నా భార్యతో పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే త్వరగా గర్భం వస్తుందా ? ఆ సమయంలో సెక్స్ కావాలంటోంది!

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : మేము బెంగళూరులో ఉంటాం. నేను బిజినెస్ చేస్తూ ఉంటాను. నా భార్య ఇంట్లోనే ఉంటుంది. మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. నేను నా వ్యాపార పనుల మీద రోజూ చాల ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను. నేను ఎక్కడికి వెళ్లినా రాత్రికల్లా ఇంటికి వస్తుంటాను. నా భార్యతో ప్రతి రాత్రి పడకగదిలో సుఖాన్ని చూస్తాను.

సెక్స్ కోర్కెలు అధికం

సెక్స్ కోర్కెలు అధికం

నా భార్య మామూలు రోజుల్లో కన్నా ఆమె పీరియడ్స్ లో ఉండే రోజుల్లోనే ఎక్కువగా సెక్స్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతూ ఉంటుంది. నా భార్యకు బహిష్టు సమయంలోనే సెక్స్ కోర్కెలు అధికంగా కలుగుతాయంట.

సెక్స్ కోరికలు నామమాత్రం

సెక్స్ కోరికలు నామమాత్రం

ఇక మిగిలిన వేళల్లో నా భార్యకు సెక్స్ కోరికలు నామమాత్రంగానే ఉంటాయంట. బహిష్టు సమయంలోనే నన్ను అసలు బయటకు వెళ్లనివ్వదు. రోజంతా తనతోనే ఉండమని పట్టుపడుతుంది.

మసాజ్ చేయించుకుంటుంది

మసాజ్ చేయించుకుంటుంది

నాతో ఆమె తన బాడీ మొత్తం మసాజ్ చేయించుకుంటుంది. తొడలను బాగా నొక్కమని చెబుతుంది. తర్వాత సెక్స్ చేయమని కోరుతుంది. నాకు ఆ సమయంలో ఆమెతో సెక్స్ లో పాల్గొనాలని ఉండదు. కానీ తప్పని పరిస్థితుల్లో నా భార్యతో నేను సెక్స్ లో పాల్గొంటున్నాను.

తాకడానికి కూడా ఇష్టం ఉండదు

తాకడానికి కూడా ఇష్టం ఉండదు

నాకు అటువంటి సమయంలో కనీసం ఆమెను తాకడానికి కూడా ఇష్టం ఉండదు. పీరియడ్స్‌లో ఉండగా సంభోగం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది చెప్పారు. నేను అలా సెక్స్ చేయను అని చెబితే నా భార్య తీవ్ర నిరాశకు గురవుతోంది.

నన్ను బెదిరిస్తూ ఉంటుంది

నన్ను బెదిరిస్తూ ఉంటుంది

నేను ఒక ఆ రోజు ఇంటి దగ్గర ఉండకుండా, సెక్స్ చేయకుండా బిజినెస్ పనిమీద బయటకు వెళ్తే నన్ను బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు బయటకు వెళ్లిన తర్వాత ఇంటికి ఎవరినైనా పిలిపించుకుంటాను అంటుంది.

తనను కొట్టాను కూడా

తనను కొట్టాను కూడా

నా భార్య అలా పిచ్చిపిచ్చిగా మాట్లాడడంతో నేను చాలా సార్లు తనను కొట్టాను కూడా. అయినా నా భార్య అసలు వినడం లేదు. బహిష్టు సమయంలో సెక్స్ లో పాల్గొనాలని తెగ ఆరాటపడుతుంది.

సెక్స్ మంచిదికాదు

సెక్స్ మంచిదికాదు

నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పీరియడ్స్ టైమ్ లో సెక్స్ లో పాల్గొనడం మంచిదికాదని నేను విన్నాను. చాలా మంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు. కానీ నా భార్య మాత్రం ఎందుకిలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తుందో తెలియడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.

గర్భం వచ్చే అవకాశాలుంటాయా?

