For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామి ‘అలక’ తీర్చడం చాలా తేలిక.. అదెలాగో చూసెయ్యండి...

|

ఆలుమగలు అన్నాక వారి కాపురంలో కలహాలు, కోపాలు, అలకలు, కోపాలు సర్వసాధారణమే. నిజం చెప్పాలంటే.. భార్యభర్తల బంధం అన్నాక కేవలం రొమాన్స్, లవ్, సెక్స్ మాత్రమే కాదు.. గొడవలు ఉంటే ఆ ప్రేమ మరింత బలంగా మారుతుంది.

అందుకే ఆలుమగల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు వస్తే చాలా సరదాగా ఉంటుంది. మీ భాగస్వామి బుంగమూతి పెట్టడం వంటివి చేస్తేనే మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది.

అయితే మీ పార్ట్నర్ అలిగితే ఆ అలక తీర్చడం కొంత కష్టమే. అయితే ఇందుకోసం మీరు కొంచెం కష్టపడితే చాలు.. ఈ సందర్భంగా మీ భాగస్వామి అలక తీర్చడానికి ఏయే మార్గాలున్నాయో ఇప్పుడే చూసెయ్యండి.

సెలబ్రిటీలు కలకాలం కలిసి ఉండలేరా? విడిపోయినా స్నేహితుల్లా ఉంటామంటున్న జంటలెవరో చూసెయ్యండి...సెలబ్రిటీలు కలకాలం కలిసి ఉండలేరా? విడిపోయినా స్నేహితుల్లా ఉంటామంటున్న జంటలెవరో చూసెయ్యండి...

అలకకు కారణాలు..

అలకకు కారణాలు..

మీ భాగస్వామికి మీపై కోపం వచ్చేందుకు సాధారణంగా ఇలాంటి కారణాలు కావొచ్చు. తను ఏదైనా కోరుకుంటే.. అవి మీరు నెరవేర్చకపోతే లేదా మీరు మీ భాగస్వామిపై కోపం చూపించడం వంటివి చేస్తుంటారు. తను మీ నుండి ఏదైనా విలువైనదాన్ని ఆశిస్తుంటే.. మీరు దాన్ని అందించలేకపోతే.. అందుకు గల కారణమేంటో స్పష్టంగా వివరించాలి. దీంతో వారు మిమ్మల్ని కాస్త అర్థం చేసుకుని మీపై అలక మానే అవకాశం ఉంటుంది.

దగ్గరకు తీసుకుని..

దగ్గరకు తీసుకుని..

కొన్నిసార్లు మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు.. మీ భాగస్వామిపై కోపం చూపించినట్లయితే.. మీ కోపం కొంత తగ్గాక తనను దగ్గరకు తీసుకుని ‘సారీ డార్లింగ్' ఈరోజు నా మనసేం బాగోలేదు. అదే సమయంలో నువ్వొచ్చి మాట్లాడేసరికి నాకు కోపం పెరిగింది. మరోసారి ఇలా జరగకుండా చేసుకుంటాను అని నెమ్మదిగా చెబితే.. ముఖ్యంగా వారిని దగ్గరకు తీసుకుని చెబితే ఇలా చెబితే వారి ఇట్టే కరిగిపోతారు.

సర్ ప్రైజ్ చేయండి..

సర్ ప్రైజ్ చేయండి..

మీ భాగస్వామి ఎప్పుడైనా ఏదైనా విషయం గురించ అలిగితే గనుక మీరు ఈ పద్ధతిని ఫాలో అయితే కచ్చితంగా ఫలితం ఉండొచ్చు. అదేంటంటే.. తనను సర్ ప్రైజ్ చేయడం.. ఉదాహరణకు వారికిష్టమైన వంటలను వండి పెట్టడం లేదా వారి దగ్గరకు వెళ్లి ప్రేమగా తినిపించడం.. అలా చేస్తూనే ‘నాపై కోపం ఇంకా తగ్గలేదా' ఈసారికి మన్నించు డియర్ అంటూ మాట్లాడితే చాలు వారి కోపం క్షణాల్లో ఎగిరిపోతుంది. అలాగే వారికి నచ్చిన పనులు చేయడం.. వారితో ఎక్కువ సమయం గడపడం వంటివి చేస్తే.. వారి అలకను సులభంగా తీర్చొచ్చు..

