సెక్స్ పై ఆసక్తి లేకుంటే ప్రేమ లేదు? ఎంత వరకూ నిజం? మానసిక నిపుణులు ఏమంటున్నారు?

సెక్స్‌, ప్రేమ, పెళ్ళి! ఎంత ప్రాముఖ్యమైన అంశాలివి. వీటి ప్రభావానికి గురికాని వారెవ్వరూ ఉండరు. అయినా కూడా దేవుడు మానవులకిచ్చిన ఈ వరముల యొక్క నిజమైన ఉద్దేశ్యమును తెలుసుకోకుండా ఎంతో అజ్ఞానము కలిగి ఉన్నార

సెక్స్‌, ప్రేమ, పెళ్ళి! ఎంత ప్రాముఖ్యమైన అంశాలివి. వీటి ప్రభావానికి గురికాని వారెవ్వరూ ఉండరు. అయినా కూడా దేవుడు మానవులకిచ్చిన ఈ వరముల యొక్క నిజమైన ఉద్దేశ్యమును తెలుసుకోకుండా ఎంతో అజ్ఞానము కలిగి ఉన్నారు.

ప్రస్తుత సమాజంలో ప్రేమ అనేది కేవలం సెక్స్‌ కోసమే అన్నట్లుగా యువత వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రేమలో ఉన్న దాదాపు అంతా కూడా సెక్స్‌ సుఖాలను అనుభవిస్తున్న వారే. డేటింగ్ ల పేరుతో సహజీవనం కొనసాగించే వారి సంఖ్య కూడా పెరిగింది. సమాజంలో ఇటువంటి సంబంధాలు ఎన్ని నిలుస్తాయో, ఎన్ని విడిపోతాయో తెలియదు కానీ, లవర్స్‌లో ఒకరికి సెక్స్‌ ఆసక్తి లేకున్నా మరొకరు సెక్స్‌ పట్ల వారి అభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సెక్స్‌కు ఒప్పుకోకుంటే నేనంటే నీకు ఇష్టం లేదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దాంతో అవతలి వారు సెక్స్‌కు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. భార్య భర్తల మద్య కూడా ప్రస్తుతం ప్రేమ కంటే కూడా అధికంగా సెక్స్‌ ప్రాముఖ్యత వహిస్తుందని చెప్పక తప్పదు. దీని పై ఒక తాజా అద్యయంన చేసిన సర్వే వివరాలు తెలుసుకుందాం..

1. సర్వే ప్రకారం ఒక భార్య లేదా భర్త

1. సర్వే ప్రకారం ఒక భార్య లేదా భర్త

తాజాగా వెళ్లడి అయిన సర్వే ప్రకారం ఒక భార్య లేదా భర్త తన పార్టనర్‌ తనతో సెక్స్‌లో సరిగా పాల్గొనడం లేదు, ఆమెకు లేదా అతడిని నేను అంటే ప్రేమ లేనట్లుంది అంటు తమ మనస్సులోని మాటను బయట పెట్టారట.

2. ఇది ఒక్కరి సమస్య కాదు

2. ఇది ఒక్కరి సమస్య కాదు

ఇది ఒక్కరి సమస్య మాత్రమే కాదు. ప్రపంచంలో ఉన్న దంపతుల్లో దాదాపు 60శాతం ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. పెళ్లి అయిన కొంత కాలం వరకూ సెక్స్ లో రెచ్చిపోతారు.

3. ఇద్దరి మద్య విభేదాలకు కారణం

3. ఇద్దరి మద్య విభేదాలకు కారణం

కానీ కొంత కాలం తర్వాత సెక్స్ అంటే ఆసక్తి ఉండదు. మొక్కుబడిగా వారంలో రెండు మూడు సార్లు మాత్రమే చేస్తుంటారు. దాంతో ఇద్దరి మద్య విభేదాలు వస్తాయి.

4. సెక్స్ పై ఆసక్తి లేకుంటే ప్రేమ లేదు? ఎంత వరకూ నిజం

4. సెక్స్ పై ఆసక్తి లేకుంటే ప్రేమ లేదు? ఎంత వరకూ నిజం

అంటే తమతో సెక్స్‌ సరిగా చేయకుంటే లేదా, తాము సెక్స్‌ కావాలని కోరుకున్న సమయంలో అవతలి వారు ఇవ్వకుంటే ప్రేమ లేనట్లే అంటూ భావిస్తున్నారు. ఈ అభిప్రాయం తప్పని మానసిక నిపుణులు చెబుతున్నారు.

5. సెక్స్‌ను ప్రేమను కలిపి చూడటం మంచిది కాదు

5. సెక్స్‌ను ప్రేమను కలిపి చూడటం మంచిది కాదు

ఒక వ్యక్తి సెక్స్‌ను ప్రేమను కలిపి చూడటం మంచి పద్దతి కాదు. ఆమెకు లేదా అతడికి ఎంత ప్రేమ ఉన్నా కూడా కొన్ని సందర్బాల్లో సెక్స్‌ ఆసక్తి ఉండక పోవచ్చు.

6. ఇష్టం ఉంది, కానీ అదంటే భయమూ ఉంది

6. ఇష్టం ఉంది, కానీ అదంటే భయమూ ఉంది

అంత మాత్రాన ఆమె లేదా అతడు ప్రేమించడం లేదు అని నిర్ధారణకు రావద్దు. ఉదాహరణకు ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ఘాడంగా ప్రేమించింది. వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు సెక్స్‌ అంటే భయంతో అతడిని దగ్గరకు రానివ్వడం లేదు. వచ్చినా కూడా ఆందోళన చెందుతుంది. అంటే ఆమెకు అతడంటే ఇష్టం లేనట్లు కాదు.

7. భయం వల్ల అనాసక్తి కనబర్చవచ్చు

7. భయం వల్ల అనాసక్తి కనబర్చవచ్చు

ఆమెకు అతడంటే చాలా ఇష్టం, అయినా కూడా ఆమెకు సెక్స్‌ అంటే ఏదో తెలియని ఆందోళన, అందుకే ఆమె అతడు అంటే ఇష్టం ఉన్నా కూడా సెక్స్‌ విషయానికి వచ్చే వరకు ఆమె అనాసక్తిని కనబర్చుతుంది. అందుకే సెక్స్‌ ఆసక్తి లేకుంటే ప్రేమ లేనట్లుగా భావించవద్దు.

8. స్ట్రెస్, ఇతరత్రా కారణాలు

8. స్ట్రెస్, ఇతరత్రా కారణాలు

పని ఒత్తిడి లేదా ఇతరత్రా కారణాల వల్ల సెక్స్ అంటే అతడికి ఆసక్తి ఉండకపోవచ్చు. అతడితో ప్రేమగా మాట్లాడాలి. ఎంత కష్టం అయినా మీ మాటతో మర్చిపోయేలా చేయాలి. అలా అతడి మనస్సును నెమ్మదిపర్చి ఆ తర్వాత అతడితో సెక్స్ కు ప్రేరేపించాలి. అలా చేస్తే మునుపటిలాగే ప్రతి రోజూ కూడా సెక్స్ కు సిద్దం అవుతాడు. సెక్స్ చేయనంత మాత్రాన ప్రేమ లేదు అన్నట్లుగా భావించడం తప్పు. మరి మీరేమెంటారు? మీ కమెంట్స్ ను ఈ క్రింది బాక్స్ లో పొందుపర్చండి....

Desktop Bottom Promotion