For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి పార్ట్ నర్ తో కలిసి ఉండాలనుకుంటే... ఈ చిట్కాలు పాటించండి...!

|

రిలేషన్ షిప్ విషయంలో ప్రతి జంట శారీరక సాన్నిహిత్యాన్నే ఎక్కువగా కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ అప్పటివరకు ఒంటరిగా గడిపిన క్షణాలను మరచిపోయి..

ఒక్కసారిగా రొమాన్స్ లో రెచ్చిపోయే సమయం వచ్చిందని భావిస్తారు. అందుకే వారు ఒకరితో ఒకరు శారీరకంగా కనెక్ట్ అవ్వడం ద్వారా వారి బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే మీ భాగస్వామికి ఆ సమయంలో ఆ కార్యంపై ఆసక్తి లేకపోతే.. వారు ఆ విషయం గురించి మీపై కోప్పడొచ్చు.

దీంతో మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. దీని వల్ల మీరు చాలా నిరాశ చెందొచ్చు. అయితే ఇవన్నీ రిలేషన్ షిప్ లైఫ్ చాలా సర్వసాధారణమే. అయితే మీ భాగస్వామిది నిజమైన ప్రేమ అయితే వారికి మీరు మద్దతు ఇవ్వడం మంచిది. కాబట్టి అలాంటి సమయంలో మీ పార్ట్ నర్ కు ఎలా మద్దతు ఇవ్వాలి.. మీరు ఆ కార్యం గురించి మీ పార్ట్ నర్ తో చర్చించేందుకు ఏమి చేయాలనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

True Love Story : ప్రియురాలి కోసం ఇండియా నుండి యూరప్ కు సైకిల్ పై వెళ్లాడట...! మరి తన ప్రేమ సక్సెస్ అయ్యిందా...

మీ పార్ట్ నర్ తో మాట్లాడండి..

మీ పార్ట్ నర్ తో మాట్లాడండి..

మీ భాగస్వామికి రొమాన్స్ పట్ల కోరికలు లేవనిపిస్తే.. మీరు తనతో ముందుగా ఆ విషయం గురించి ఓపెన్ గా మాట్లాడాలి. అయితే దీన్ని ఎలా ప్రారంభించాలో మీకు తెలియకపోతే, మీరు నిరాశ చెందే అవకాశం ఉంది. పైగా మీరు కోరుకున్న కోరికలు తీర్చకపోవడం వల్ల మీకు మరింత కోపంగా, చిరాకుగా అనిపించవచ్చు. అలాంటి సమయంలో మీరు మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడటం మరియు ఒక మంచి ప్రదేశాన్ని కనుగొనాలి. అది అత్యంత ముఖ్యం. ఆ తర్వాత వారితో రొమాన్స్ ముచ్చట్లు ప్రారంభించాలి.

మీ పార్ట్ నర్ చెప్పేది వినండి..

మీ పార్ట్ నర్ చెప్పేది వినండి..

మీ భాగస్వామి ఆలోచనలు, భావోద్వేగాలు మరియు భావాలను వ్యక్తీకరించాలని స్పష్టంగా తెలుస్తుంది. మీ భాగస్వామి కచ్చితంగా నమ్మదగిన వ్యక్తిని నిర్బంధించాలని కోరుకుంటారు. మీ భాగస్వామికి అంతరాయం కలిగించకుండా వారి ఆలోచనలు మరియు భావోద్వేగాలను వ్యక్తపరచటానికి అనుమతించండి. ఈ విధంగా మీ భాగస్వామి లైంగిక ధోరణి గురించి మాట్లాడితే చాలా సుఖంగా ఉంటుంది.

మీరు శ్రద్ధ వహిస్తున్నారని..

మీరు శ్రద్ధ వహిస్తున్నారని..

మీ భాగస్వామితో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే.. మీరు మీ భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకుంటున్నారని, వారిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని తెలియజేయాలి. దానికి ముందు మీరు మీ భాగస్వామికి బాధ కలిగించే పనులు చేయడం మానుకోవాలి. ‘నన్ను లైంగికంగా ఎందుకు సుఖపెట్టరు'అని చెప్పే బదులు, మీకు రొమాన్స్ విషయంలో ఏమనిపిస్తుందో అర్థం చేసుకున్నాను. కాబట్టి, మీ భావాలను దెబ్బతీసే లేదా మీరు అసౌకర్యంగా అనిపించే ఏ పని చేయను' అని భరోసా ఇస్తున్నాను అని చెప్పొచ్చు. ఇలా నిజాయితీ గల భాగస్వామి ఉన్నందుకు మీరు గర్వపడతున్నారని, మీ భాగస్వామికి తెలియజేయండి. అన్నింటికంటే, ముఖ్యమైనది నిజమైన ప్రేమ శారీరక సాన్నిహిత్యం గురించి కాదని తెలుసుకోవాలి.

కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...

భావోద్వేగ సాన్నిహిత్యం..

భావోద్వేగ సాన్నిహిత్యం..

మీకు మరియు మీ భాగస్వామికి శారీరక సాన్నిహిత్యం లేకపోతే? మీరు ఎల్లప్పుడూ భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుకోవచ్చు. దీని వల్ల మీ భాగస్వామితో మీరు మంచి ఆనందం పొందొచ్చు. ఎందుకంటే తెలియని వ్యక్తులతో భావోద్వేగ సాన్నిహిత్యం అనేది ఒక బంధం వంటిది. ఇందులో ఇద్దరు భాగస్వాములు ప్రేమించబడతారు. దీని వల్ల మీ భాగస్వామి యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని నిజంగా గౌరవించడం, మానసికంగా సన్నిహితంగా ఉండటం వంటివి సంపూర్ణంగా అనిపిస్తాయని చెప్పొచ్చు.

వాటిని ఆస్వాదించండి..

వాటిని ఆస్వాదించండి..

చాలా మంది కపుల్స్ కొన్ని సందర్భాల్లో లైంగిక కార్యకలాపాలను ఆస్వాదించలేరు అనేది పచ్చి నిజం. అందుకే మీరు రొమాన్స్ లో రెచ్చిపోవాలంటే.. ముందుగా మీ పార్ట్ నర్ ను రొమాంటిక్ గా కిస్ చేయడం, గట్టిగా కౌగిలించుకోవడం వంటివి చేస్తే, మీ పార్ట్ నర్ తో ఆటోమేటిక్ గా శారీరకంగా మరింత సన్నిహింగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. కలయికలో పాల్గొనకుండా మీ భాగస్వామితో ఫిజికల్ గా కనెక్ట్ అవ్వడానికి ఈ విషయాలు మిమ్మల్ని అనుమతిస్తాయి. మీకు కుదిరితే ఫోర్ ప్లే వంటి వాటిని కూడా చేయాలి. దీని వల్ల కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

కోరికల గురించి..

కోరికల గురించి..

మీ భాగస్వామికి అలాంటి కోరికలు తక్కువగా ఉన్నంత మాత్రాన, వారు ఆ కార్యానికి పనికి రాని వారని కాదు.. ముందు వారు లైంగిక కార్యకలాపాల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ముందు మీ భాగస్వామికి కోరికల విషయంలో ఏమైనా అపొహలు మరియు అనుమానాలు ఉన్నాయోమోననే విషయాలను మీరు ఓపెన్ గా అడిగి తెలుసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరిద్దరూ మీ సంబంధంలో ఉత్తమమైన ఫలితాలను పొందుతారు.

ఒత్తిడి చేయకండి..

ఒత్తిడి చేయకండి..

మీ భాగస్వామితో కలయికలో పాల్గొనాలని అనిపించే సందర్భాలు మీకు చాలానే ఉండొచ్చు. అయితే అదే సమయంలో మీ భాగస్వామికి అలాంటి కోరికలు ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో వారు ఆ కార్యానికి సుముఖంగా లేరని అర్థం చేసుకోవాలి. అయితే మీరు అలాంటి సమయంలో ఒత్తిడి చేయకుండా ఉండాలి. మీ భాగస్వామిపై ఒత్తిడి తెస్తే, మీ సంబంధాన్ని ప్రతికూల పద్ధతిలో ప్రభావితం చేయవచ్చు.

సపోర్ట్ ఇవ్వండి..

సపోర్ట్ ఇవ్వండి..

మీ భాగస్వామిని మీరు మంచిగా ఆదరించాలని కోరుకుంటే. మీరు కచ్చితంగా వారు చేసే పనులకు సపోర్ట్ ఇవ్వాలి. మీరు మీ పార్ట్ నర్ ను నిజాయితీగా ప్రేమిస్తే మరియు వారితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలంటే, అప్పుడు మీరు మీ భాగస్వామికి మానసిక మద్దతు అందించాలి. మీరు వారితో ఎంత ప్రేమతో ఉన్నారో తెలియజేయాలి.

English summary

Ways of Accepting and Supporting an Asexual Partner

Are you in a relationship with someone who is asexual? Well, then there can be times when you and your partner may not find yourselves on a common ground. But with right advice and tips you can accept and support your asexual partner.