For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హనీమూన్ టైంలో కపుల్స్ ఫాలో అవ్వాల్సిన రొమాంటిక్ టిప్స్

By Swathi
|

పెళ్లి అనేది ఓ మధుర ఘట్టం. ఇందులో డ్రామా, కామెడీ, ట్రాజెడీ అన్నీ మీకు అనుభవాలు నేర్పుతాయి. పెళ్లిలో ప్రతి ముచ్చటా.. ఓ అందమైన అనుభూతే. షాపింగ్, మెహందీ, తలంబ్రాలు, ఫ్రెండ్స్, చుట్టాలు ఇలా అందరి మధ్య జరిగే ఈ వేడుక మరువలేని మధురానుభూతి తీసుకొస్తుంది.

ఇదంతా ఒకటైతే.. న్యూ కపుల్స్ ఫీలింగ్స్ గురించి చెప్పనక్కరలేదు. కొత్త వ్యక్తితో.. కొత్త జీవితం ఎలా ఉంటుందో అన్న ఆత్రుతతో పాటు.. కొత్త కొత్త ఆలోచనలు మనసు తలుపు తడతాయి. న్యూ లైఫ్, రొమాన్స్, ఫీలింగ్స్, షేరింగ్స్, ట్రిప్స్, టూర్స్, హనీమూన్ వంటివి మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. అయితే మీ పార్టనర్ గురించి పూర్తీగా తెలుసుకోవడానికి, వాళ్ల ఫీలింగ్స్ తెలుసుకోవడానికి సరైన సమయం హనీమూన్. మీ కొత్త మ్యారేజ్ లైఫ్ కి స్టార్టింగ్ పాయింట్ అయిన హనీమూన్ రొమాంటిక్ గా, హ్యాపీగా సాగాలంటే.. ఈ సింపుల్స్ టిప్స్ ఫాలో అయిపోండి.

సన్ రైజ్

సన్ రైజ్

కొత్తగా పెళ్లైన జంట ఉదయాన్నే లేచి సూర్యోదయం చూస్తే.. ఆ ఫీలింగే వేరు. ఆ తొలి కిరణాలు మీ ఇద్దరిపై పడితే.. కొత్త బిగినింగ్ లా, ఫ్రెష్ గా అనిపిస్తుంది.

ఫుడ్

ఫుడ్

కొత్తగా పెళ్లైనప్పుడు మీ ఇష్టాఇష్టాలు, అభిరుచులు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి.. మీ భాగస్వామికి ఇష్టమైన టిఫిన్ లేదా లంచ్ ఆర్డర్ చేయండి. మీకు తనమీద ఉన్న కేర్ ని చెప్పకనే చెప్పండి.

సాయంత్రం

సాయంత్రం

మీ హనీమూన్ సమయంలో సాయంత్రాన్ని మరింత రొమాంటిక్ గా మార్చేయండి. రొమాంటిక్ సాంగ్స్, మ్యూజిక్ ప్లే చేస్తూ.. అలా వ్యూ పాయింట్ చూస్తూ.. స్నాక్స్ తీసుకుంటూ.. క్లైమెట్ ఎంజాయ్ చేయండి.

చిలిపి చేష్టలు

చిలిపి చేష్టలు

హనీమూన్ సమయంలో... సీరియస్ గా అసలు ఉండకండి. బెడ్ రూమ్ లో సెక్స్ గురించి కంగారు పడకుండా.. చిలిపి చేష్టలతో ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న గేమ్స్ తో సరదాగా గడపండి. దిండుతో కొట్టుకుంటూ.. ఇద్దరూ జాలీగా గడపండి.

లవ్ అండ్ రొమాన్స్

లవ్ అండ్ రొమాన్స్

హనీమూన్ అంటే.. మీ ఇద్దరే ఏకాంతంగా.. రొమాంటిక్ గా గడిపే సమయం. కాబట్టి మీ మధ్యలో ఎవరూ లేరన్న విషయం గుర్తుంచుకోండి.. మీ తలుపు తట్టడానికి ఎవరూ రారని మరవకండి. కాబట్టి ఫ్రీగా ఇంట్లో చేయలేని రొమాన్స్ హనీమూన్ లో ఎంజాయ్ చేయండి.

మీకిష్టమైన పనులు

మీకిష్టమైన పనులు

పెళ్లైన తర్వాత ప్రతి నిమిషమూ ఇద్దరూ కలిసి ఉండాలని లేదు. కాబట్టి.. మీ ఇష్టాలకు కూడా విలువనివ్వండి. కాసేపు మీ కోసం సమయం కేటాయించండి. మీకు నచ్చిన పనులు అంటే.. బుక్స్ చదవడం, టీవీ చూడటం వంటివి కూడా చేస్తుండాలి.

కపుల్ స్పా

కపుల్ స్పా

హనీమూన్ అంటే రిలాక్సేషన్. సైట్ సీయింగ్ తోనే కాలం గడిపేయకుండా.. కపుల్ స్పాకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవండి. శరీరానికి, మైండ్ కి కాస్త ఉపశమనం కలిగించండి.

ఫోటోలు

ఫోటోలు

మీ భాగస్వామి తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, నవ్వుతున్నప్పుడు ఫోటోలు క్లిక్ చేయండి. ఇలాంటి ఫోటోలు మీకు కలకాలం గుర్తిండిపోతాయి.. మెమరీస్ గా ఉండిపోతాయి.

రొమాన్స్

రొమాన్స్

హనీమూన్ కి వెళ్లినప్పుడు అటూ ఇటూ తిరిగి అలసిపోయి ఉంటారు. ఎంత అలసిపోయినా.. ఎంత కష్టపడినా.. బెడ్ పైన కాస్త సమయం స్పెండ్ చేయాలి. రొమాంటిక్ మూడ్ లో మీ భాగస్వామికి ఆనందాన్నివ్వాలి. అప్పుడే.. మీ హనీమూన్ లవ్లీగా ఉంటుంది.

సర్ ప్రైజ్

సర్ ప్రైజ్

ఒకరికొకరు సర్ ప్రైజ్ లు ఇచ్చుకోవాలి. ఒకరికి తెలియకుండా.. మరొకరికి గిఫ్ట్స్, లెటర్స్, పెళ్లి ఫోటోలు, జువెలరీ వంటి ఇచ్చి సర్ ప్రైజ్ చేయాలి. సీక్రెట్ గా ఇచ్చే ఇలాంటి అనుభూతులు మరింత ఆనందాన్నిస్తాయి.

English summary

10 Ways to Add Romance to Your Honeymoon

Couple should get to taste the good aspects of getting married on their honeymoon. And, if you are still unsure about that ‘fantasy’ element, then here is your enlightenment chart. Take a look at the top ten things that you must try out as a couple, while on your honeymoon.
Story first published: Monday, January 4, 2016, 17:18 [IST]
Desktop Bottom Promotion