Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
సంతోషకరమైన జంటలు ఎట్టి పరిస్థితుల్లోనైనా దూరంగా ఉండాల్సిన అలవాట్లు
సంతోషకరమైన జంటలు ఎట్టి పరిస్థితుల్లోనైనా దూరంగా ఉండాల్సిన అలవాట్లు
ఏ ఆనందకరమైన బంధమైనా ఒక వరంలాంటింది, అందుకని దాని కోసం మీరు మీ శ్రద్ధగా సమయాన్ని వెచ్చించి పెంచుకోవాలి.
సంతోషకర జంటలు తమ బంధం వికసించేలా అనుక్షణం ధ్యాస పెట్టాలి. వారి మధ్య అనుబంధం ప్రతిరోజూ సంరక్షిస్తూ ఉండాలి. అలా ఉండటమే కలిసివున్నప్పుడు చెడు అలవాట్లను దూరంగా ఉంచవచ్చు.

ఈ అలవాట్లు చిన్నవిగా ఊరికే అన్పించినా, జంటలకి ఇవి హానికరంగా మారవచ్చు.
ఒకరినొకరు గౌరవించుకోండి, ఎలా వుంటే అలా స్వీకరించండి, ఎప్పుడూ కొన్ని బేధాలు ఉంటాయని అర్థం చేసుకోండి.
ఒకరు ఇంకొకరిని వారిలా స్వీకరించకుండా, ఎప్పుడూ వారిని మార్చాలని ప్రయత్నిస్తుంటే, దాని అర్థం వారు ప్రేమించట్లేదని లేదా వారు ఒకరికొకరు సరికాదని అర్థం.

ఇద్దరూ కలిసి సమయం గడపకపోవటం
రోజువారీ ఒత్తిడి,బాధ్యతలు, పనులే కాకుండా ఇద్దరికీ కామన్ గా ఏదన్నా ఉండటం చాలా మంచిది. సంతోషకరమైన జంటలు ఈ స్పేస్ వెతుక్కుంటూ తమ మధ్య ప్రేమక్షణాలను కలిసి గడిపి ఆనందిస్తారు.
సమయం లేదా ప్రేమ లేకపోతే బంధం కష్టంగా మారి, వారి మధ్య దూరం పెరుగుతుంది.

డిఫెన్సివ్ గా ఉండటం లేదా విమర్శించడం
ఎప్పుడూ డిఫెన్సివ్ గా మాట్లాడటం, మనస్సులో ఏది వస్తే అది అనేయటం, విమర్శించటం, ఎప్పుడూ మీ అభిప్రాయాలను అవసరం లేకపోయినా చెప్తుండటం,ఇవన్నీ చికాకుగా ఉంటాయి. మనందరిలో లోపాలుంటాయి. అనుక్షణం విమర్శించడం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. దీనివలన ఇద్దరూ దూరంగా వెళ్ళిపోవటం లేదా బంధాన్ని వదిలించుకోవాలని చూడటం జరుగుతాయి.

రొటీన్
రొటీన్ ను వదిలించుకోవడం చాలా కష్టం. అయినా జీవితం అనుక్షణం సాగే సాహసయాత్ర కాదు కదా. అన్ని జీవితాలలో ఇది తప్పక ఎదురవుతుంది. జంటగా మీరు చేయకూడనిది ఏంటంటే ఈ రొటీన్ మీ బంధాన్ని మొనాటనీలోకి తోయకుండా చూసుకోవటం.

అబద్ధాలు, మోసం
ప్రపంచంలో అబద్ధాలు చెప్పి ,తమ బంధాలని విషపూరితం చేసుకునేవారు కూడా ఉంటారు. ఇలాంటివారివలన మనుషుల మధ్య నమ్మకం నాశనమైపోతుంది. అక్రమ బంధాలు,మోసం ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేసేయగలదు. ఈ అనుభవాల వలన తర్వాతి జీవితంలో ఎవరినీ సులభంగా నమ్మలేరు కూడా.

అహంభావం
సంతోషంగా ఉండే జంటలు తమ రోజువారీ జీవితాలని,భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాలను కలిసి తీసుకుంటారు.
అవతలవారి గురించి పట్టించుకోకుండా, వారి ఆశయాలను,కలలను మర్చిపోయి కేవలం సొంతగా నిర్ణయాలు తీసుకుంటే, వారి బంధం ఎక్కువకాలం నిలబడదు.

సమస్యలని పట్టించుకోకపోవడం
అన్ని బంధాలు ఒకేలా ఉండవు. ఏదీ ఫర్ఫెక్ట్ గా ఉండదు. ఒకదానిపై అంగీకరించకపోవటం, నిరాశలు, నిస్పృహలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అన్నిటికన్నా దారుణమైన విషయాలు ఒక బంధంలో ఉన్నప్పుడు సమస్యలను గుర్తించకపోవటం, మౌనంగా ఉండటం, ఏమీ చేయకపోవటం, సమస్యను పరిష్కరించలేకపోవటం.
ఈ కమ్యూనికేషన్ లేకపోవటం సమస్యలను తగ్గించదు. నిజానికి సమస్యలను మరింత పెంచి, మరిన్ని అపార్థాలకి దారితీస్తుంది.
ఒక స్థిరమైన, పరిణితి చెందిన జంట తమ మధ్య నిజాయితీ ఉండే కమ్యూనికేషన్ నిలుపుకుని సమస్యను కలిసి పరిష్కరించటానికి ఏం చేయాలన్నా అది చేస్తారు.

సెక్స్ లేకపోవటం
దీర్ఘకాలం పాటు ఒక బంధం కలిసి కొనసాగాలంటే వారి మధ్య ఇంటిమసీ చాలా ముఖ్యం. దాని అర్థం వారి లైంగిక బంధం కూడా సంతృప్తికరంగా ఉండాలి.
సెక్స్ బంధాన్ని బలపరుస్తుంది, కానీ తరచుగా జంటలు తమ రోజువారీ అలసట జీవితంతో దాన్ని పక్కనబెడుతుంటారు.
ఏళ్లతో పాటుగా, సెక్స్ బంధం కూడా మారుతుంటుంది. కానీ ఒక బంధానికి పునాదిగా నిలబడటానికి,అది బ్రతికి వుండటానికి ఆ క్షణాలను ఇద్దరూ కలిసి పంచుకోవటం ప్రాథమిక విషయం.

ముగింపు
ఏ బంధమైనా ఎప్పుడూ సంక్లిష్టమైనదే, అలాగే అనుక్షణం దానిపై శ్రద్ధ అవసరం. కానీ ఈ అలవాట్లను మీరు మార్చుకుంటే, కష్టాన్ని, అపార్థాలని మీరు తొలగించుకుని,నివారించుకుని ఆరోగ్యకరమైన,సంతోషమైన బంధాన్ని నిలబెట్టుకుంటారు.



Click it and Unblock the Notifications
