For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూర్ఖంగా భర్తలు చేసే.. అత్యంత పిచ్చి పనులు..!

By Swathi
|

పెళ్లి చాలా విషయాలను నేర్పిస్తుంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత.. కొన్ని పిచ్చి పనులు చేయడానికి వీలు ఉండదు. ఒకవేళ మూర్ఖంగా ఏవైనా పనులు చేస్తే.. మీ భార్య దానికి ఆగ్రహించవచ్చు. లేదా బాధపెట్టవచ్చు.

మంచి భర్తగా భార్యను అర్థం చేసుకోవడం, ఆమె జీవితం మీతో చాలా సౌకర్యవంతంగా ఉండేలా చేయడం చాలా అవసరం. కానీ అలా నడుచుకోవడం భార్య లొంగిపోయి ఉండే భర్త అనిపించుకుంటుందని చాలా మంది భావిస్తారు. కానీ అది పొరపాటు. కానీ కొన్ని విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

అసలు భార్యకు కోపం రావడానికి కారణం ఏంటి ? భార్యను బాధపెట్టేలా.. భర్తలు చేసే పిచ్చిపనులేంటో తెలుసుకోండి ? అలాంటి పనులు మీరు చేయకుండా.. మీ మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి..

భార్యను అమ్మతో పోల్చడం

భార్యను అమ్మతో పోల్చడం

మీ అమ్మ వండిన ఫుడ్ నచ్చితే.. ఎంజాయ్ చేయండి. మీ అమ్మలోని లక్షణాలు నచ్చితే.. ఎలాంటి తప్పు లేదు. కానీ.. ఒకవేళ మీ భార్యను మీ అమ్మతో పోల్చి.. ఆమెతో నేర్చుకోమని సలహా ఇస్తే.. మీపై ఖచ్చితంగా ఆగ్రహిస్తుంది.

ఆర్డర్స్ ఇవ్వడం

ఆర్డర్స్ ఇవ్వడం

మహా రాజులా.. మీ భార్యకు ఆర్డర్స్ ఇవ్వాలనుకోవడం.. కమాండ్ చేయడం వంటి అలవాట్లు.. మీ భార్యను ఇబ్బందిపెడతాయి. అలాంటి పనులు చేస్తే.. ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపపడేలా చేస్తుందామె.

సడెన్ గా ఫ్రెండ్స్ ని తీసుకురావడం

సడెన్ గా ఫ్రెండ్స్ ని తీసుకురావడం

ఆమెకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా.. మీ ఫ్రెండ్స్ ని లంచ్ తీసుకువస్తే.. ఏమవుతుందో మీరే చూడండి. ఇలాంటి పిచ్చిపనులు.. మీ భార్యను చాలా ఇబ్బందిపెడతాయి.

భార్య పేరెంట్స్ ని విమర్శించడం

భార్య పేరెంట్స్ ని విమర్శించడం

మీరు మీ కలలో కూడా.. మీ భార్య తల్లిదండ్రులను విమర్శించకూడదు. ఒకవేళ మీరు అలాంటి పనులు చేస్తే.. ఆమె జీవితంలో మిమ్మల్ని క్షమించదు.

మాజీ ప్రియుల గురించి మాట్లాడటం

మాజీ ప్రియుల గురించి మాట్లాడటం

పాత ఎఫైర్స్ గురించి మాట్లాడటాన్ని మగవాళ్లు ఇష్టపడతారు. పెళ్లి తర్వాత అది చాలా మూర్ఖత్వం. ఇలాంటి మాటల వల్ల మీ భార్య ఆగ్రహానికి గురికావచ్చు. మీపై కోపాన్ని తీసుకురావచ్చు.

ఒకవైపు నిర్ణయాలు తీసుకోవడం

ఒకవైపు నిర్ణయాలు తీసుకోవడం

మీ భార్యను సంప్రదించకుండా.. ఆమె అభిప్రాయం తీసుకోకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఏదైనా తప్పు జరిగితే.. దానిగురించి మీ జీవితాంతం మీ బుర్ర తినేస్తుంది. కాబట్టి.. ముందుగానే ఆమెతో చర్చించడం మంచిది.

అమ్మ, భార్య మధ్య గొడవలు

అమ్మ, భార్య మధ్య గొడవలు

ఒకవేళ మీరు మీ భార్య, అమ్మ మధ్య వచ్చే గొడవలను కంట్రోల్ చేయడంలో విఫలం ఫర్వాలేదు.. వాళ్లతో కలిసి మాత్రం పోట్లాడకండి. అది.. మీ ఇద్దరి మధ్య వరల్డ్ వార్ తీసుకొచ్చే పిచ్చి పని అవుతుంది.

English summary

Foolish Things Husbands Do

Foolish Things Husbands Do. Marriage will teach you a lot of lessons. Especially, after marriage, you can't afford to do certain foolish things that will annoy your wife. Well, here are some foolish things husbands do....
Story first published: Monday, November 21, 2016, 16:00 [IST]
Desktop Bottom Promotion