For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఈ’ అలవాట్లుంటే.. మీ పార్ట్నర్ తో పడకగదిలో ఎన్ని ఇబ్బందులో తెలుసా...

మీ రొమాంటిక్ జీవితంలో జలసీ ఎదురైతే.. దాన్ని డీల్ చేయడానికి గల మార్గాలేంటో తెలుసుకోవడానికి ఒక లుక్కేయండి.

|

ఆలుమగలు అన్నాక రిలేషన్ షిప్ లో ఏదో ఒక సందర్భంలో అలకలు, కోపాలు, తాపాలు, అనుమానం, ప్రేమ అనేవి కచ్చితంగా ఉంటాయి.

Ways to Deal With Jealousy Impacting Your Relationships

అయితే వీటన్నింటితో పాటు కొన్నిసార్లు అభద్రతా భావం కారణంగా జలసీ, భయం వంటివి కూడా వస్తుంటాయి. సాధారణంగా అసూయ అనేది అన్ని సంబంధాల్లో ఉంటుంది. అయితే ఎక్కడైతే అనుమానం, అసూయ అనేవి మీ రిలేషన్ షిప్ ను నాశనం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Ways to Deal With Jealousy Impacting Your Relationships

దీని ప్రభావం మీ మనసుపై పడుతుంది. దీంతో మీలో ఆందోళన అనేది ప్రారంభమవుతుంది. అనవసరపు ఆందోళన వల్ల మీ జీవిత భాగస్వామిపై మీకు డౌట్ రావడం స్టార్టవుతుంది. దీంతో మీ ఇద్దరి మధ్య ఉండే విశ్వాసం, గౌరవాలను దెబ్బ తీస్తుంది. మొత్తానికి ఇది మీ ప్రేమ జీవితం.. వివాహ బంధంపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. వీటన్నింటి సంగతి పక్కనబెడితే రిలేషన్ షిప్ లో రొమాంటిక్ జలసీ అనేది ఒకటుంటుందట. దీని వల్ల మీ రిలేషన్ షిప్ లో ఇన్ సెక్యూర్ ఫీలింగ్, భయం, ఆందోళన వంటివి పెరుగుతాయట. మీ రిలేషన్ షిప్ లో కూడా ఇలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి.. ఎలాంటి పద్ధతులను ఫాలో అవ్వాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

కరోనా కాలంలోనూ కెనడియన్లు ఆ కార్యాన్ని అద్భుతంగా ఆస్వాదించారట...! కానీ పార్ట్నర్ తో కాదంట...!కరోనా కాలంలోనూ కెనడియన్లు ఆ కార్యాన్ని అద్భుతంగా ఆస్వాదించారట...! కానీ పార్ట్నర్ తో కాదంట...!

రొమాంటిక్ జలసీ అంటే?

రొమాంటిక్ జలసీ అంటే?

భాగస్వాములు రతి క్రీడలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదైనా విషయంలో అసూయ వంటివి కలుగుతుంది. దీనికి నిదర్శనమే రొమాంటిక్ జలసీ. ఒకరి మీద ఒకరికి డౌట్లు రావడం.. ఆ కార్యంపై విశ్వాసం ఉండకపోవడం.. మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేస్తున్నారని భయపడటం.. మీరు చాలా కేర్ ఫుల్ గా ఉండటం వంటివ మీ అనుమానాలను మరింత రెట్టింపు చేస్తుంది. మీ నమ్మకాలను వమ్ము చేస్తుంది. దీంతో మీ రిలేషన్ షిప్ లో దూరం పెరిగిపోతుంది.

రకరకాలుగా..

రకరకాలుగా..

రొమాంటిక్ లైఫ్ లో జలసీలు మగవారు, మహిళలకు రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా అబ్బాయిలకు తమకు పుట్టిన పిల్లలపై కొన్నిసార్లు అనుమానం కలుగుతుంది. వారు తమకు కలిగిన సంతానమేనా? లేక తమ భాగస్వామి ఇతరులతో ఏమైనా రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేసిందా అనే అనుమానం ఉండొచ్చు. అయితే ఇలాంటి జలసీ ఎక్కువగా మగవారిలోనే ఉంటుందట. స్త్రీలలో కొందరు భావోద్వేగ పరంగా అవిశ్వాసం వ్యక్తం చేస్తుంటారు.