ఎంగేజ్ మెంట్ అయినా.. ఏడడుగులు వేయని తారలెవరో తెలుసా...ఎంగేజ్ మెంట్ అయినా.. ఏడడుగులు వేయని తారలెవరో తెలుసా...

అలక తీర్చే బాధ్యత..

అలక తీర్చే బాధ్యత..

మీ భాగస్వామి అలకకు మీరే కారణమైతే... అందుకు ఓపెన్ గా మీరు తప్పు ఒప్పుకోవాలి. ఒకవేళ మీరు వారిపై తీవ్రంగా అసహనం చూపి ఉంటే గనుక.. వారు నార్మల్ స్టేజ్ కి రావడానికి కొంత ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మాములూగా మీరు సారీ చెప్పడం.. ఇదొక్కసారికి మన్నించు అని అడిగితే ఫలితం ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు మీ భాగస్వామిని బాగా బుజ్జగించాలి. ‘నా బంగారం.. నా డార్లింగ్.. అంటూ.. ఈ సారికి క్షమించొచ్చు కదా..' అంటే మీ పరిస్థితిని వివరిస్తే.. వారి కోపం త్వరగా చల్లారొచ్చు.

అన్నీ మరచిపోతారు..

అన్నీ మరచిపోతారు..

మీ భాగస్వామి అలక తీర్చే సమయంలో మీరు వారి మనసును బాధపెట్టి ఉంటే.. అలాంటి సమయంలో మీరు ఏదైనా పాత విషయాలను మాట్లాడటం, బాధ పెట్టే మాటలను గుర్తు చేయడం వంటివి అస్సలు చేయొద్దు. దీని వల్ల వారి కోపం మరింత పెరగొచ్చు. కాబట్టి ఇలాంటివి చేయకుండా మీరు వారు అలక తీర్చే మార్గాలను వెతికితే.. వారు అన్నీ మరచిపోయి మిమ్మల్ని త్వరగా క్షమించేస్తారు.

ఆలోచన మంచిదే..

ఆలోచన మంచిదే..

పైన చెప్పిన చిట్కాలన్నీ మీ భాగస్వామి అలిగిన సమయంలో ఒకేసారి ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు వెంటనే బుజ్జగించడం, సారీ చెప్పడం, కారణాలు చెప్పడం వంటివి చేస్తే ప్రతికూల ఫలితం రావొచ్చు.

ఒంటరిగా వదిలేయండి..

ఒంటరిగా వదిలేయండి..

మీ భాగస్వామి అలక తీర్చడం అనే ఆలోచన చాలా మంచిది. కానీ మీరు కాస్త ఓపిక పట్టాలి. ముఖ్యంగా వారిని కాసేపు ఒంటరిగా వదిలేయండి. వారి కోపం కాస్త తగ్గితే ఆ తర్వాత మీరు పైన చెప్పిన మార్గాలను ప్రయత్నిస్తే ఫలితం రావొచ్చు.

మీ జీవితంలోనూ..

మీ జీవితంలోనూ..

మీ భాగస్వామి అలకను ఎలా పోగొట్టాలో చూశారు కదా.. మీరు కూడా మీ వైవాహిక జీవితంలో అలగడం.. మీ భాగస్వామి అలక తీర్చడం వంటివి చేసి ఉంటే.. మీ ఇద్దరి మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలు, చిలిపి తగాదాలు వచ్చినప్పుడు మీరెలా డీల్ చేశారనే విషయాలను మాతో షేర్ చేసుకోండి. కొత్త జంటలకు మీ అనుభవాల గురించి తెలియజేయండి.

English summary

What Is the Best Way to Deal With a Pouting Spouse?

Here we are talking about the what is the best way to deal with a pouting spouse. Read on
Story first published: Thursday, July 8, 2021, 16:34 [IST]