మీ భాగస్వామిలో శృంగార స్పందనలు కరువయ్యాయ..?శృంగార స్పందనలు..ఏ వయసులో ఎలా ఉంటాయో తెలుసా?

Posted By:
Subscribe to Boldsky

సాధారణంగా పురుషులకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యల్లో అంగస్తంభన సమస్య కూడా ఒక అనారోగ్యసమస్య. నవీనయుగంలో పోటీతత్వం మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయుస్తుంది. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, నిద్రలేమి, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు 'లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు.

 How Erections in men change from their 20s to their 70s: Expert Study

మగాళ్లు చాలా ప్రాధాన్యం ఇచ్చే అంశాల్లో శృంగారం ముఖ్యమైంది. ఎంత ఎక్కువ సేపు సెక్స్ చేయగలిగితే, ఎంతగా తమ భాగస్వామిని ఆనందింప జేయగల్గితే వారికి అంత మజా. ఇంటర్నెట్ వాడకం పెరగడంతో పోర్న్ వీడియోల వీక్షణ బాగా పెరిగింది.

దీని ప్రభావం మానసిక ఆరోగ్యంపై కూడా పడింది. మారిన జీవన విధానం కారణంగా అంగ స్తంభన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఇంతకూ ఏ వయసులో అంగ స్తంభనలు ఎలా ఉంటే సాధారణమో తెలుసుకోండి.

20 ఏళ్ళ వయసులో

20 ఏళ్ళ వయసులో

20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మాంచి ఉత్సాహం మీదుంటారు. శృంగార వాంఛలు అధికంగా ఉంటాయి. అంగస్తంభనలు తరచుగా ఉంటుంటాయి. 20 ఏళ్ల వయసులో మన ప్రమేయం లేకుండానే స్తంభనలు రావడంతోపాటు శృంగార పరమైన ఆలోచనలు వస్తుంటాయి. ముందే వీర్యం పడిపోవడం లాంటి సమస్యలు దాదాపుగా ఉండవు.

30 ఏళ్ళ వయసులో..

30 ఏళ్ళ వయసులో..

30 ఏళ్ళ వయసులో.. ముప్ఫయేళ్ల వయసు చాలా బాలెన్స్‌డ్ దశ. శృంగార కోరికలు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటాయి. కానీ 20 ఏళ్ల వయసుతో పోల్చుకుంటే తరచుగా, తరచుగా అంగస్తంభనలు కలగడం తక్కువగా ఉంటుంది. చక్కటి లైంగిక జీవితాన్ని ఆస్వాదించడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు.

 40 ఏళ్ళ వయసులో..

40 ఏళ్ళ వయసులో..

40 ఏళ్ళ వయసులో..40 ఏళ్లొచ్చాక శారీరకంగా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అంగస్తంభనలో చిన్నపాటి సమస్యలు మొదలవుతాయి. మరీ అంతగా ఇబ్బంది పెట్టే సమస్యలు కావుగానీ లైంగిక అంశాలపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

50 ఏళ్ళ వయసులో..

50 ఏళ్ళ వయసులో..

50 ఏళ్లు వచ్చినప్పటికీ జీవితంలో సెక్స్‌కు ఉన్న ప్రాధాన్యమేమీ తగ్గదు. కాకపోతే శృంగార వాంఛలు తక్కువగా కలుగుతాయి. ఉదయం, రాత్రి వేళల్లో అంగ స్తంభనలు అరుదుగా కలిగినప్పటికీ మరీ అంత ఇబ్బందేం ఉండదు.

60 ఏళ్ళ వయసులో..

60 ఏళ్ళ వయసులో..

ఆరు పదుల వయసులో లైంగికాసక్తి తగ్గిపోతుంది. అంగస్తంభన సమస్యలు పెరుగుతాయి. స్తంభనలు పూర్తిగా ఆగిపోవు గానీ అందుకోసం ప్రయత్నించాల్సి ఉంటుంది.

70 ఏళ్ళ వయసులో..

70 ఏళ్ళ వయసులో..

70 ఏళ్ల వయసులో కామేచ్ఛ పూర్తిగా తగ్గిపోతుంది. అంగ స్తంభలు కలగడం కూడా తగ్గుతుంది. సహజంగానే ప్రమేయం లేకుండా కలిగే స్తంభనలు అరుదుగా ఉంటాయి.

English summary

How Erections in men change from their 20s to their 70s: Expert Study

Among a lot of things men give importance to when it comes to performance in bed, a strong and long lasting erection seems to be every man's idea of giving an orgasm and a great sexual experience to ther partner.
Story first published: Wednesday, May 3, 2017, 14:52 [IST]
Subscribe Newsletter