet with your partner when the two of you go to any function, or go out somewhere.
Story first published:Monday, September 16, 2019, 18:36 [IST]
Desktop Bottom Promotion