Latest Updates
-
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
Hug Day 2022 : కౌగిలింతల్లో ఏదో తెలియని పులకింత... మనసులోనూ ఏదో గిలిగింత...
కౌగిలింత అనేది ముద్దూ ముచ్చటలకు స్వాగతం పలికే ఆహ్వానం. రొమాన్స్ అనేది కౌగిలింతతో ప్రారంభమై అది ఫాంటసీలకు కూడా దారి తీస్తుంది.
ఒక కౌగిలింత అనేది మనిషిలో భిన్నమైన భావోద్వేగాలకు ప్రేమకు చక్కటి చిహ్నం. ఆలింగనం అనేది మరింత ఎక్కువగా ప్రేమను పంచుతుంది. మీరు ఎవరినైనా ప్రేమతో ఆలింగనం చేసుకుంటే అది ప్రత్యేకమైన అనుభూతికి సహాయపడుతుంది.

అంతే కాదు ఆలింగనం అనేది విరిగిన హృదయాలను కూడా అతికించే ప్రయత్నం చేస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే కౌగిలింతలలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రతి సందర్భానికి తగ్గట్టు ప్రత్యేకమైన కౌగిలింతలు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు మీరు మీ భాగస్వామిని కౌగిలించుకుంటే అది వారికి సురక్షితమైన కౌగిలింతగా భావన కలుగుతుంది. ఈ ఫీలింగ్ పదాలతో వర్ణించలేని విధంగా ఉంటుంది. అలాంటి వివిధ రకాల కౌగిలింతలపై మీరు ఓ లుక్కేయండి... మీ నిజ జీవితంలోనూ వీటిని ప్రయత్నించండి.. ఎనలేని మధురమైన అనుభూతిని పొందండి...
చలికాలమంతా ఆ కౌగిలిలో అలాగే బంధిగా ఉండిపోవాలనిపిస్తుంది... ఆ వెచ్చదనంతో వచ్చే కిక్కే వేరప్పా..

బియర్ హగ్..
బియర్ హగ్ అనేది సాధారణంగా స్నేహితులు ఇచ్చి పుచ్చుకుంటారు. సాధారణంగా ఎలుగుబంట్లు వాటి బలంతో మనల్ని చంపగలవని చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే స్నేహితులను ఈ విధంగా ఈ కౌగిలితో పలకరించేవారు మంచి స్నేహితులుగా గుర్తింపు పొందుతారు.

ఆప్యాయతతో ఆలింగనం..
ఇలాంటి కౌగిలింతలు ‘ప్రేమికులకు ఎక్కువ.. స్నేహితులకు తక్కువ‘‘ అన్న రీతిలో మనకు దర్శనమిస్తుంటాయి. ఈ కౌగిలిలో ఎదుటి వ్యక్తిని ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. వారి భుజంపై తలవాలుస్తారు. అంతేకాదు ఆపై పక్కనే ఉండే చెవిలో ఏవేవో గుసగుసలు వినిపిస్తుంటారు. మీరు ఈ రకమైన కౌగిలింత ఒకరిపై మరొకరికి అమితమైన నమ్మకం ఉందని కచ్చితంగా తెలుపుతుంది.

వీడ్కోలు కౌగిలింత..
మీ మనసుకు దగ్గరగా ఉన్న ఎవరైనా మిమ్మల్ని వదిలి చాలా దూరం వెళ్తున్నప్పుడు మీరు వారిని చాలా సేపు కౌగిలించుకుంటారు. ఈ కౌగిలింతలో ఎక్కువగా కన్నీళ్లతో నిండి ఉంటుంది.

సన్నిహిత కౌగిలి..
ఈ రకమైన కౌగిలి అనేది మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి మాత్రమే ఉంటుంది. అది చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈ రకమైన కౌగిలిలో ఇద్దరు ప్రేమికులు వారి హృదయ స్పందనలను మరియు వారి శ్వాసను వింటారు.

ముద్దుల కౌగిలింత..
కౌగిలింత అనేది ముద్దూ ముచ్చటలకు స్వాగతం పలికే ఆహ్వానం. రొమాన్స్ అనేది కౌగిలింతతో ప్రారంభమై అది ఫాంటసీలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి మీరు ముద్దు లేదా అంతకంటే ఎక్కువ ఆహ్వానంగా కౌగిలింతను కూడా ఉపయోగించుకోవచ్చు.

పొలైట్ హగ్..
మన ముఖంలో సంతోషం.. పెదవిపై చిరునవ్వు కలగలిపి ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకోవడాన్ని పొలైట్ హగ్ అని పిలుస్తారు. ఇలాంటి ఆలింగనాలు చాలా ఎక్కువగా స్నేహితుల మధ్య మరియు తల్లిదండ్రులు, పిల్లల మధ్య తరచూ కనబడుతూ ఉంటాయి.

పట్టపగ్గాల్లేని ఆనందంతో...
ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూసిన వారు మన కళ్లెదుట వాలిపోతే.. అప్పుడు పట్టపగ్గాల్లేని ఆనందంతో అమాంతం వారాని కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు. ఈ కౌగిలిలో ఎదుటివారి చుట్టూ చేతులు రెండూ చుట్టేసి, వారిని గాఢంగా హత్తుకుని కౌగిలిలో బంధిస్తారు. ఎంతో ఆత్మీయతతో అందించే ఇలాంటి కౌగిలిని అందరూ స్వాగతిస్తారు. ముఖ్యంగా ప్రేమికులు ఇలాంటివి తెగ ఎంజాయ్ చేస్తారు.

అమ్మ కౌగిలింత..
మీరు మీ తల్లి ఎదపై ప్రేమతో తల వాలిస్తే అది అమ్మ కౌగిలింత.ఈ రకమైన కౌగిలింత ఒక్క మీ తల్లి మాత్రమే మీకు ఇవ్వగలదు. అయితే కొన్నిసార్లు ప్రేమికులు కూడా ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ఇలాంటి కౌగిలింతలు ఇచ్చుకుంటారు. కాబట్టి వీటిలో మీకు ఏ హగ్ నచ్చిందో వాటిని ప్రయత్నించి చూడండి... అద్భుతమైన అనుభూతిని పొందండి.



Click it and Unblock the Notifications
