For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంత త్వరగా పెళ్లెందుకు చేసుకున్నామా అని ఫీలయ్యే సందర్భాలు..!

జీవితంలో చాలా త్వరగా పెళ్లి చేసుకున్నామని కొంతమంది ఫీలవుతూ ఉంటారు. వైవాహిక బంధం కాస్త ఇబ్బందిగా మారినప్పుడు, ఇద్దరి మధ్య సమస్యలు పెరిగినప్పుడు, భాగస్వామి ప్రవర్తన నచ్చనప్పుడు ఇలా ఫీలవుతూ ఉంటారు.

By Swathi
|

జీవితంలో చాలా త్వరగా పెళ్లి చేసుకున్నామని కొంతమంది ఫీలవుతూ ఉంటారు. వైవాహిక బంధం కాస్త ఇబ్బందిగా మారినప్పుడు, ఇద్దరి మధ్య సమస్యలు పెరిగినప్పుడు, భాగస్వామి ప్రవర్తన నచ్చనప్పుడు ఇలా ఫీలవుతూ ఉంటారు.

Did You Marry Too Early?

పెళ్లి అత్యంత ఆనందాన్ని ఇస్తుందని ఎలాంటి గ్యారెంటీ లేదు. కానీ ఇప్పటికీ చాలామంది పెళ్లి సంతోషాన్నిస్తుందని నమ్ముతారు. కానీ మనం ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉండవచ్చేమో. కానీ ఎప్పుడైతే పెళ్లి బోరింగ్ స్టేజ్ కి వస్తుందో.. అప్పుడు అది నిరాశ కలిగిస్తుంది.

భాగస్వామి గురించి కాకుండా ఇతర అంశాలపై ఆసక్తి కలిగినప్పుడు, ఇతరులకు ఎట్రాక్ట్ అయినప్పుడు త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి సందర్భాలు ఏంటో చూద్దాం..

సంకేతం 1

సంకేతం 1

మీ ఈ ప్రపంచం అంతా చుట్టేయాలని భావిస్తారు. కానీ మీ భర్త వద్దు అని చెబుతారు. మీ క్రేజీ ఐడియాని ఎప్పుడైతే.. మీ భర్త తిరస్కరిస్తారో.. అప్పుడు త్వరగా పెళ్లి ఎందుకు చేసుకున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది.

సంకేతం 2

సంకేతం 2

మీ సహోద్యోగి లేదా బాస్ తో ప్రేమలో పడినప్పుడు.. ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. వాళ్లతో చాలా సన్నిహిత సంబంధం ఏర్పడినప్పుడు.. త్వరగా పెళ్లి చేసుకోకపోయి ఉంటే బావుండేది అనిపిస్తుంది.

సంకేతం 3

సంకేతం 3

చాలా సాహసోపేతంగా ఆలోచనలు వచ్చినప్పుడు, జంతువులతో ఫోటోలు తీసుకోవాలి అనుకున్నప్పుడు, అడవుల్లో తిరగాలి అన్న కోరిక ఉన్నప్పుడు మీ అత్తగారు వద్దు అంటే.. అప్పుడు ఈ ఫీలింగ్ కలుగుతుంది. మీ పిల్లలు, భాగస్వామి, అత్తమామల కోసం మీ కెరీర్ ని వదులుకోవాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో కూడా ఇలాగే ఫీలవుతారు.

సంకేతం 4

సంకేతం 4

మీ చుట్టూ ఆసక్తికర మనుషులు ఉన్నప్పుడు.. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లాలంటే.. ఇష్టపడరు. అలాంటి సందర్భంలో కూడా.. ఎందుకు త్వరగా పెళ్లిచేసుకున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది.

సంకేతం 5

సంకేతం 5

పెళ్లైన తర్వాత జీవితం మొత్తం మీకు మీరు నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఎలాంటి బాధ్యతలను నిర్వర్తించలేకపోవడం వంటి సందర్భాలు.. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీ కుటుంబ సభ్యులే చెప్పినప్పుడు.. వైవాహిక బంధంపై కోపం వస్తుంది.

సంకేతం 6

సంకేతం 6

నైట్ లైఫ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడాన్ని మీరు ఇష్టపడతారు. కానీ.. మీ పార్ట్ నర్ ప్రతి 5 నిమిషాలకొకసారి ఫోన్ చేసి.. సేఫ్ గా ఇంటికి చేరావా అని ప్రశ్నించినప్పుడు ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది.

సంకేతం 7

సంకేతం 7

మీ లైఫ్ ని ఫ్రీ బర్డ్ లా ఎంజాయ్ చేయాలని మీరు భావించినప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ బాధ్యతలు, మీ పిల్లలు, అత్తమామల గురించి గుర్తుచేసినప్పుడు.. ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

English summary

Did You Marry Too Early?

Did You Marry Too Early? At least once, married people might get a feeling that they have married too early in life. Such a feeling arises when married life seems stuck and something interesting starts happening outside marriage.
Desktop Bottom Promotion