గర్భం వచ్చే అవకాశాలుంటాయా?

బహిష్టు సమయంలో సెక్స్ లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా? అలాగే పీరియడ్స్ సమయంలో మహిళలు చాలా పనులు చేయకూడదని నేను విన్నాను. ఇలాంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. వాటికి సమాధానాలు ఇవ్వండి.

మనస్సు ప్రశాంతంగా ఉండదు

మనస్సు ప్రశాంతంగా ఉండదు

సమాధానం : ప్రతి నెల 4-5 రోజుల పాటు పీరియడ్స్ కారణంగా మహిళలు చాలా ఇబ్బందులుపడుతుంటారు. దీంతో వారు ఏ పని చెయ్యలేరు. మనస్సు ప్రశాంతంగా ఉండదు. పీరియడ్స్ సమస్య మహిళలను చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అయితే నెలసరిలో ఒక్కో మహిళలో ఒక్కో విధమైన కోరిక ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. మరికొందరు సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటారు.

ఆసక్తి చూపరు

ఆసక్తి చూపరు

సాధారణంగా పీరియడ్స్ (మెన్సస్) సమయంలో స్త్రీలకు కడుపునొప్పి ఎక్కువగా ఉంటుంది. వారి శరీరం నుంచి ఎక్కువ రక్తస్రావం కావడం వల్ల ఇలాంటి నొప్పులు వస్తాయి. అందుకే ఆ మూడు రోజుల పాటు వారు సెక్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపరు.

చాలా తక్కువ మంది సెక్స్ కోరుకుంటారు

చాలా తక్కువ మంది సెక్స్ కోరుకుంటారు

కానీ కొందరు స్త్రీలలో పీరియడ్స్ సమయంలో సెక్స్ హార్మన్లు చురుగ్గా పని చేస్తాయి. ఆ కారణంగా కొందరు మహిళల్లో ఆ సమయంలో కోర్కెలు ఎక్కువగా కలుగుతాయి. అయితే చాలా తక్కువ మంది స్త్రీలు మాత్రమే పీరియడ్స్ సమయంలో సెక్స్ కోరుకుంటారు.

భయపడాల్సిన అవసరం లేదు

భయపడాల్సిన అవసరం లేదు

మీ భార్య విషయంలో కూడా అదే జరుగుతోంది. అయితే మీరు ఆమె కోరికను తిరస్కరించడాన్ని తప్పుపట్టలేం. బహిష్టు సమయంలో సంభోగిస్తే పురుషులకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో భయపడాల్సిన అవసరం లేదు.

పెద్దగా నష్టం ఏమీ కలగదు

పెద్దగా నష్టం ఏమీ కలగదు

అయితే, పీరియడ్స్‌లో సెక్స్ చేయకూడదన్న నియమనిబంధనేదీ లేదు. బహిష్టు సమయంలో సెక్స్ లో పాల్గొంటే పెద్దగా నష్టం ఏమీ కలగదు. అందువల్ల మీరు నిర్భయంగా సెక్స్‌లో పాల్గొని భార్యను సంతృప్తి పరచవచ్చు.

కండోమ్ ధరించి సెక్స్

కండోమ్ ధరించి సెక్స్

పీరియడ్స్ సమయంలో మీ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉండాలి. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే మీరు కండోమ్ ధరించి సెక్స్ లో పాల్గొనవచ్చు. ఈ విషయంపై మీ భార్యతో ప్రశాంతంగా మాట్లాడండి. సాధారణంగా పీరియడ్స్ సమయంలో మహిళలు దూరంగా ఉండాలని కోరుకుంటారు.

కోరికను తీర్చండి

కోరికను తీర్చండి

ఆమె నిరభ్యంతరంగా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటాను అని చెబుతుంది కాబట్టి మీరు పీరియడ్స్ టైమ్ లో కూడా ఆమెతో సెక్స్ లో పాల్గొనడానికి ప్రయత్నించండి. ఆమె కోరికను తీర్చండి.

