For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స‌క్సెస్ ఫుల్ క‌పుల్స్ ఫాలో అయ్యే స్వీట్ సీక్రెట్స్

By Swathi
|

పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు. అది నిజమే. కానీ అందరి జీవితాలకు, బాంధవ్యాలకు కరెక్ట్ కాకపోవచ్చు. కొంతమంది.. కలకాలం అన్యోన్యంగా, సంతోషంగా ఉంటారు. కానీ కొంతమంది చీటికిమాటికీ వాదులాడుకుంటూ, గొడవలతో రిలేషన్ లో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు.

ఇద్దరి మధ్య రిలేషన్ హ్యాపీగా ఉండాలి అంటే ఏ ఒక్కరి సహకారం సరిపోదు. ఇద్దరికీ సర్దుకుపోయే తత్వం ఉండాలి. ప్రేమపంచే గుణం ఉండాలి. రిలేషన్ షిప్ లో సక్సెస్ అవ్వాలంటే.. ఫాలో అవ్వాల్సిన సక్సెస్ ఫుల్ హ్యాబిట్స్ కొన్ని ఉన్నాయి. వీటిని కాస్త మీ రిలేషన్ లో చేర్చుకోండి.. మీ బంధాన్ని బలపరుచుకోండి.

మీ భాగస్వామికి మొదటి ప్రాధాన్యత

మీ భాగస్వామికి మొదటి ప్రాధాన్యత

ఏ విషయంలోనైనా మీ భాగస్వామికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలు కూడా సెకండ్ ప్లేస్ లోనే ఉంటారు. ఎందుకంటే.. మీ పేరెంట్స్, పిల్లలు, ఫ్రెండ్స్ అందరూ వెళ్లిపోయినా.. మీ జీవితం చివరి వరకు మీతో గడిపేది మీ భాగస్వామే. కాబట్టి.. మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ మీ భాగస్వామికే ఇవ్వడం అలవాటు చేసుకోండి.

గౌర‌వం

గౌర‌వం

మీ భాగ‌స్వామి ప‌ట్ల గౌర‌వం చూపించ‌డం అనేది హ్యాపీ రిలేష‌న్ లో ఒక హెల్తీ అల‌వాటుగా చెప్ప‌వ‌చ్చు. ఎప్పుడైతే మీ భాగ‌స్వామి ప‌ట్ల రెస్పెక్ట్ చూపిస్తారో.. అప్పుడు ప్రేమ‌, యాక్సెప్టెన్స్ కలిగిస్తాయి.

ప్రేమ

ప్రేమ

పెళ్లైన కొంతకాలం వరకే రిలేషన్ లో ప్రేమ ఉంటుందని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. కానీ.. మీ భాగస్వామికి జీవితాంతం ప్రేమ పంచండి. పిల్లలు, మీ తల్లిదండ్రులతో లైఫ్ బిజీగా మారినా.. మీ పార్ట్ నర్ తో స్పెండ్ చేసే టైమ్ ని మాత్రం మిస్సవకండి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉన్నా.. కొంత సమయం మీ భాగస్వామితో గడపండి. ప్రేమను పంచండి.

వాకింగ్

వాకింగ్

మీరు ప్ర‌కృతిని ప్రేమించ‌డాన్ని, ఎక్కువ స‌మ‌యాన్ని మీ భాగ‌స్వామితో గ‌డ‌పాల‌ని భావిస్తున్న‌ట్లైతే.. రోజు ప్రారంభించ‌డానికి ముందు లేదా సాయంత్రం వాకింగ్ కి వెళ్లండి. రోజూ ఇలా వాకింగ్ చేయ‌డం వ‌ల్ల ఇద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ బ‌ల‌ప‌డుతుంది.

అటెన్షన్

అటెన్షన్

మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్ర్టాంగ్ ఉండాలి అంటే.. కొన్ని అలవాట్లు మంచి ఫలితాలనిస్తాయి. చిన్న పనులే అయినా.. ఎక్కువ సంతోషాన్ని, మీ మధ్య బాంధవ్యాన్ని రెట్టింపు చేస్తాయి. ఆఫీస్ కి వెళ్లే ముందు మీ పార్ట్ నర్ కి ఒక ముద్దు ఇవ్వడం వల్ల తనపై మీరు చూపిస్తున్న ప్రేమను తెలుపుతుంది. అలాగే పడుకునే ముందు కిస్ తో గుడ్ నైట్ చెప్పండి. ఇది సీల్లీగా ఉన్నా.. మీ రిలేషన్ షిప్ స్ర్టాంగ్ గా మారడానికి ఇదో చక్కటి అలవాటు.

ఉద‌యాన్నే కాఫీ

ఉద‌యాన్నే కాఫీ

కాఫీ ఇవ్వ‌డ‌మ‌నేది చిన్న అల‌వాటే అయినా.. మీ భ‌ర్త‌కు చాలా పెద్ద అనుభూతినిస్తుంది. ఉద‌యాన్నే కాఫీ ఇవ్వ‌డం వ‌ల్ల కాఫీ తాగ‌డాన్ని మీ భ‌ర్త ఎంజాయ్ చేస్తారు, అలాగే త‌న‌పై మీరు చూపించే ప్రేమ‌, ఎఫెక్ష‌న్ ను సూచిస్తుంది.

పోలిక

పోలిక

ఇతరులతో పోల్చడం, క్రిటిసైజ్ చేయడం వంటి పనులు చేయకండి. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అంగీకరించడం అలవాటు చేసుకోండి. ప్రతి సారి జాగ్రత్తగా వ్యవహరించడం లేదని నిందించకండి. ప్రతిసారీ మీ పార్ట్ నర్ ని తక్కువ చేసి చూడటం వల్ల రిలేషన్ లో మనస్పర్థలు వస్తాయి. ఫ్రెండ్లీగా ఉండటం అలవాటుగా మార్చుకుంటే.. మీ రిలేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.

English summary

Powerful Habits of Happy Relationships

Powerful Habits of Happy Relationships. Implement each of these habits in your relationship and start reconnecting with your partner!
Story first published: Monday, March 7, 2016, 17:21 [IST]
Desktop Bottom Promotion