For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘తాము ఇంట్లో లేనప్పుడు.. తన ప్రియుడితో ఏకాంతంగా... సరిగ్గా అప్పుడే...’

|

మనలో చాలా మంది ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు.. అది యవ్వనంలో ఉన్నప్పుడు.. ప్రియుడితో కలిసి ఏకాంతంగా గడపాలని భావిస్తుంటారు. కొందరు అమ్మాయిలు అయితే అమ్మ, నాన్న ఇంటి నుండి బయటకు ఎప్పుడు వెళ్తారా అని అదే పనిగా ఎదురుచూస్తుంటారు.

అంతేకాదు ఆ మరు క్షణమే తమ బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి పిలుస్తుంటారు. అదే సమయంలో తమ ప్రియురాలి ఇంట్లో ఎవరూ లేనప్పుడు.. వారున్న ప్లేసుకి సరదాగా వెళ్లడం వంటివి చేస్తుంటారు.

అయితే పేరేంట్స్ ఇంట్లో లేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. సరిగ్గా అప్పుడే అతన్ని ఇరుగుపొరుగు వారు చూశాను. తనపై ఏదో అనుమానంగా చూశారు. ఇక వారి తల్లిదండ్రులు రాగానే ఈ విషయం గురించి చెప్పేశారు. ఆ తర్వాత ఏమి జరిగిందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీ పార్ట్ నర్ లో ఇలాంటి లక్షణాలుంటే... మీ బంధం బలహీనపడినట్టే...మీ పార్ట్ నర్ లో ఇలాంటి లక్షణాలుంటే... మీ బంధం బలహీనపడినట్టే...

డేటింగ్ చేస్తోంది..

డేటింగ్ చేస్తోంది..

మాది కర్నూలు జిల్లా. భార్యభర్తలైన మేమిద్దరం ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మా కూతురు కాలేజీలో తన క్లాస్ మేట్ తో డేటింగ్ చేస్తోంది. అలా చేయడం వల్ల మాకు ఎలాంటి సమస్య లేదు. కానీ, కొన్ని రోజుల నుండి మేమిద్దరం ఇంట్లో లేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి తీసుకొస్తోంది.

ఏమీ చెప్పడం లేదు..

ఏమీ చెప్పడం లేదు..

తనను రెగ్యులర్ గా ఇంటికి పిలిపించుకుని, ఇలా చేయడం.. అతడు ఇంటికి వస్తున్నాడన్న విషయం గురించి మాకు కనీస సమాచారం ఇవ్వడం లేదు. పైగా మేము ఇంట్లో ఉన్నప్పుడు అయితే, తనతో రహస్యంగా ఫోనులో గంటలకొద్దీ మాట్లాడుతోంది.

ఇతరులు చెబుతుంటే..

ఇతరులు చెబుతుంటే..

అయితే ఇరుగుపొరుగు వారు తన ప్రియుడి గురించి మాకు చెబుతుంటే.. చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇది మరీ హద్దు దాటుతుందేమో అని.. ఈ విషయాన్ని మా కూతురిని అడిగాం. అలా చేయొద్దని చెప్పాం.. ఏదైనా మాకు చెప్పి చేయమన్నాం. కానీ మేము బయటకు వెళ్లిన వెంటనే తను మళ్లీ ఇంటికి తీసుకొస్తోంది.. అనునిత్యం తనతో ఫోన్లోనే ఎందుకు గడుపుతుందో అర్థం కావడం లేదు.. ఈ సమస్యను ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదు.

అది కోరుకుంటారు..

అది కోరుకుంటారు..

చాలా మంది టీనేజర్లు మరియు తమ రిలేషన్ల గురించి చాలా ఎక్కువగా ప్రైవసీ కోరుకుంటారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తమ బాయ్ ఫ్రెండ్ తో బాగా ఎంజాయ్ చేయాలని.. ఏకాంతంగా గడపాలని.. ఏవేవో కలలు కంటుంటారు.

మీ శ్రీవారు మీపై మనసు పడాలంటే.. ఇలా ట్రై చేయండి...మీ శ్రీవారు మీపై మనసు పడాలంటే.. ఇలా ట్రై చేయండి...

కోరికలు ఎక్కువ..

కోరికలు ఎక్కువ..

ఇక యుక్త వయసులో హార్మోన్ల మార్పు వల్ల వారిలో రొమాంటిక్ కోరికలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. ప్రతిదీ ప్రాక్టికల్ గా చేయాలనుకుంటారు. ఆ కార్యంలో పాల్గొంటే ఎలా ఉంటుంది.. తమకు నిజంగా అనుభూతి వస్తుందా అనే ఆత్రుతలో ఉంటారు. దీంతో వారు ఎవ్వరెన్నీ చెప్పినా వినే పరిస్థితి ఉండదు.

ఎవ్వరినీ పట్టించుకోరు..

ఎవ్వరినీ పట్టించుకోరు..

అలాంటి సందర్భంలో తల్లిదండ్రులతో పాటు ఇతరులు ఏం చెప్పినా అస్సలు చెవికెక్కించుకోరు. తమ చుట్టూ సమాజాన్ని ఏ మాత్రం లెక్క చేయరు. అయితే అలాంటి వారితో మీరు ఫ్రెండ్లీగా ఉండాలి. వారితో ఎప్పటికప్పుడు కలిసి.. అలా చేయడం వల్ల ఏర్పడే సమస్యల గురించి వివరించాలి.

నిరుత్సాహపరచొద్దు..

నిరుత్సాహపరచొద్దు..

అయితే వారి మధ్య ఉన్న సంబంధాలను వ్యతిరేకించకూడదు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. అంతేకానీ బలవంతం మాత్రం చేయకూడదు. ముఖ్యంగా మీ కూతురు చెప్పే మాటలను మీరు సావధానంగా వినాలి. తనంటే ఎందుకిష్టమో.. ఎంత ఇష్టమో కనుక్కోవాలి.

అభిప్రాయాలకు గౌరవం..

అభిప్రాయాలకు గౌరవం..

అలా ఇద్దరు మ్యూచువల్ అండర్ స్టాండింగ్ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇలా మీరు మీ అభిప్రాయాలను గౌరవించుకుని.. ఓపెన్ మైండ్ తో మాట్లాడుకోవడం వల్ల మీ రిలేషన్ షిప్ లో ఎలాంటి సమస్యలు ఎదురు కావు. ఇలా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

English summary

Why is my daughter calling secretly her boyfriend

Check out the details why is my daughter calling secretly her boyfriend. Read on
Story first published: Friday, March 26, 2021, 17:54 [IST]