పీరియడ్స్ రావాల్సిన అవసరం ఉంది

పీరియడ్స్ రావాల్సిన అవసరం ఉంది

అలాగే పీరియడ్స్ అనేవి ప్రతి మహిళకు నెలనెలా వస్తుంటాయి. ఇది అత్యంత సహజం. అది తప్పు కాదు. పాపం కాదు. ఈ సృష్టి ముందుకు నడవడానికి వాళ్లకు పీరియడ్స్ రావాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి పీరియడ్స్ పై చాలా మంది చాలా అనుమానాలుంటాయి.

పులుపు వద్దంటారు

పులుపు వద్దంటారు

పీరియడ్స్ సమయంలో ఆడవారు పులుపు తినకూడదని అంటారు.

పీరియడ్స్ సమయంలో, పులుపు తినడం నొప్పిని పెంచుతుందని, అందరూ అనుకుంటారు. కానీ దీన్ని శాస్త్రీయంగా నిర్ధారించలేదు.

కొంప మునిగిపోదు

కొంప మునిగిపోదు

ఇక పీరియడ్స్ సమయంలో ఆడవాళ్ళను తాకకూడదని అంటారు. ఇలాంటి విషయాలు అసలు పట్టించుకోకండి. పీరియడ్స్ సమయంలో రక్తం రావడం సహజం. వారు దాని కోసం ఎలానో సానిటరీ పాడ్స్ వాడుతారు. అంతేకాని పీరియడ్స్ సమయంలో వారి శరీరం మొత్తం ఏదో జరిగిపోదు. తాకినంత మాత్రాన కొంపేమీమునిగిపోదు.

రక్తం పోతుందనుకుంటారు

రక్తం పోతుందనుకుంటారు

పీరియడ్స్ సమయంలో వేడి నీరు ఎక్కవగా తాగితే రక్తం ఎక్కువగా పోతుంది అని చాలా మంది ఆడవారు అనుకుంటారు. కానీ వేడి నీరు రక్త ప్రసరణ బాగా జరుగుతంది. అంతే కానీ రక్తం ఎక్కువగా పోదు. ఎలాంటి ఇబ్బందులుండవు.

ట్యంపూన్స్

ట్యంపూన్స్

ఇక ఆడవారు పీరియడ్స్ సమయంలో వాడే ట్యంపూన్స్ లోపలి వెళ్ళిపోతాయేమోనని చాలా మంది బయపడుతారు. అలా ఎట్టి పరిస్థితిలో జరగదు. భయపడకుండా ట్యంపూన్స్ వాడండి.

కన్యత్వం పోతుంది

కన్యత్వం పోతుంది

ట్యంపూన్స్ వాడితే కన్యత్వం పోతుందని అనుకుంటారు. సాధారణంగా అందరూ మొదటి సారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు, కన్నెపొర తొలిగిపోతుందని అనుకుంటారు. దాని వల్ల కన్యత్వం పోతుందని అనుకుంటారు.

కన్యత్వం కోల్పోయినట్టు కాదు

కన్యత్వం కోల్పోయినట్టు కాదు

కానీ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే కన్నె పొర కేవలం సెక్స్ లో పాల్గొన్నప్పుడు మాత్రమే తొలిగిపోదు. మీరు ఏదైనా ఆటలాడుతూ లేదా సైకిల్ తొక్కుతూ పడిపోయినప్పుడు కూడా కన్నెపొర పోతుంది. అంతమాత్రాన కన్యత్వం కోల్పోయినట్టు కాదు. ఇవన్నీ పట్టించుకోకుండా పీరియడ్స్ సమయంలో ట్యంపూన్స్ ఉపయోగించొచ్చు.

పచ్చడి చెడిపోతుందట

పచ్చడి చెడిపోతుందట

పీరియడ్స్ సమయంలో పచ్చడిని ముట్టుకుంటే చెడిపోతుందని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కూడా నిజం కాదు.