జలసీ ప్రభావం..

జలసీ ప్రభావం..

మీ రొమాంటిక్ రిలేషన్ షిప్ జలసీ ఎక్కువైతే దాని ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుందట. ఒక్కసారి జలసీ అనేది మీ సంబంధంలో ప్రవేశిస్తే.. మీరిద్దరూ ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నా.. అతిగా రొమాన్స్ జలసీ ఉండటం వల్ల ఒకరిపై ఒకరికి ఉండే నమ్మకం, ప్రేమ, గౌరవం తగ్గిపోతాయట. అంతేకాదు రొమాంటిక్ జలసీ అనేది మీ రిలేషన్ షిప్ ను నాశనం చేస్తుందట. మీరు మీ పార్ట్నర్ తో ఉన్నప్పుడు జలసీ కారణంగా మీరు హ్యాపీగా ఉండలేరట.

అంగస్తంభన సమస్యగా ఉందా? భార్య గర్భం పొందడానికి ఈ పద్ధతిని ప్రయత్నించండి!అంగస్తంభన సమస్యగా ఉందా? భార్య గర్భం పొందడానికి ఈ పద్ధతిని ప్రయత్నించండి!

అనవసరమైన గొడవలు..

అనవసరమైన గొడవలు..

మీ రొమాంటిక్ రిలేషన్ షిప్ లో జలసీ వల్ల మీ బంధం బలహీనపడుతుంది. మీరు ఒకరిమీద ఒకరు నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. దీని వల్ల మీ బంధంలో అనేక మార్పులు వస్తాయి. అంతేకాదు మీరు తరచుగా మీ భాగస్వామితో గొడవ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువ సమయం భయపడుతూనే ఉంటారు. మీరు కేర్ ఫుల్ గా ఉంటూ.. మీ భాగస్వామితో మాట్లాడటానికి సంకోచిస్తారు.

ఎలా ఎదుర్కోవాలంటే..

ఎలా ఎదుర్కోవాలంటే..

మీ రొమాంటిక్ రిలేషన్ షిప్ లో జలసీని ఎలా ఎదుర్కోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ భాగస్వామిని ఎంతలా ప్రేమిస్తున్నారో వారికి తెలియజేయండి. అవసరమైతే వారికి అన్ని విషయాల్లో మద్దుగా ఉంటాననే నమ్మకం కలిగించండి. దీని వల్ల వారికి రొమాంటిక్ జలసీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మీ పార్ట్నర్ ఎలాంటి విషయాల్లో అసూయపడతారనే పరిస్థితులను గుర్తించండి. వాటిని నివారించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీ భాగస్వామి ఎదుట వారికి ఇష్టం లేని వారిని కౌగిలించుకోవడం.. వారితో క్లోజ్ గా మాట్లాడటం.. అర్ధరాత్రి వేళల్లో ఫోన్లలో గంటల తరబడి మాట్లాడటం.. రెగ్యులర్ గా మెసెజ్ లు చేయడం వంటివి మానేయాలి.

నిపుణుల సహాయం..

నిపుణుల సహాయం..

మీ రిలేషన్ షిప్ లో రొమాంటిక్ జలసీ మరీ ఎక్కువైతే.. మీ రిలేషన్ షిప్ మరింత క్షీణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మానసిక నిపుణులను సంప్రదించాలి. మీ తీవ్రమైన సమస్య నుండి బయటపడేందుకు వారి సలహాలను పాటించాలి. మీకు మీ భాగస్వామిపై పూర్తిగా నమ్మకం కలిగే వరకు.. మిమ్మల్ని వారు పూర్తిగా నమ్మేంత వరకు మీరు చాలా ఓపికగా ఉండాలి. మీరు ఒకరిమీద ఒకరు నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను పెంచుకోవాలి. ఇందుకోసం కమ్యూనికేషన్ ను బలంగా మార్చుకోవాలి.

English summary

Ways to Deal With Jealousy Impacting Your Relationships

Here are the ways to deal with jealousy impacting your relationships. Take a look
Story first published:Thursday, September 2, 2021, 20:36 [IST]
Desktop Bottom Promotion