For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల వారు ఉత్తమ బాయ్ ఫ్రెండ్స్ గా ఉంటారట... ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి..!

|

ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఎంతో కష్టపడాలి. ఎందుకంటే ఆడవారి మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. వారి మాటలకు, చేతలకు అసలు పొంతనే ఉండదని చాలా మంది పురుషులు భావిస్తూ ఉంటారు.

ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి తమ కలల రాకుమారుడు అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అని ఏవేవో కలలు కంటూ ఉంటారు. అయితే అవన్నీ నిజం కావు. వారి ఊహాలకు తగ్గట్టు బాయ్ ఫ్రెండ్ దొరకాలంటే.. చాలా కష్టమే. ఎందుకంటే వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకునే వ్యక్తి ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలియదు.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. అమ్మాయిల మనస్తత్వాలను కొందరు పురుషులు చాలా ఈజీగా తెలుసుకుంటారట. వారికి ఎప్పుడు ఏం కావాలో.. ముందే పసిగట్టేస్తారట. తమను ప్రేమించే అమ్మాయిలను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారట. అందుకే ఈ రాశుల వారు ఉత్తమ బాయ్ ఫ్రెండ్స్ గా ఉంటారట. ఈ రాశుల వారు ఎవరి లైఫ్ లో అడుగుపెట్టినా.. వారి జీవితం ఆనందమయంగా మారిపోతుందట. ఇంతకీ ఆ రాశులేవీ.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి.

మగాళ్లకు మాత్రమే.. ఇలా చేస్తే మహిళలకు అస్సలు నచ్చదట...! వారి మూడ్ ఆఫ్ అయిపోతుందట..

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి పురుషులు తమ చుట్టూ ఉండే వారిపై డామినేట్ చేయాలని భావిస్తారు. అయితే ఆ డామినేషన్ చాలా సరదాగా ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే.. వీరు అమ్మాయిలను అత్యంత ఎక్కువగా గౌరవిస్తారు. వారిని చాలా జాగ్రత్తగా, ప్రత్యేకంగా చూసుకుంటారు. వారి మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే వీరు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. మొత్తానికి ఈ రాశి పురుషులను బెస్ట్ బాయ్ ఫ్రెండ్స్ గా చెప్పొచ్చు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు తమ ప్రియురాలితో పాటు వీరి చుట్టూ ఉండే వారితో చాలా ఆప్యాయతగా మాట్లాడతారు. అయితే తమ భాగస్వామికి మాత్రం ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. వీరు ఎక్కువగా సమాజం గురించి ఆలోచిస్తుంటారు. అందుకే వీరంటే అందరూ ఇష్టపడతారు. మరోవైపు వీరు తమ భాగస్వామి విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు. వీరు తమ ప్రియురాలిపై చూపే ప్రేమను చూసి ఇతరులు అసూయపడతారు. ఎందుకంటే వీరిలో ఆటపట్టించే యాంగిల్ కొంత ఎక్కువగానే ఉంటుంది. ఇక ఆ కార్యాన్ని ఆస్వాదించడంలోనూ.. పార్ట్నర్ సుఖపెట్టడంలోనూ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటారట. వీరు తమ లైఫ్ పార్ట్నర్ ను ఎప్పటికీ నిరుత్సాహపరచరట.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారిని ఉత్తమ పురుషుడిగా చెప్పొచ్చు. వీరు చాలా ఓపెన్ మైండ్ తో ఉంటారు. లోపల ఒకటి.. బయటికి మరొకటి అనే విషయాలు అస్సలు మాట్లాడరు. అయితే వీరు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అదే సమయంలో అమ్మాయిల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. వారిని శారీరకంగా, మానసికంగా కావాల్సినంత సుఖాన్ని ఇవ్వడంలో వీరు మంచి నిపుణులు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడు తమ భాగస్వాములకు అరుదైన బహుమతులిచ్చి వారిని సర్ ప్రైజ్ చేస్తుంటారు.

Viral Story:తనతో పెళ్లి కావాలంటే.. ఈ షాకింగ్ రూల్స్ కు ఓకే చెప్పాలన్న కుర్రాడెవరో తెలుసా...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి మగవారు తమ జీవిత భాగస్వామిని మరియు తాము రిలేషన్ షిప్ కోరుకునే వారిని చాలా బాగా అర్థం చేసుకుంటారట. ఏదైనా సంబంధాలలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. ముఖ్యంగా ఏవైనా గొడవలు జరిగినప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో వీరికి బాగా తెలుసట. తమ జీవిత భాగస్వామిని భావోద్వేగ విషయాలతో బాగా నియంత్రిస్తారు. అందుకే ఈ రాశి వారిని ఉత్తమ పార్ట్నర్ గా చెప్పొచ్చు. వీరు తమ ప్రియురాలిని లేదా భాగస్వామిని చాలా ప్రేమగా చూసుకుంటారు. వారు అనునిత్యం ఆనందంగా ఉండేందుకే అన్ని ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి పురుషులు చాలా యాక్టివ్ గా ఉంటారు. వీరితో ఉండేవారిని ఎక్కువగా సంతోషపెడుతూ ఉంటారు. వీరిలో అమ్మాయిలను ఆకర్షించే ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. వీరు తమ లైఫ్ లోకి వచ్చే మహిళలను చాలా ప్రేమగా చూసుకుంటారు. వీరు రిలేషన్ షిప్ లో చాలా నమ్మకంగా ఉంటారు. వీరి లైఫ్ లోకి వచ్చే అమ్మాయిని ఎలా ఆనందపరచాలో వీరికి బాగా తెలుసు. తమను ప్రేమించే వారిపై చాలా కేరింగ్ చూపుతారు. అందరి కంటే తమ ప్రియురాలిని ప్రత్యేకంగా చూసుకుంటారు.

English summary

Zodiac Signs Who Make the Best Boyfriends in Telugu

Here are these zodiac signs who make the best boyfriends in Telugu. Take a look
Desktop Bottom Promotion