పెళ్ళైన స్త్రీలు చెప్పే రహస్యాలను ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాలి !

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

పెళ్ళైన తర్వాత ఆ భావన ఎలా ఉంటుంది అనే విషయం చెబితే తెలిసేది కాదు. స్వయంగా అనుభవించవలసి ఉంటుంది. మీ భాగస్వామి యొక్క బంధువులు లేదా తల్లిదండ్రులు మీకు ఎంతో పరిచయస్తులు అయిఉండొచ్చు లేదా పెళ్ళికి ముందు మీ భాగస్వామితో ఎంతో సమయం గడిపి ఉండొచ్చు అయినప్పటికీ ఒక అమ్మాయి పెళ్లి తర్వాత జరగబోయే విషయాలను ముందే ఊహించడం చాలా కష్టం. ఏడు మంది పెళ్ళైన స్త్రీలను మీకు పెళ్లి కాక ముందు మీరు ఏమనుకున్నారు? ఆ తర్వాత ఏమైంది అని కొన్ని విషయాలను అడగగా వాళ్ళు ఆసక్తికరమైన విషయాల గురించి చెప్పారు. వాళ్ళు ఏమిచెప్పారో ఇప్పుడుచూద్దాం...

స్త్రీలకు పురుషులు చెప్పకూడని రహస్యాలు ఇవే..

1. ఎదో ఒక పుకారు లేదా మాటలు ఆలా వస్తూనే ఉంటాయి :

1. ఎదో ఒక పుకారు లేదా మాటలు ఆలా వస్తూనే ఉంటాయి :

" మీరు ఎవరిపైన అయినా నమ్మకం ఉంచాలన్నా లేదా ఏ విషయాలనైనా నమ్మాలన్నా ఆచి తూచి వ్యవహరించండి. నాకు పెళ్ళైన తర్వాత మా అత్తగారు ఆమె యొక్క బాధలను మరియు కష్టాలను నాతో పంచుకునేవారు. ముఖ్యంగా ఆమె యొక్క పెద్ద కోడలుతో జరిగిన చెడు అనుభవాల గురించి నాకు చెప్పే వారు. అవి విని నేను ఎంతో బాధపడేదానిని. నా శక్తిమేర వీలైనంత మేరకు ఆమెను ఆనందంగా మరియు సౌకర్యవంతంగా చూసుకోవాలని భావించేదానిని. కానీ ఒక సంవత్సరం తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ఆమె నా గురించి కూడా అందరితో పుకార్లు చెబుతుంది అనే విషయాన్ని నేను గమనించాను " అని చెప్పుకొచ్చింది 34 ఏళ్ల ప్రాచి అగర్వాల్.

2. కుటుంబ రాజకీయాలు :

2. కుటుంబ రాజకీయాలు :

" కుటుంబ రాజకీయాలు పెళ్లిని చేయగలవు లేదా జరిగిన పెళ్లిని తుంచేయగలవు. కుటుంబంలో ఎంతోమంది బంధుమిత్రులు ఉంటారు, లెక్కపెట్టలేనంత మంది. వారి గురించి చెప్పుకుంటూపోతే సమయం చాలదు. వాళ్లలో అందరూ మళ్ళీ కొన్ని కొన్ని గ్రూపులుగా విడిపోయి ఉంటారు. ఒకరంటే ఒకరికి పడకపోవచ్చు కూడా. కానీ వీళ్లందరితో సమతుల్యతను పాటిస్తూ వ్యవహరించడం కత్తిమీద సాము అనే చెప్పాలి. నా భర్తకు సన్నిహితురాలైన ఒక బంధువుకు, ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎంతగానో సహాయపడ్డాను. కానీ సమయం గడిచే కొద్దీ ఆమె ప్రాముఖ్యతలు మారిపోయాయి, చివరికి నన్నే దోషిగా నిలబెట్టేసింది " అని చెప్పుకొచ్చింది 37 యేళ్ళ అహనా శర్మ.