ఆడవారు పీరియడ్స్ సమయంలో పచ్చడిని తాకగానే వారి యోనిలో ఉండే మలినం పచ్చడితో కలిసి పోదు కదా. దీనికి కూడా ఎలాంటి శాస్త్రీయ నిర్దారణ ఏమిటి లేదు. కానీ మన జనాలంతా దీన్ని పాటిస్తున్నారు. కాబట్టి మనం ఏమీ చెయ్యలేం.

ఆలయానికి వెళ్లకూడదట

ఆలయానికి వెళ్లకూడదట

పీరియడ్స్ సమయంలో ఆలయానికి వెళ్లకూడదని కూడా చెబుతూ ఉంటారు. దీన్ని ఎన్నో ఏళ్లుగా మన దేశంలో ఆచరిస్తున్నారు.సర్వజగతిని సృష్టించిన దేవుడిని మనుషులు ఎలా మలినం చేస్తారు. ఇది ఆడవాళ్ళను కించపరచడమే. దీనికి వ్యతిరేకాకంగా చాలా చోట్ల ఉద్యమాలు చేస్తున్నారు. అయితే ఇది కూడా ఆచారంగా వస్తుంది కాబట్టి దీనికి కూడా ఎవరూ ఏమీ చెయ్యలేరు.

తిమ్మిర్లకు ఉపశమనం

తిమ్మిర్లకు ఉపశమనం

పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనడం వలన దంపతులకు ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ విషయం పలు పరిశోధనల్లోనూ వెల్లడైంది. అలాగే ఈ సమయంలో మహిళలకుయోని భాగంలో తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి. శృంగారం వలన ఈ తిమ్మిర్ల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.

నొప్పులు ఉండవు

నొప్పులు ఉండవు

కొందరు ఆడవారు పీరియడ్స్ సమయంలో సెక్స్ లో ఇష్టంగా పాల్గొనడం వలన పీరియడ్స్ నొప్పులు తగ్గుతాయని భావిస్తారు. కొందరికి తగ్గుతాయి కూడా. వారికి ఆ సమయంలో సెక్స్ వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది.

ప్రెగ్నెన్సీ

ప్రెగ్నెన్సీ

పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొంటే ప్రెగ్నెన్సీ త్వరగా వస్తుందా అని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే ఆ సమయంలో గర్భాశయం భాగం కాస్త తెరుచుకుంటుంది. పీరియడ్స్ అప్పుడు అండోత్సర్గము దగ్గరగా ఉండటం వలన మగవారి నుంచి విడుదలయిన వీర్యకణాలు వారం రోజుల పాటు జీవించి ఉంటాయి కాబట్టి గర్భం దాల్చడానికి కూడా అవకాశం ఉంటుంది.

అప్పుడు సెక్స్ లో పాల్గొంటే అవకాశం

అప్పుడు సెక్స్ లో పాల్గొంటే అవకాశం

మహిళలు బహిష్టు అయిన 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదల అవుతుంది. అప్పుడు అండం విడుదల కావడం వీర్యకణాలు దానితో ఫలదీకరణ చెందడం ద్వారా ఎక్కువగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది.

చాలా ఇష్టం

చాలా ఇష్టం

పీరియడ్స్ సమయంలో సెక్స్ అంటే కొందరి మహిళలకు బాగా ఇష్టం. కొందరు ఆడవారు ఆ సమయంలో సెక్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. పీరియడ్ సమయంలో సెక్స్‌కు, సాధారణ రోజుల్లో సెక్స్‌కు చాలా తేడా ఉంటుందని కొందరు మహిళల అభిప్రాయం. మీ భార్యతో మీరు నిరభ్యంతరంగా పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొని ఆమెను కోరికను తీర్చడానికి ప్రయత్నించండి.

English summary

can unprotected sex during periods cause pregnancy?

can unprotected sex during periods cause pregnancy?
Story first published: Friday, April 13, 2018, 11:30 [IST]