For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఆ' పని కాగానే మగాళ్లు ఎందుకు నిద్రలోకి జారుకుంటారంటే..

శృంగారం అయిపోగానే చాలా మంది పురుషులు మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు. శృంగారం అయిపోగానే అటు తిరిగి పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల మహిళల్లో ఒకరకమైన అసంతృప్తి మిగిలిపోతుంది.

|

శృంగారం.. అదో అద్భుతమైన అనుభూతి. ఎన్ని మాటల్లో వివరించినా.. దాని మాధుర్యం అనుభవిస్తేనే అర్థం అవుతుంది. దంపతుల మధ్య శృంగారం అనేది చాలా తరచూగానే జరుగుతుంటుంది. దాంపత్య జీవితంలోని చాలా మంది మహిళల్లో శృంగారం గురించి తమ భర్తలపై ఒక కంప్లైంట్ ఉంటుంది. అదేంటంటే.. 'ఆ' పని అయిపోగానే మగాళ్లు నిద్రపోవడం.

men after romance

శృంగారం తర్వాత స్త్రీలకు ఇంకేదో కావాలని అనిపిస్తుంటుంది. తమ పార్ట్‌నర్‌ను కౌగిలించుకోవాలని, రొమాంటిక్ సంభాషణలు చేయాలని అనుకుంటారు. శృంగారం ఎలా అనిపించిందో లాంటి ప్రశ్నలకు జవాబులు చెబితే వినాలని కోరుకుంటారు. ఈ సమయంలో చాలా మంది పురుషులు మెల్లిగా నిద్రలోకి జారుకుంటారు. శృంగారం అయిపోగానే అటు తిరిగి పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల మహిళల్లో ఒకరకమైన అసంతృప్తి మిగిలిపోతుంది.

అయితే పురుషులు ఇలా పడుకోవడానికి ఆశ్చర్యకరమైన కారణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

men fall asleep right after romance

శారీరక అలసట:

బెడ్‌పైన మహిళల కంటే పురుషులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. తమ భాగస్వామిని సంతోషపెట్టడానికి, సంతృప్తి పరచడానికి తమకు చేతనైనంతగా కష్టపడతారు. ఇది ఒక రకమైన వ్యాయామం లాంటిదే.

శృంగారం పూర్తయ్యే సరికి పురుషులు శారీరకంగా చాలా అలసిపోతారు. అలసిపోయిన శరీరానికి నిద్రపోవడం తర్వాతి దశ. తీవ్రంగా శ్రమించిన తర్వాత అలసటతో నిద్రలోకి జారుకుంటారు. నిద్ర పోవడం వల్ల శక్తి తిరిగి వస్తుంది.

ప్రోలాక్టిన్ హెచ్చుతగ్గులు:
ప్రోలాక్టిన్ అనేది శరీరంలోని ఒక హార్మోన్. ఇది పురుషులు, స్త్రీలలో వేర్వేరు పనులు చేస్తుంటుంది. ఇది మిమ్మల్ని అప్రమత్తం చేసే హార్మోన్లను అణచివేస్తుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ సంతృప్తి భావాన్ని పెంచుతుంది. నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.

అధిక ప్రోలాక్టిన్ స్థాయిలు, నిద్రపోవడం మధ్య బలమైన సంబంధం ఉంటుంది. కాబట్టి ఉద్వేగం తర్వాత ప్రోలాక్టిన్ హార్మోన్‌ను మెదడు విడుదల చేస్తుంది. పురుషుల్లో నిద్రమత్తు ఆవరిస్తుంది. అలా నిద్రలోకి జారుకుంటారు.

రిలాక్స్డ్ స్థితిలో ఉంటారు
ప్రోలాక్టిన్‌తో పాటు కామోద్రేకం తర్వాత ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. వాటిలో ఒకటి ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ప్రేమ, విశ్వాసం, విశ్రాంతి భావాలను పెంచుతుంది. ఇది కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లతో పోరాడుతుంది.

సెక్స్ రిలాక్సింగ్‌గా ఉంటుంది కాబట్టి శృంగారం తర్వాత పురుషులు నిద్రలోకి జారుకుంటారు.

men fall asleep right after romance

నిద్రపోయే టైం అవుతుంటే..

శృంగారం ఏ సమయంలోనైనా జరగవచ్చు. శృంగారం చేసుకోవాలన్న మూడ్ ఉంటే ఎప్పుడైన రోజులో ఉదయం, పగలు, సాయంత్రం సమయాల్లోనూ జరుగుతుంది. కానీ చాలా ఎక్కువసార్లు మాత్రం శృంగారం పడకగదిలో రాత్రి సమయంలో జరుగుతుంది. ఆ ప్రశాంత వాతావరణం, నిద్రపోయే సమయం దగ్గర పడటంతో నిద్ర వచ్చేస్తుంది.

హార్మోన్ల కలయిక, శారీరక అలసట, నిద్రపోయే సమయం ఇలా అన్ని కలిసి రావడంతో నిద్రలోకి జారుకుంటారు.

Read more about: relationship సంబంధం
English summary

Why do men fall asleep right after romance

read on to know Why do men fall asleep right after romance
Story first published:Thursday, December 8, 2022, 19:15 [IST]
Desktop Bottom Promotion