3. మీ భర్త ఎప్పుడూ మీ వైపే ఉంటాడు అని అనుకోకండి :

3. మీ భర్త ఎప్పుడూ మీ వైపే ఉంటాడు అని అనుకోకండి :

" నేను మా అత్తామామల నుండి ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెబుతూ, గుండెలు అలిసేలా ఏడుస్తూ, నా బాధను నా భర్తకు చెబుతూ ఉంటే, తాను మాత్రం ఎంతో మౌనంగా ఉంటున్నాడు. ఇది చూసి నేను ఎంతగానో కలత చెందేదానిని. ఇదే భర్త ప్రేమికుడిగా ఉన్నప్పుడు నాతో సమయం గడిపిన సందర్భాల్లో, వాళ్ళ కుటుంబ సమస్యల గురించి నా దగ్గర ఏకరువు పెట్టేవాడు. " అని చెప్పుకొచ్చింది 29 యేళ్ళ భావన శేఖర్.

4. ఏకాంత సమయం కావాలని విపరీతముగా తాపత్రయపడతారు :

4. ఏకాంత సమయం కావాలని విపరీతముగా తాపత్రయపడతారు :

" ఇది వినడానికి అంత నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. కానీ మీకంటూ కొద్దిగా ఏకాంత సమయం కావాలని కోరుకుంటారు. పరుపు మొత్తం మీకే కావాలనిపిస్తుంది లేదా టి.వి లో క్రికెట్ మ్యాచ్ వంటి శబ్దాలు ఏమి లేకుండా వాటికీ దూరంగా ఒక నిశ్శబ్దమైన సాయంత్రాన్ని గడపాలని భావిస్తారు " అని చెప్పుకొచ్చింది 28 యేళ్ళ స్నిగ్ధ భాసిన్.

5. ఆర్ధిక సంబంధమైన విషయాలు వ్యక్తిగత పరిధిలో ఉండవఫు :

5. ఆర్ధిక సంబంధమైన విషయాలు వ్యక్తిగత పరిధిలో ఉండవఫు :

" కుటుంబంలో ఉన్న అందరూ ప్రతి నెల అందుకుంటున్న జీతాలను చూసి మా అత్తమామలు ఎంతో గర్వంగా భావించేవారు. భర్త పనిచేస్తున్న నగరంలోకి వెళ్లిన తరువాత అక్కడ ఒక కొత్త ఉద్యోగంలో చేరాను. నేను అప్పుడు ఎంతో ఆనందానికి లోనయ్యాను. ఈ శుభవార్తను అటు మా కుటుంబ సభ్యులతో పాటు ఇటు నా భర్త కుటుంబ సభ్యులతో కూడా పంచుకున్నాను. ఇలా చెప్పినప్పుడు మా నాన్న మొదట అడిగిన ప్రశ్న ఇప్పుడున్న నగరం సురక్షితమేనా అని ఆందోళన వ్యక్తం చేసారు. కానీ, మామగారు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే నీ జీతం ఎంత ? " అని చెప్పుకొచ్చింది 33 యేళ్ళ రుచిరా జైన్.

6. అసలు గోప్యత అంటే ఏమిటి ?

6. అసలు గోప్యత అంటే ఏమిటి ?

" మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మరియు ప్రతి ఒక్క క్షణాన్ని మీ భాగస్వామితో పంచుకోవాలని భావిస్తారు. అది వినడానికి ఎంతో రొమాంటిక్ గా ఉంటుంది, బాగుంటుంది. కానీ, కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని మీరు గోప్యంగా ఉంచాలని భావిస్తారు. నన్ను నమ్మండి ఎవరికీ హానిచేయని కొన్ని రహస్యాలను, ఎవరికీ తెలియకుండా కొన్ని సందర్భాలలో గోప్యంగా ఉంచడం వల్ల ఎటువంటి నష్టం లేదు. "

సెక్స్ గురించి ఎవరికి తెలియని కొన్ని రహస్యాలు అందులో పొందుపరిచారు..!!

