For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాంగ్ రిలేషన్స్ బ్రేకప్ అవడానికి షాకింగ్ రీజన్స్..!

రిలేషన్ వర్కవుట్ కానప్పుడు మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ..వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. ఇది ఒక వ్యక్తిని మాత్రమే చెడుగా మార్చదు. దీనికి ఇద్దరూ కారణమవుతారు.

By Swathi
|

ఎంతో అన్యోన్యంగా, ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేని వాళ్లు కూడా అనుకోని పరిస్థితుల్లో విడిపోతారు. అది సహజీవనం లేదా వైవాహిక బంధం.. ఏదైనా కావచ్చు. ఎంతో కాలం కలిసి ఉన్న జంట ఒకసారి వద్దు అనుకున్న తర్వాత విడిపోవడానికి చాలా మార్గాలు వెతుక్కుంటుంది. రిలేషన్ కి బ్రేక్ చెప్పాలి అనుకునేవాళ్లు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా మారిపోతారు. చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతుంటారు.

breakup

రిలేషన్ వర్కవుట్ కానప్పుడు మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ..వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. ఇది ఒక వ్యక్తిని మాత్రమే చెడుగా మార్చదు. దీనికి ఇద్దరూ కారణమవుతారు. ఇద్దరి మధ్య వచ్చే విభేధాలు, మన్సర్థలే దీనికి కారణం.

రిలేషన్ ముగిసిపోవడానికి అసలు కారణాలేంటో అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం చాలా అవసరం. దీనివల్ల ప్రేమలో అనవసర ఆందోళనలు, సమస్యలను దూరంగా పెట్టవచ్చు. రిలేషన్ బ్రేక్ అవడానికి కారణమయ్యే షాకింగ్ విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం.

డబ్బు సమస్యలు

డబ్బు సమస్యలు

డబ్బు తీసుకొచ్చే చిక్కులు అన్నీ ఇన్నీ కావు. భార్యాభర్తల మధ్య కొన్నిసార్లు డబ్బు చాలా పెద్ద సమస్యగా మారుతుంది. చాలా కంట్రోల్ గా డబ్బు ఖర్చు చేయాలని ఒకరు భావిస్తే, మరొకరు అన్నీ కావాలని కోరుకోవడం వంటి విభిన్నమైన ఆలోచనలు భార్యాభర్తల మధ్య సమస్యలు తీసుకొస్తాయి. దీనివల్ల విడిపోయే ఆలోచన పెరుగుతుంది.

పిల్లల కోసం

పిల్లల కోసం

కొంతమంది తమ పిల్లలు, పిల్లల భవిష్యత్ కోసమే.. కలిసి ఉంటారు. కానీ.. ఇది ఎంతవరకు హెల్తీ రిలేషనో ఆలోచించాలి. పిల్లలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో గ్రహించాలి.

కమ్యునికేషన్ లేకపోవడం

కమ్యునికేషన్ లేకపోవడం

లాంగ్ టర్మ్ రిలేషన్స్ లో మాట్లాడుకోవడం అనేది చాలా కీలకం. మాట్లాడటం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడకపోతే.. ఏం జరుగుతుందో తెలియక.. రిలేషన్ కి బ్రేకప్ చెప్పే అవకాశాలు పెరుగుతాయి.

కాంప్రమైజ్ కాకపోవడం

కాంప్రమైజ్ కాకపోవడం

ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతూ ఉండాలి. రిలేషన్ ని స్ట్రాంగ్ మార్చడంలో.. కాంప్రమైజేషన్ కీలకంగా పనిచేస్తుంది. మీ భాగస్వామి కోసం చిన్న చిన్న విషయాల్లో కాంప్రమైజ్ కాకపోతే.. బ్రేకప్ కి దారితీస్తుంది.

మోసం చేయడం

మోసం చేయడం

ఏన్నో ఏళ్లు కలిసి మెలిసి ఉన్న భార్యాభర్తలు విడిపోవడానికి మోసం కూడా కారణమవుతోంది. భర్త లేదా భార్యా.. ఇతరులతో సంబంధం మెయింటెయిన్ చేయడం, కొత్త పరిచయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం కూడా.. వాళ్ల రిలేషన్ బ్రేకప్ కి దారితీస్తోంది.

అభిరుచులు

అభిరుచులు

ఒకరి అభిరుచులు మరొకరికి నచ్చకపోవడం వల్ల కూడా.. రిలేషన్స్ బ్రేకప్ అవడానికి కారణమవుతాయి. ఇంతకాలం ఇద్దరి అభిరుచులను గౌరవించున్నవాళ్లు.. తర్వాత వచ్చే విభేధాల కారణంగా.. వాటిని వ్యతిరేకిస్తారు.

నిజాయితీ

నిజాయితీ

రిలేషన్ సక్సెస్ అవడానికి నిజాయితీ కీలక పాత్ర పోషిస్తుంది. జాలి, నిజాయితీ, నమ్మకం లేని ఎలాంటి రిలేషన్ కూడా.. వర్క్ వుట్ కాదు.

డిమాండ్

డిమాండ్

మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం, డిమాండ్ చేయడం వంటి లక్షణాలను ఎవరూ ఎక్కువ కాలం భరించలేరు. ముఖ్యంగా ఇది రిలేషన్ లో ఉండకూడదు. కమాండింగ్, డిమాండింగ్ నేచర్ రిలేషన్ ని నాశనం చేస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ఇగో

ఇగో

రిలేషన్ ని నాశనం చేసేవాటిల్లో అహం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. రిలేషన్ లో కాంప్రమైజ్ అవడం కంటే.. ఇగోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా కామన్ గా కనిపిస్తున్న సమస్య. కాబట్టి మీ రిలేషన్ ఇగో అనేది సమస్య కాకుండా.. జాగ్రత్త పడటం అవసరం.

గౌరవించుకోకపోవడం

గౌరవించుకోకపోవడం

ఒకరినొకరు కామెడీ చేసుకోవడం కామన్. బావుంటుంది. కానీ.. శారీరక హింస అనేది భరించలేనిది. అలాగే మీ భాగస్వామిని గౌరవించడం చాలా ముఖ్యమైన అలవాటు. గౌరవం కోల్పోయినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి. కాబట్టి.. సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ.. మీ భాగస్వామిని గౌరవించండి.

English summary

10 common reasons couples in long relationships break up

10 common reasons couples in long relationships break up. List of reasons why some long term relationships fizzle instead of sizzle.
Story first published: Thursday, November 10, 2016, 14:59 [IST]
Desktop Bottom Promotion