For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ అద్భుతమైన చిట్కాలతో మీ వెడ్డింగ్ డేను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా జరుపుకోండి..

|

ఈ నాగరిక ప్రపంచంలో మారుతున్న జీవనశైలి, రోజు రోజుకు మనకు పెరుగుతున్న అవసరాలు మనకు చాలా కష్టంగా మారుతున్నాయి. ముఖ్యంగా వివాహం చేసుకున్న వారికి బాధ్యతలు మరియు బరువు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కపుల్స్ కు వార్షికోత్సవం అనేది ప్రత్యేకంగా గుర్తుండిపోయే రోజు అవుతుంది. వివాహం చేసుకున్న మరుక్షణమే భాగస్వామిని కలిసిన రోజు ఎన్నో ప్రత్యేక జ్ఞాపకాలు ఉండొచ్చు. ఈ వార్షికోత్సవాలను ప్రతి ఏటా మరింత ప్రత్యేకమైన పద్ధతిలో జరుపుకోవడానికి చాలా మంది కపుల్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తారు.

అలాంటి జోడిల రొమాంటిక్ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుని, ఒకరితో ఒకరు సరదాగా సమయాన్ని గడపడానికి దీన్ని ఒక మార్గంగా భావిస్తారు. కానీ, మీ భాగస్వామితో వెడ్డింగ్ డే ని వెరైటీగా జరుపుకోవాలని మీకు అనిపించినా ఎలాంటి ఐడియాలు రావట్లేదా? అయితే ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి. చింతించడం వదిలేసి చిచ్చరపిడుగుల్లా ఎంజాయ్ చేయండి..

1) సూర్యోదయాన్ని ఆస్వాదించండి..

1) సూర్యోదయాన్ని ఆస్వాదించండి..

మీకు వెడ్డింగ్ డే అంటే ప్రత్యేకమైన రోజు కాబట్టి మీరు మీ భాగస్వామి కంటే ముందే నిద్ర లేవాలి. మీ భాగస్వామిని మేల్కోలిపి ఆశ్చర్యపరచాలి. ఈ వింటర్ సీజన్ లో ఉదయాన్నే మేల్కొనడం చాలా కష్టమైన పని అయినప్పటికీ, ఇలా చేస్తే మీ భాగస్వామిని కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరు మీ భాగస్వామితో సూర్యోదయాన్ని ఆనందంగా ఆస్వాదించొచ్చు. అలాగే మీరు ఆ రోజు అత్యంత చురుకైన ప్రారంభాన్ని పొందవచ్చు.

2) ప్రత్యేక అల్పాహరం..

2) ప్రత్యేక అల్పాహరం..

మీ భాగస్వామిని ఆశ్చర్యపరిచేందుకు ఆ ప్రత్యేకమైన రోజున వారికి ఇష్టమైన అల్పాహారం సిద్ధం చేయండి. ఒక మంచి బహుమతి ఇవ్వడం అనేది అందరూ చేస్తారు. కానీ ప్రతిరోజూ ఉదయం మీకు అల్పాహారం సిద్ధం చేసే మీ భాగస్వామికి ఈ ప్రత్యేకమైన రోజున అల్పాహారం తయారు చేసే బాధ్యతను మీరు తీసుకోవాలి. ఇది కేవలం సాధారణ విషయంగా భావించొద్దు. అల్పాహారం సిద్ధం చేయడం వల్ల ఈ ప్రత్యేకమైన రోజు అద్భుతాలు చేయవచ్చు. ఎందుకంటే మీ భాగస్వామి విశేషంగా భావిస్తారు. ఇక మీరు తయారు చేసిన అల్పాహారాన్ని వారు ఎప్పటికీ మరచిపోరు.

3) విహారయాత్రకు ప్లాన్ చేయండి..

3) విహారయాత్రకు ప్లాన్ చేయండి..

మీ ప్రత్యేకమైన రోజున మీరు పనికి వెళ్లడానికి బదులు ఆ రోజంతా మీ భాగస్వామితోనే ఆనందంగా గడపాలి. అప్పుడే ఆ ప్రత్యేకమైన రోజుకు మరింత గుర్తుండిపోయేలా చేయడంలో మీకు సహాయపడుతుంది. దీనికి ముందే మీ పని నుండి సెలవు తీసుకోండి. అలాగే మీ ఇద్దరికీ ఆనందదాయకంగా ఉండేలా పనులు చేయండి. మీరు పిక్నిక్ లేదా రాత్రి సమయంలో ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లొచ్చు. దీని కోసం ముందుగానే ఒక చిన్న యాత్రకు వెళ్లడానికి మీరు ప్లాన్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ఒకరికొకరు మరింత దగ్గర అవ్వొచ్చు.

