Latest Updates
-
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా -
మీ సోదరుడి రాశి చక్రం ఆధారంగా ఈ రాఖీలు కడితే.. వారి సంతోషానికి ఢోకా ఉండదు.! -
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?
మీరు బయట ఊరికి వెళ్ళినపుడు మీ భార్య ఆనందంగా గడుపుతున్నారా?
కొత్తగా ఇటీవల జరిగిన సర్వేలలో, కొత్తగా పెళ్ళయిన వారు, యువతుల ప్రకారం 80% స్త్రీలు భర్త లేని సమయాల్లో ఆనందంగా అప్పుడప్పుడైనా గడుపుతామని తెలిపారు !
కొత్తగా ఇటీవల జరిగిన సర్వేలలో, కొత్తగా పెళ్ళయిన వారు, యువతుల ప్రకారం 80% స్త్రీలు భర్త లేని సమయాల్లో ఆనందంగా అప్పుడప్పుడైనా గడుపుతామని తెలిపారు !
మగవారేం దీన్ని తప్పుగా తీసుకోవక్కర్లేదు. ఎందుకంటే వారు కొంచెంసేపు కేవలం మనఃశ్శాంతినే కోరుకుంటున్నారు. నిజానికి మగవారు కూడా భార్యలు ఊళ్ళో లేనప్పుడు ఇదే రకమైన శాంతిని పొందుతారు ! అంటే వారికి కూడా ఇది కావాలన్నమాటేగా !
ఇదిగో ఈ కారణాలు చదివి మీరు ఊరెళ్తే మీ భార్య ఎందుకు ఆనందిస్తుందో తెలుసుకోండి.

ఆమె తన స్నేహితురాళ్ళను ఇంటికి తెచ్చుకోవచ్చు
పాతమిత్రులను కలవటం, వారిని ఇంటికి ఆహ్వానించటం, టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవటం ఇవన్నీ ఎంతో హాయిని కలిగిస్తాయి. అందుకని మీ భార్య మీరు లేకుండా సంతోషపడుతోందంటే బాధపడకండి. అది ఆమె మానసిక వత్తిడిని తగ్గిస్తుంది.

ఆమె వంట గురించి ఆలోచించక్కర్లేదు
ఇది రోజూ రుచికర వంటకాలు చేయాల్సి వచ్చే ఒత్తిడి ఉన్న మహిళలకు. భర్త ఊరెళ్తే, వంటగదిని కొన్నాళ్ళు మూసేయచ్చు. అది నిజంగానే విశ్రాంతి. బయట ఆహారం ఆర్డర్ ఇచ్చి, వంట కొన్నిరోజులు మానేస్తే ఆమె మానసిక ఒత్తిడి పోతుంది.

ఆమె ఎక్కువసేపు పడుకోవచ్చు
నిద్రలేమి సమయంలో ఒక్కగంట ఎక్కువ పడుకోగలిగినా స్వర్గమే. ఇంటిపనులు ఎలాగో తగ్గడంతో, ఆమె ఎక్కువసేపు పడుకోవచ్చు, కదా.

టివి చూడవచ్చు
భర్త ఊళ్ళో లేకపోతే- టివి రిమోట్ కోసం కొట్టుకోవక్కర్లేదు. అసలు అందుకే ఆమె మీరు లేకుండా ఆనందిస్తుందేమో.

బట్టలు ఉతకడం గురించి ఆలోచించక్కర్లేదు
జీవితంలో దేని గురించి ఆలోచించనక్కరలేకపోవడం వరం. మరీ ఇలాంటి రోజువారీ పనులైన బట్టలు ఉతకడం వంటివి- భర్త ఇంట్లో లేనప్పుడు ఆలోచించక్కర్లేదు.

ఇంటి గూర్చి ఆలోచించకుండా ఆఫీసులో కొన్ని ఎక్కువ గంటలు పనిచేయవచ్చు
మీకు మీ పనంటే ప్రాణమయి, కానీ భర్త ఇంటికి త్వరగా రమ్మని గొడవచేసే వ్యక్తి అయితే, అతను ఊళ్ళో లేనప్పుడు ప్రశాంతంగా ఆఫీసులో పనిచేసుకోవచ్చు.

వాదనలు ఉండవు…
హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, సంగీతం వింటూ, ధ్యానం చేసుకుంటూ, లేదా అస్సలు ఏమీ చేయకుండానే సమయం అంతా గడిపేయొచ్చు- అదీ మీ భర్త ఊళ్ళో లేనప్పుడు.



Click it and Unblock the Notifications