పెళ్ళి తర్వాత మజా..మస్తీ..జల్సాలు..అన్నింటికి బ్రేక్...! అవునా..?

Posted By:
Subscribe to Boldsky

మీ చుట్టూ వివాహ౦ అయిన వారు ఉంటే, పెళ్లి జీవితంలో ఆనందాన్ని చంపుతుందని చెప్తారు. మన చుట్టూ ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలూ వివాహాన్ని చాలా ఆహ్లాదంగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా స్నేహితులలో ఒకరు వివాహం చేసుకునేటపుడు.

వారు “మీకు స్వేచ్చ లేదు”, “మీ జీవితం నాశనమైనట్టే” “ఇది ఒక శిక్ష లాంటిది” ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. అది నిజమేనా? వివాహమనేది ఒక నిర్బంధం లాంటిది, ఇది స్వేచ్చని, స్వాతంత్రాన్ని చంపేస్తుంది ఎందుకు? వివాహం అనేది కేవలం సంతోషం, ప్రేమ కోసం మాత్రమే ఎందుకు కాదు?

సరే, ప్రజలు సాధారణంగా వివాహాన్ని అసహ్యించుకుంటారు, ఇప్పటికీ అలా జరగడానికి కారణాలేమిటో చూద్దాం.

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 1

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 1

ఏ పెళ్ళైనా పాడయిపోవడానికి అత్తమామలు ఒక కారణం. మీరు అబ్బాయైనా లేదా అమ్మాయినా మీ భాగస్వామి తల్లిదండ్రులు మిమ్మల్ని సరిగా చూడరు, మీ భాగస్వామిని మీరు గౌరవించినప్పటికీ మీరు మీ వివాహాన్ని అసహ్యించుకోవడం మొదలుపెట్టవచ్చు.

కానీ,భాగాస్వాములు గనక ఈ విషయాన్ని కూర్చొని స్నేహపూర్వకంగా పరిష్కరించుకుంటే అంతా మామూలైపోవచ్చు.

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 2

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 2

ఆర్ధిక స్వేచ్చ మరో కారణం.మీరు కనుక ఇన్నాళ్ళు డబ్బులను విచ్చలవిడిగా కర్చుపెట్టి ఉంటే , పెళ్లి తరువాత,మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీ కర్చును తగ్గించుకోవాల్సి ఉంటుంది.

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 3

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 3

ఏ పెళ్ళైనా అంతంకావడానికి తరుచూ వాదనలు కూడా మరో కారణం.కానీ మీరు అనుకూలమైన భాగస్వామిని ఎన్నుకుని, ఇద్దరిలో ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు మౌనంగా ఉండడం అలవాటు చేసుకుంటే , సమస్యను ప్రతిశోదించు కోవచ్చు.

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 4

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 4

అవును, పిల్లలు బరువు బాధ్యతలను పెంచుతారు కాబట్టి కొంతమందికి ఈ కారణంచేత పెళ్ళంటే గిట్టదు.కానీ మీరు పెంపుడు జంతువులను లేదా పిల్లలను పెంచుకుంటుంటే కనుక, వారు మీకు ఎంత ఆనందాన్నిస్తున్నారో పరిగణించుకోవాలే తప్ప; బరువు బాధ్యతలను కాదు!

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 5

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 5

పెళ్లి మిమ్మల్ని లావుగా మరియు అనారోగ్యకరంగా మారుస్తుంది!!దీనివల్లే కొంతమంది ఫిర్యాదు చేస్తుంటారు.

నిజానికి, మిమ్మల్ని లావుగా మార్చేది పెళ్లి కాదు; మీ జీవనవిధానం మరియు ఆహారపు అలవాట్లు. కాబట్టి మీ ఫిట్నెస్ లెవెల్స్ అదుపులో ఉండడానికి ఒక మార్గం ఆలోచించండి.

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 6

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 6

పెళ్లి మీ స్వేచ్చను నాశనం చేస్తుంది.స్నేహితులతో గడపడానికి సమయం ఉండదు!

అయితే, మీకు ప్రతిరోజూ లేదా మీ జీవితంలో ప్రతిక్షణం మీ స్నేహితులు మీతో ఉండాలా?అది అసాధ్యం! మీరు నెలకు ఒకసారి మీ స్నేహితులను కలిసి వారితో మంచి సమయం గడపవచ్చు.

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 7

పెళ్లి తర్వాత వచ్చే సమస్య # 7

పెళ్లి సరసాన్ని అంతంచేస్తుంది. శృంగారం చికాకుగా తోస్తుంది.

అయితే , మీరు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా; ఒకే మనిషిని ప్రేమించడం రేపోమాపో చికాకుగా తోస్తుంది.కాని ప్రేమ మీకు చికాకుగా అనిపించదు. భద్రత మీకు ఎప్పుడూ విసుగు అనిపించదు. కాబట్టి, మీరు కనుక మీ భాగస్వామిని ప్రేమించినట్లితే ,మిగిలిన విషయాలు అవే సర్దుకుంటాయి మరియు పెళ్లి అనేది జీవితంలో ఒక అందమైన అడుగు అవుతుంది.

English summary

Is Marriage The End Of Happiness?

Is Marriage The End Of Happiness?,Is marriage the end of happiness? Does marriage kill romance? Why everyone around us talk like that? Read on to know...
Please Wait while comments are loading...
Subscribe Newsletter