కండోమ్ వాడకుండా సెక్స్ లో పాల్గొన్నా కూడా గర్భం రాకూడదంటే ఏం చెయ్యాలి?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు రామలక్ష్మి. నాకు వివాహమై నాలుగేళ్లు అవుతోంది. నాకు మా ఆయన అన్ని విషయాల్లో బాగా సహకరిస్తాడు. మాకు ప్రస్తుతం ఒక బాబు ఉన్నాడు. వాడు కూడా సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టాడు. బాబు అంటే నాకు మా ఆయనకు బాగా ఇష్టం. అయితే మేము కొన్నాళ్ల వరకు పిల్లలు పుట్టకూడదని నిర్ణయించుకున్నాం.

సంతృప్తి లభించడం లేదట

సంతృప్తి లభించడం లేదట

పిల్లలు వద్దనుకున్నాంగానీ మేమిద్దరం శృంగారంలో మాత్రం పాల్గొనాలని భావించాం. దాంతో మా ఆయన్ని కండోమ్స్ ఉపయోగించమని చెప్పాను. మా ఆయన కండోమ్ వేసుకుని నాతో సెక్స్ చేస్తుంటే ఆయనకు అసలు సంతృప్తి లభించడం లేదట.

కండోమ్ చినిగిపోతుంది

కండోమ్ చినిగిపోతుంది

నాకు కూడా మా ఆయన కండోమ్ వేసుకుని సెక్స్ చేస్తుంటే ఎలాంటి థ్రిల్ కలగడం లేదు. మా ఆయన చాలా బలంగా స్ట్రోక్స్ ఇస్తాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో కండోమ్ చినిగిపోతుంది కూడా. దీంతో వీర్యం యోనిలోకి వెళ్లిపోతుంది.

గర్భం రాకుండా ఉండాలంటే

గర్భం రాకుండా ఉండాలంటే

కండోమ్ వల్ల సంతృప్తి లభించకపోవడంతో వైద్యులను సంప్రదించాం. కండోమ్‌ వాడకుండా సెక్స్ లో పాల్గొన్నా కూడా గర్భం రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పండని సూచనలు అడిగాం.

ఏడాది పాటు మీరు పిల్లలు కనొద్దండి

ఏడాది పాటు మీరు పిల్లలు కనొద్దండి

నేను లూపు వేయించుకుంటే మంచిదని డాక్టర్లు చెప్పారు. మా బాబు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టాడు కాబట్టి నేను కొన్ని రోజుల పాటు గర్భం ధరించకపోవడమే మంచిదని డాక్టర్లు చెప్పారు. కనీసం ఏడాది పాటు మీరు పిల్లలు కనొద్దండి అని డాక్టర్లు చెప్పారు.

లూప్ వేయించుకోవొద్దు

లూప్ వేయించుకోవొద్దు

డాక్టర్లు చెప్పిన సూచలన్నింటినీ నేను పాటించేందుకు సిద్దమయ్యాను. అలాంటి తరుణంలో మా ఆయన నువ్వు లూప్ వేయించుకోవొద్దు అని అంటున్నాడు. లూప్ వేయించుకుంటే సెక్స్ అస్సలు తనకు సంతృప్తి కలగదని అంటున్నాడు.

సెక్స్ లో పాల్గొన్నా కూడా

సెక్స్ లో పాల్గొన్నా కూడా

లూప్ వల్ల నిజంగా సెక్స్ లో సంతృప్తి కలగదా? మహిళలు లూప్

వేయించుకోవడం మంచిది కాదా? లూప్ ఉపయోగిస్తే కచ్చితంగా గర్భం రాదా? సెక్స్ లో పాల్గొన్నా కూడా పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో కాస్త వివరించగలరు.

సిజేరియన్ ఆపరేషన్ తర్వాత

సిజేరియన్ ఆపరేషన్ తర్వాత

సమాధానం : చాలా మంది గర్భిణిలకు ప్రసవ సమయంలో సిజేరియన్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. అలా అయిన తర్వాత మళ్లీ వెంటనే గర్భం ధరిస్తే చాలా ప్రమాదకరం. అందుకే సిజేరియన్ ఆపరేషన్ తర్వాత కాస్త ఎడం పాటించండని డాక్టర్లు సలహా ఇస్తుంటారు.

కండోమ్స్ ఉపయోగిస్తే సంతోషం లేదు కదా

కండోమ్స్ ఉపయోగిస్తే సంతోషం లేదు కదా

ఇక మీ విషయానికి వస్తే మీరు స్వచ్ఛందంగానే కొన్ని రోజుల పాటు పిల్లలు వద్దని కోరుకుంటున్నారు. అయితే మీరు సెక్స్ లో కూడా ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. ఇక కండోమ్స్ ఉపయోగిస్తే మీ ఆయన సంతోషం కలగడం లేదని అంటున్నారు.

కచ్చితంగా గర్భం

కచ్చితంగా గర్భం

కండోమ్స్ ఉపయోగించకుండా, లూప్ వేయింకోకుండా సెక్స్ లో పాల్గొంటే కచ్చితంగా గర్భం వస్తుంది. అయితే పిల్స్‌, కాపర్‌ టీ, ఇంజెక్షన్లు, తదితర వాటి ద్వారా గర్భం రాకుండా చేసుకోవొచ్చు.

అవగాహన లేకపోవడం వల్లే

అవగాహన లేకపోవడం వల్లే

ఇక లూప్ పై పురుషుల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే వారు తమ భార్యలు లూప్ వేయించుకోవద్దని చెబుతారు. లూపు వల్ల ఎలాంటి నష్టాలుండవు. ఈ విషయం మీ ఆయనకు అర్థం అయ్యేలా డాక్లర్ల ద్వారా చెప్పించండి.

గర్భ నిరోధక మాత్రలు

గర్భ నిరోధక మాత్రలు

లూపు విధానానికి ప్రత్యామ్నాయంగా అంటే గర్భ నిరోధక మాత్రలు తీసుకోవొచ్చు. అయితే గర్భనిరోధక మాత్రలను డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వాడడం మంచిది. ఇక లూప్ ఉపయోగిస్తే 99శాతం గర్భం రాదు.

English summary

can i get pregnant when i am using the loop im a bit worried

can i get pregnant when i am using the loop im a bit worried
Story first published: Friday, March 30, 2018, 13:18 [IST]