మీ ఉద్యోగం, మీ వైవాహిక జీవితాన్ని మింగేస్తోందా, దాని లక్షణాలు !

By: Deepthi
Subscribe to Boldsky

ఇటీవల ఒక సర్వే ప్రకారం, ఉద్యోగాలే జంటల మధ్య అపార్థాలకి, విడాకులకి ఒక రకంగా ముఖ్య కారణమని తెలిసింది. కానీ ఒక ఉద్యోగం వివాహ జీవితాన్ని నాశనం చేయగలదా?

నిజాయితీగా ఉద్యోగం చేస్తే తప్పేంటి? మీరు కష్టపడి పనిచేస్తున్నారంటే, మీ వైవాహిక జీవితం పాడవ్వాల్సిందేనా?

ఉద్యోగం మీ వ్యక్తిగత జీవితం

కాదు ! మీరు మీ ఉద్యోగాన్ని ప్రేమిస్తూ చాలా బాగా పనిచేయవచ్చు. కానీ మీ ఇంట్లో ప్రేమించే వారిని నిర్లక్ష్యపరిస్తే, అది అపార్థాలకు కారణమవుతుంది. ఇదిగో మీ ఉద్యోగం మీ వ్యక్తిగత జీవితానికి అడ్డుపడుతోందనటానికి సంకేతాలు..

మీ పనిని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారా?

మీ పనిని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారా?

ఆఫీసులో చేయాల్సిన పని, ఈ మధ్యకాలంలో అందరూ అందులో కొంత పనినైనా ఇంటికి తీసుకెళ్ళి చేస్తున్నారు. అందులో తప్పేం లేదు. కానీ మీ భాగస్వామి దీనిపట్ల చిరాకుగా ఉంటే ఏంటి పరిస్థితి? అదే సంకేతం, మీ భాగస్వామిపై మీ పని ప్రభావం పడుతోందని !

మీ భాగస్వామి మీతో సమయం గడపాలనుకున్నప్పుడు, మీరు సాకులు చెప్తున్నారా?

మీ భాగస్వామి మీతో సమయం గడపాలనుకున్నప్పుడు, మీరు సాకులు చెప్తున్నారా?

మీ భాగస్వామి రొమాంటిక్ మూడ్ లో వుండి, మీతో శారీరకంగా కొంత సమయం గడపాలనుకుంటే, మీరు మీ లాప్ టాప్ ను బెడ్ రూమ్ లోకి తెచ్చి అతను లేదా ఆమెను నిరీక్షించేలా చేస్తున్నారు.

మీ భాగస్వామి నిరాశ చెంది, మీతో మాట్లాడకుండా నిద్రపోతారు. ఇది మరో సంకేతం, మీ పని మీ బంధాన్ని చంపేస్తోందని !

మీ పని వత్తిడిని మీ భాగస్వామిపై చూపిస్తున్నారా?

మీ పని వత్తిడిని మీ భాగస్వామిపై చూపిస్తున్నారా?

మీరు పనిచేసే చోట ఏదో తప్పు జరిగి, ఇంటికొచ్చాక కూడా మీ భాగస్వామిపై అకారణంగా అరుస్తున్నారా? ఇది మరో సంకేతం.

పనివత్తిడి కారణంగా శారీరక బంధాన్ని నిరాకరిస్తున్నారా?

పనివత్తిడి కారణంగా శారీరక బంధాన్ని నిరాకరిస్తున్నారా?

మీ భాగస్వామి మీతో నగ్నంగా ఉండి ప్రయత్నిస్తుంటే, మీకు పనివల్ల చాలా నీరసంగా ఉండి, బెడ్ పై పడి సహకరించకుండా నిద్రపోతే, ఇది మరో సంకేతం, మీ పని మీ వ్యక్తిగత జీవితంపై భారం వేస్తోందని !

బిజినెస్ ట్రిప్ లపై తరచూ వెళ్తారా?

బిజినెస్ ట్రిప్ లపై తరచూ వెళ్తారా?

మీరు బయట ఊరికి తరచూ పనిపై వెళ్తూ, భాగస్వామి మొహాన్నే అరుదుగా చూస్తున్నారు. నిజమే, మీరు మీ బంధాన్ని కొంచెం నాణ్యమైన సమయం వారితో గడిపి పునరుద్ధరించుకోవచ్చు.

మీ భాగస్వామి జన్మదినం మర్చిపోతారా?

మీ భాగస్వామి జన్మదినం మర్చిపోతారా?

మీరు మీపనిలో పూర్తిగా పడిపోయి, వారి బర్త్ డే నాడు కూడా విష్ చేయడం మరిచిపోయారు. ఇదే కాదు అన్ని ముఖ్యమైన రోజులు కూడా మర్చిపోతారు. ఇదే సంకేతం, మీ పని, వైవాహిక జీవితపు ఆనందం లాగేస్తోందని.

అనవసర పెళ్ళి అని చింతిస్తున్నారా?

అనవసర పెళ్ళి అని చింతిస్తున్నారా?

మీ భాగస్వామి మీరు నిర్లక్ష్యపరుస్తున్నారని నిందించగానే, మీకు అనవసరంగా పెళ్ళిచేసుకున్నానని వెంటనే అన్పిస్తుంది. ఆ సమయంలో పనివత్తిడి వల్ల అలా అన్పించొచ్చు కానీ ఏదో మధ్యేమార్గం తప్పక ఉంటుంది. ప్రయత్నించండి !

English summary

Signs Your Job Is Killing Your Marriage

A recent survey blames the nature of jobs for a percentage of misunderstandings and divorces in today's world. But can a job really ruin marital life?
Story first published: Friday, July 28, 2017, 12:38 [IST]
Subscribe Newsletter