7. ఆహారపు అలవాట్లు కొద్దిగా సమస్యగా మారవచ్చు :

7. ఆహారపు అలవాట్లు కొద్దిగా సమస్యగా మారవచ్చు :

" విభిన్న రకాలైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం అనేది అంత సులభమైన విషయం ఏమి కాదు. మా అత్తింటి వారు బయటికి వెళ్లి తినడాన్ని ఒప్పుకోరు. కొన్ని రోజులు ఎలా ఉండేదంటే నేను బయట ఎక్కడైనా తిని వచ్చినా, తప్పక ఇంట్లో మా అత్తామామ లతో కలిసి భోజనం చేసేదానిని. అందుకు ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే, నా భర్త ఆ కుటుంబంలో ఉన్న బయట తినకూడదు అనే ఎవరు మాట్లాడకూడని నిబంధన గురించి మాట్లాడటానికి విపరీతంగా బయపడేవాడు. "

8. స్త్రీలు ఆత్మసౌందర్యాన్ని ఇష్టపడతారు-

8. స్త్రీలు ఆత్మసౌందర్యాన్ని ఇష్టపడతారు-

మీరు మంచి వ్యక్తిగా స్త్రీ హృదయంలో స్థానం సంపాదించాలంటే, మీరు ఏమి దాచకూడదు. "స్త్రీలు ఆత్మసౌందర్యాన్ని ఇష్టపడతారు, వారు శ్రద్ద మరియు సున్నితత్వం గల వ్యక్తియొక్క ప్రేమను ప్రేమిస్తారు." స్త్రీ, తన పురుషుడిలోని తప్పు-చీటికి మాటికి కోపం రావటం, దీనిని ఆటను తెలుసుకుంటే చాలా సంతోషిస్తుంది, ఉదాహరణకి ఆఫీస్ నుండి విచారకర మూడ్ తో రావటం, ఈ విషయం అతను తనంతట తాను గ్రహిస్తే, స్త్రీ చాలా సంతోషిస్తుంది.

9. సంబందాల గురించి చర్చించుకోవాల్సి వస్తే భయపడకండి-

9. సంబందాల గురించి చర్చించుకోవాల్సి వస్తే భయపడకండి-

మీ స్త్రీ సంబంధబాంధవ్యాల గురించి మాట్లాడితే మీరు ఏదో తప్పు చేసినట్లుగా కాదు. ఇది చాలా మంచి విషయం. నిజాయితీపరమైన విస్తృత చర్చ మీ ఇద్దరినీ ఇంకా దగ్గరగా చేరుస్తుంది.

10. ఆమె ప్రపంచాన్ని మీరు నిర్దారించకండి-

10. ఆమె ప్రపంచాన్ని మీరు నిర్దారించకండి-

ఆమెను ఏదైనా సమస్య వేధిస్తుంటే మీకు చెప్పాలనుకుంటుంది, మీ సలహా మాత్రం కాదు. మగవారు సహజంగా సమస్యలిని పరిష్కరించగలరనే భావనతో ఉంటారు. కాని స్త్రీ ఏ సమస్య అయిన వింటుంది, ఓపిగ్గా వినటం, ఇది ఇద్దరి మధ్య బాంధవ్యాన్ని పెంచుతుంది.

విన్నట్లుగా తల ఊపటం ఒక్కటే సరిపోదు-వినటం ముఖ్యమే, కాని తను వింటున్నానే గుర్తింపును కూడా కోరుకుంటుంది. ఒకవేళ ఆమె మీతో ఆమె బాస్ పని పూర్తిచేయటానికి ఆఖరి సమయం ఇచ్చాడని చెప్పినప్పుడు మీ దగ్గరనుండి " ఈ రోజు పనితో చాలా అలసిపొయావు. సారి" అన్న సమాధానాన్ని ఆశిస్తుంది. మరియు గుర్తుంచుకోండి పరిష్కారాలను అందించాలానే కోరికను మాత్రం అదుపులో ఉంచుకోండి.

English summary

married women real life secrets

Married women reveal secrets every girl should know. Read to know more about...
Story first published: Thursday, October 12, 2017, 17:15 [IST]
Subscribe Newsletter