For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వే! కరోనా సమయంలో శృంగార జీవితం గురించి యువత ఏం చెప్పారో తెలుసా?

|

కరోనా వైరస్ ఏ ఒక్కరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది మనిషి జీవితంపై ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపుతోంది.

ముఖ్యంగా మనషుల యొక్క మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దీని దెబ్బకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా చాలా వరకు కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు అవకాశం దొరికింది. వారంతా చాలా కాలం తర్వాత ప్రేమనురాగాల మధ్య జీవిస్తున్నారు.

అయితే లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఏకాంతంగా గడుపుదామనుకున్న జంటలకు నిరాశే ఎదురవుతోందట. భార్యభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు పెరుగుతున్నాయి. ఇది వారి శృంగార జీవితంపైనా తీవ్ర ప్రభావమే చూపుతోందట.

ఈ పరిస్థితి మన దేశంతో మెట్రో నగరాలతో పాటు అమెరికా, యుకె వంటి దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోందట. మరోవైపు లాక్ డౌన్ నిబంధనల వల్ల తమ ప్రియుడు/ప్రియురాలితో ఏకాంతంగా గడిపేందుకు అస్సలు అవకాశం దొరకడం లేదని యువత వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ శృంగార జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అన్న అంశంపై ఓ సంస్థ నిర్వహిస్తే.. అందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

సర్వే! భాగస్వామి బాడీలోని చెమటతో కోరికలు పెరగడమే కాదు... హాయిగా నిద్ర కూడా పడుతుందట..సర్వే! భాగస్వామి బాడీలోని చెమటతో కోరికలు పెరగడమే కాదు... హాయిగా నిద్ర కూడా పడుతుందట..

తక్కువ శృంగారం..

తక్కువ శృంగారం..

లాక్ డౌన్ కారణంగా కపుల్స్ మధ్య కలయిక బాగా జరుగుతుందని భావించిన వారికి నిరాశే ఎదురయ్యేందని ఆ సర్వేలో తేలిందట. కరోనా సమయంలో చాలా మంది జంటలు చాలా తక్కువ సమయమే శృంగారంలో పాల్గొన్నారట.

ఆసక్తి తగ్గుదల..

ఆసక్తి తగ్గుదల..

కరోనా లాక్ డౌన్ కారణంగా తొలిరోజుల్లో తమ భాగస్వామితో కలిసి ఏకాంతంగా గడిపేందుకు సమయం దొరికినప్పటికీ.. క్రమంగా శృంగార జీవితంపై ఆసక్తి తగ్గిపోయిందట. దీనికి కారణం ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి పెరగడమే అని చాలా మంది సమాధానమిచ్చారట.

కొత్తగా పెళ్లైన వారు..

కొత్తగా పెళ్లైన వారు..

ఇదే సమయంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కూడా శృంగార జీవితంలో దాదాపు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నామని చెప్పారట.

మీ పురుషాంగంలో అసురక్షిత సెక్స్ వల్ల కలిగే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇలా చేయండి ...!మీ పురుషాంగంలో అసురక్షిత సెక్స్ వల్ల కలిగే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఇలా చేయండి ...!

ప్రేమ పక్షులపైనా ప్రభావం..

ప్రేమ పక్షులపైనా ప్రభావం..

లాక్ డౌన్ సమయంలో సరైన ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు లేకపోవడంతో ప్రేమికులకు ఇది ప్రధాన సమస్యగా మారిందట. అంతేకాదు పార్కులు.. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు వంటివి మూసేయడంతో వారికి తీవ్ర నిరాశే ఎదురైందని యువతీ యువకులు వాపోయారు. అంతేకాదు ఏకాంతంగా తమకు కలుసుకునే అవకాశం అనేదే లేకపోవడంతో కలయికలో కూడా పాల్గొనలేదని చెప్పారు. లాంగ్ లాక్ డౌన్ కారణంగా తాము ఒంటరితనానికి గురవుతున్నామని, ఈ సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు.

సాన్నిహిత్యం పెరిగినా.. ఒత్తిడి కూడా..

సాన్నిహిత్యం పెరిగినా.. ఒత్తిడి కూడా..

