For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటిరోజు అత్తగారింట్లో అమ్మాయి ఫీలింగ్స్..

By Nutheti
|

పెళ్లైన తర్వాత మొదటి రోజు ప్రతి అమ్మాయి చాలా భయంగా, ఆందోళనగా ఉంటుంది. చాలా సంప్రదాయాలు, కొత్త సంబంధాలు, కొత్త మనుషులు, కొత్త కుటుంబంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అమ్మాయిలు తెలియని భయం ఫేస్ చేస్తారు.

ఎప్పుడైతే మహిళ తన భర్త ఇంట్లోకి అడుగుపెడుతుందో అప్పుడు తనలో చాలా మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. కొత్త లైఫ్ స్టైల్ కి అలవాటు పడాల్సి వస్తుంది. కొత్త జీవితం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అలాగే.. కొత్త మార్పులను ఆహ్వానించాల్సి ఉంటుంది. తనే ఫస్ట్ చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. పెళ్లైన తర్వాత మొదటి రోజు ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో చూద్దాం..

bride

టైంకి లేవడం
పెళ్లైన ప్రతి అమ్మాయి మొదటిరోజు ఫీలయ్యే విషయం ఇది. చాలాసేపు పడుకోవడం వల్ల ఏమనుకుంటారో అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి త్వరగా నిద్రలేచి.. త్వరగా రెడీ అయిపోవడం మంచిది.

డ్రెస్ విషయంలో
మొదటిరోజు అత్తగారి ఇంట్లో ఏ డ్రెస్ వేసుకోవాలి అని డిసైడ్ అవడం చాలా కష్టం. కొత్త బట్టలు చాలా ఉన్నా.. ఈ విధంగా ప్రతి అమ్మాయి ఫీల్ అవుతూ ఉంటుంది.

dressing

మొదటి భోజనం
కుటుంబ సభ్యులందరి మీరే వంట వండాల్సి వస్తుంది. అప్పుడు మీ వంటల గురించి వాళ్లందరూ కాంప్లిమెంట్స్ ఇస్తారు. కానీ మొదటిసారి వంట కావడంతో ఎలా ఉంటుందో ఏమో అన్న భయం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి భయపడకుండా.. మీ టాలెంట్ నిరూపించుకోండి.

marriage

అత్తమామ
ప్రతి అమ్మాయి తమ అత్తమామలు.. తమను ఇష్టపడాలని కోరుకుంటారు. అయితే మీకు మీరుగా ఉండండి.. వాళ్ల అబ్బాయి కోసమే మీరున్నారని నిరూపించుకోండి.

పేరెంట్స్
మొదటిరోజు అంతా కొత్త వాతావరణం, కొత్త రిలేషన్స్. దీంతో తమ పేరెంట్స్ ని, ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఫీలింగ్ ప్రతి ఒక్క అమ్మాయికి ఎదురవుతుంది.

English summary

The First Day After Marriage

The first day after marriage is usually a scary thought for an Indian woman. She has to go through a lot of customs and traditions, and the exciting part of it all is when she is introduced to the new family.
Story first published: Friday, December 11, 2015, 15:05 [IST]
Desktop Bottom Promotion