For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యారేజ్ అయ్యాక మొదటి ఏడాదికి ఎందుకంత ప్రాధాన్యత ?

By Super
|

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ముఖ్యమైనది. అలాగే పెళ్లైన మొదటి ఏడాది కపుల్స్ జీవితంలో అత్యంత ముఖ్యమైనది. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజ్ అయినా.. ఈ 12 నెలలు చాలా కొత్త అనుభూతులు, అలాగే కొత్త అనుభవాలు నేర్చుకోవాలి. అందుకే పెళ్లైన మొదటి సంవత్సరం పెళ్లైన జంట విషయంలో చాలా ఇంపార్టెంట్.

మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఇయర్ సరదాగా, హ్యాపీగా ఉంటుంది. పెళ్లి అనేది భవిష్యత్ గురించి ఆలోచింపజేస్తుంది. అంతా పాజిటివ్ గా ఉన్నప్పటికీ.. ఏదో కొంత చింత ఉండే ఉంటుంది. అది కూడా మొదటి ఏడాది ఇలాంటి ఫీలింగ్ కంపల్సరీ ఎదురవుతుంది.

లైఫ్ ని లవ్ చేయడానికి పెళ్లి చెప్పే ముచ్చట్లేంటి ?

సరైన అండర్ స్టాండింగ్ లేని సందర్భాలు, కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు ఇద్దరి మధ్య ఎదురవుతాయి. ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రాసెస్ లోనే ఉంటే.. మీరు ఇంకా డైలమాలో ఉన్నారని అర్థం. పెళ్లైన కొత్త జంట జీవితంలో కుటుంబాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే రెండుకుంటుబాలు ఒక్కటై.. ఎన్నో ఒడిదుడుకులను నేర్పిస్తాయి.

పెళ్లైన మొదటి సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూడండి.

first year of marriage

పంచుకోవడం
ఇద్దరూ ప్రతి ఒక్క విషయాన్ని ఒకరినొకరు పంచుకోవడం మొదటి ఏడాదిలో నేర్చుకోవాలి. ముందుగా మీ భాగస్వామికి మీ భవిష్యత్ లక్ష్యాలు, గతంలోని విషయాలు అర్థమయ్యేలా వివరించాలి.

first year of marriage

ఒకరి గురించి ఒకరికి తెలియకపోవడం
కొత్త సర్ప్రైజ్ ల కోసం సిద్ధంగా ఉండండి. మీ పెళ్లైన మొదటి ఏడాదిని పాజిటివ్ ఆలోచనలతో స్వాగతించండి. మీ భాగస్వామి తప్పులను స్వీకరించండి. ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదని గుర్తుంచుకోండి.

first year of marriage

గొడవలు
గొడవలు చాలా కామన్. వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేదాన్ని నేర్చుకోండి. కానీ గొడవలు మీ ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతాయని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

first year of marriage

కుటుంబాలు
పెళ్లైన తర్వాత రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి. కాబట్టి ఒకరినొకరు ప్రేమగా జీవించడాన్ని నేర్చుకోండి. రెండు కుటుంబాలను అర్థం చేసుకుంటూ.. అందరితో హ్యాపీగా ఉండటానికి అలవాటు పడండి.

సమస్యలు
ఒక్కసారి పెళ్లైయ్యాక అనేక సమస్యలు ఎదురవుతాయి. ఎదుర్కోవాల్సిన ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవాలి. మొదటి సంవత్సరం అంతా కొత్తగా ఉన్నప్పటికీ.. ఎలాంటి పరిస్థితినైనా.. అన్యోన్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

English summary

Why Is The First Year Of Marriage Important?

Why Is The First Year Of Marriage Important? It is rightly said that the first year of marriage is important and equally the hardest phase in any couple's life.
Story first published: Thursday, February 18, 2016, 16:53 [IST]
Desktop Bottom Promotion