ఉద్యోగులకు, వ్యాపారులకు లాక్ డౌన్ కారణంగా తమ భాగస్వామితో శృంగార విషయంలో సాన్నిహిత్యం పెరిగి, ఎంజాయ్ చేస్తున్నారనుకుంటే పొరపాటే. వారికి అదనపు బాధ్యతలు, మానసిక ఒత్తిడి, భౌతిక దూరం వంటి నిబంధనల కారణంగా వారి శృంగార జీవితం అనుకున్నంత హాయిగా సాగడం లేదని ఈ సర్వేలో తేలింది.

అనవసరమైన ఆందోళన..

అనవసరమైన ఆందోళన..

కరోనా వైరస్ మహమ్మారి గురించి నిరంతరం వార్తలను వింటూ.. తాజా సమాచారం గురించి తెలుసుకుంటూ చాలా మంది ఆందోళనకు గురవుతున్నారట. దీంతో చాలా శృంగారంపై ఆసక్తి చూపడం లేదట.

ఆగస్టులో పుట్టిన వారంతా అద్భుత శక్తులను కలిగి ఉంటారా?ఆగస్టులో పుట్టిన వారంతా అద్భుత శక్తులను కలిగి ఉంటారా?

శృంగారంపై ఆసక్తి ఉన్నా..

శృంగారంపై ఆసక్తి ఉన్నా..

మరికొందరు మహిళలు అయితే తమకు శృంగారంపై ఆసక్తి ఉన్నప్పటికీ.. తమ భాగస్వాములు కలయిక పట్ల ఆసక్తి చూపడం లేదని వాపోతున్నారు. దంపతుల్లో ఏ ఒక్కరికి ఆసక్తి లేకపోయినా.. పరిస్థితి పూర్తిగా మారిపోతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. మహిళలతో పోలిస్తే.. పురుషులకు ఎక్కువగా కుటుంబ భారాన్ని మోసే బాధ్యతలు ఉండటమే దీనికి కారణమని కూడా చెబుతున్నారు.

అది చురుకుగా పని చేయాలంటే..

అది చురుకుగా పని చేయాలంటే..

కరోనా కారణంగా చాలా మందిలో ఆందోళన, చిరాకు, నిరాశ వంటి లక్షణాలు పెరిగిపోతున్నాయి. ఇవి మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీని ప్రభావం జీవితంపై తప్పకుండా ఉంటుంది. అయితే మనిషి శరీరం యొక్క ఆరోగ్యానికి, వారి శృంగార జీవితానికి అవినాభవ సంబంధం ఉంటుంది. చాలా అధ్యయనాల్లో ఇదే రుజువైంది. తరచుగా శృంగారంలో పాల్గొనే వారు మానసికంగా.. ఆరోగ్య పరంగానూ ఎంతో చురుకుగా పని చేస్తారు. ఇదే సమయంలో వారి బ్రెయిన్ చాలా చురుకుగా పని చేస్తుంది. ఇలాంటి వాటివన్నీ లాక్ డౌన్ కారణంగా కోల్పోతున్నారు.

వీటి నుండి బయటపడాలంటే..

వీటి నుండి బయటపడాలంటే..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా శృంగార జీవితాన్ని ఆనందంగా గడపడానికి, భాగస్వామితో కలిసి ఆహ్లాదంగా గడపడానికి హార్వర్డ్ మెడికల్ స్కూల్, అమెరికన్ సెక్సువల్ హెల్త్ వారు కలిసి కొన్ని సురక్షిత శృంగార మార్గదర్శకాలను రూపకల్పన చేశారు.

సులభంగా అధిగమించడానికి..

సులభంగా అధిగమించడానికి..

ఈ మహమ్మారి కారణంగా ఏర్పడే అనూహ్య పరిస్థితుల నుండి ద్రుష్టిని మరల్చుకోవడానికి శృంగారాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు. వారంలో కనీసం రెండు లేదా మూడుసార్లు శృంగారంలో పాల్గొనే జంటలు ఆందోళన, ఒత్తిడి పరిస్థితులను సులభంగా అధిగమించగలుగుతారని చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ స్కాట్లాండ్ పరిశోధనలోనూ ఇదే తేలింది. శృంగారం సమయాల్లో విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హార్మోన్ మనుషుల్లో ఏర్పడే ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుందని పరిశోధనలు కూడా స్పష్టం చేశాయి. అంతేకాదు హార్ట్ ఎటాక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా నిరోధించడంలోనూ శృంగారం కీ రోల్ ప్లే చేస్తుంది.

English summary

Uk Survey : Lockdown impact on sexual life

Here we talking about uk survey : lockdown impact on sexual life. Read on