4) రొమాంటిక్ గా ఉండండి..

4) రొమాంటిక్ గా ఉండండి..

మీరు ప్రతిరోజూ మీ పనికి సంబంధించిన వాటిలో ఒత్తిడి మరియు ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉండొచ్చు. కాబట్టి మీరు మీ భాగస్వామితో ప్రత్యేకంగా సమయం గడపలేకపోవచ్చు. కానీ, మీ ప్రత్యేకరోజున, మీరు మీ భాగస్వామితో రొమాంటిక్ గా ఉండటం ద్వారా మీ రోజువారీ ప్రవర్తనలో మార్పు తీసుకురావచ్చు. మీరు మరియు మీ భాగస్వామి సన్నిహితంగా మరియు హాయిగా అనిపించే పనులనే చేయండి. మీరు మీ బెడ్ పై మీ భాగస్వామిని రొమాంటిక్ గా గట్టిగా కౌగిలించుకోవచ్చు. లేదా తీవ్రమైన ఫోర్ ప్లేకి దారితీసే పనులు అయినా చేయవచ్చు. ఇంకా మీరు ఒకరికొకరు నచ్చిన పాటలు పాడుకోవచ్చు లేదా అంతాక్షరి పోటీ అయినా పెట్టుకోవచ్చు. లేదా మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఆనందంగా గడపొచ్చు.

5) కార్యాచరణలో పాల్గొనండి..

5) కార్యాచరణలో పాల్గొనండి..

మీ భాగస్వామితో కలిసి పని చేయడం వల్ల కొన్ని మీ మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది. మీకు ఆఫీసులో లేదా బయట ఎంత పని ఉన్నా మరియు ఒత్తిడి పక్కన పెట్టి, మీరు కొంత కార్యాచరణ చేయడం ద్వారా మీకు ఆ ప్రత్యేకమైన రోజు గుర్తుండిపోయేలా చేయవచ్చు. ఇది మీ సంబంధం యొక్క ప్రారంభ రోజులలో చాలా చాలా బాగుంటుంది. ఉదాహరణకు మీరు షాపింగుకు వెళ్లొచ్చు. ఏదైనా గేమ్ ను ఆడవచ్చు. హార్స్ రైడింగుకు వెళ్లొచ్చు లేదా మీ భాగస్వామి కోసం ప్రత్యేక వంటలను సిద్ధం చేసి ఉంచాలి..

6) సెకండ్ షోకు ప్లాన్ చేయండి..

6) సెకండ్ షోకు ప్లాన్ చేయండి..

మీ ప్రత్యేకమైన రోజు మీరు మీ భాగస్వామితో కలిసి సెకండ్ షో మూవీకి వెళితే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? దీని కోసం మీరు టికెట్లను ముందే బుక్ చేసుకుంటే చాలు. ఒకవేళ మీకు సినిమాకు వెళ్లాలని అనిపించకపోతే మీరు ఉండే చోటే ఏదైనా మంచి దానిని మీకు నచ్చినదానిని ప్లాన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సినిమాలకు సంబంధించిన సిడిలు గానీ లేదా పెన్ డ్రైవ్స్ ను గాని ఉపయోగించి మీరు ఉన్న చోటే అంటే మీ ఇంట్లోనే మంచి సినిమాను చూసి ఆనందించవచ్చు.

7) మాటలతో మాయ చేయాలి..

7) మాటలతో మాయ చేయాలి..

మీరు మీ భాగస్వామి కోసం ఈరోజు కొంచెం కొంటెగా ప్రవర్తించాలి. మీ మాటలతో మీ భాగస్వామిని మాయ చేయాలి. దీంతో మీ భాగస్వామి మరోసారి మీ ప్రేమలో పడతారు. దీంతో ఈ ప్రత్యేకమైన రోజు మీరు మళ్లీ రొమాంటిక్ క్షణాలను తిరిగి పొందవచ్చు.

English summary

Wedding Anniversary Ideas For Couples

For couples, their anniversary is a special day. The anniversary could be the day they got married or the day they met for the first time or some other special memory. Couples always look forward to celebrating these anniversaries in a different yet special way.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more