నా భర్త నాతో కాపురం చెయ్యడు.. అయినా పిల్లలు ఎలా పుడతారు? - My Story #96

Written By:
Subscribe to Boldsky

నాది పెద్దలు కుదిర్చి చేసిన వివాహం. మా ఎంగేజ్ మెంట్ జరిగిన తర్వాత మా పెళ్లికి కొంత గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో మా ఆయన నాతో గంటలు తరబడి మాట్లాడేవాడు. నాపై ఇప్పుడే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు ఇక పెళ్లి అయిన తర్వాత ఎంత బాగా చూసుకుంటాడో అని నేను చాలా సంబరపడేదాన్ని.

నా పెళ్లి దగ్గరపడే కొద్దీ

నా పెళ్లి దగ్గరపడే కొద్దీ

మా పెళ్లి దగ్గరపడే కొద్దీ నాపై అతను చూపే ప్రేమ కాస్త తగ్గిందని అనిపించేది. కానీ తన సమస్యలు తనకు ఉంటాయి కదా అందుకే నన్ను పట్టించుకోవడం లేదని అనుకునేదాన్ని.

ఇంట్రెస్ట్ పోయింది

ఇంట్రెస్ట్ పోయింది

పెళ్లి అయిన తర్వాత ఇక ఆయనకు నాపై పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. పెళ్లికాకముందు హనిమూన్ కు రకరకాల ప్లాన్స్ వేసేవాడు. పెళ్లి అయిన తర్వాత అసలు హనీమూన్ గురించి టాఫిక్ కూడా ఎత్తలేదు.

ఫస్ట్ నైట్ రోజు ఏమి చెయ్యలేదు

ఫస్ట్ నైట్ రోజు ఏమి చెయ్యలేదు

మా ఫస్ట్ నైట్ కూడా ఏదో మొక్కుబడిగా సాగింది. ఆయన నన్ను ఆ రోజు ఏమి చెయ్యలేదు. నన్ను ప్రేమగా పలకరించేవాడు కాదు. నన్ను ఎందుకు చేసుకున్నాన అన్నట్లుగా వ్యవహరించేవాడు.

పెళ్లి అయిన ఏడాది తర్వాత

పెళ్లి అయిన ఏడాది తర్వాత

మాకు పెళ్లి అయిన ఏడాది తర్వాత పాప పుట్టింది. ఇక పాప పుట్టిన కొన్ని రోజుల తర్వాత నాపై ఆయనకు పూర్తిగా ప్రేమ తగ్గింది.

పాపపై అస్సలు ఇష్టం లేదు

పాపపై అస్సలు ఇష్టం లేదు

ఇక పాపపై ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. తనను అస్సలు ఎత్తుకోడు. ప్రేమగా ముద్దాడడు. ఇంత కఠినంగా ఉండే తండ్రి ఎవరూ ఉండరేమో.

అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

మా ఆయనకు మరో ఆమెతో అక్రమ సంబంధం ఉందని నాకు అనిపించేది. కొన్ని రోజుల తర్వాత ఆయనకు నిజంగానే మరో అమ్మాయితో శారీరక సంబంధం ఉందని నాకు తెలిసింది.

ఇంటికొచ్చేసరికి

ఇంటికొచ్చేసరికి

ఒక రోజు నేను మార్కెట్ కు వెళ్లాను. కొద్ది సేపటికి ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చే సమయానికల్లా మా ఆయన ఫోన్లో చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు.

జీవితాంతం బాగా చూసుకుంటాను

జీవితాంతం బాగా చూసుకుంటాను

" నువ్వంటే నాకు చాలా ప్రేమ. నిన్ను జీవితాంతం బాగా చూసుకుంటాను అంటూ మా ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆయన ఫోన్ లో మాట్లాడుతున్న మాటలు విని నాకు చాలా బాధేసింది. "

అందమైన పెళ్లాన్ని ఉండగా

అందమైన పెళ్లాన్ని ఉండగా

ఇంట్లో ఇంత అందమైన పెళ్లాన్ని ఉండగా.. పైగా అతన్ని ఎంతో ప్రేమించే భార్యని నేను. నన్ను బాగా చూసుకోకుండా వేరే అమ్మాయితో అలా ఆయన మాట్లాడుతుంటే నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు.

నిలదీయలేదు

నిలదీయలేదు

నాకు అతని విషయం గురించి మొత్తం తెలిసినా నేను ఏ రోజు మా ఆయన్ని నిలదీయలేదు. మాకు పాప పుట్టినప్పటి నుంచి ఆయన రాత్రి పూట నాతో కలిసేవాడు కాదు. నన్ను చాలా దూరంగా పెట్టేవాడు.

సెక్స్ అనేదే లేదు

సెక్స్ అనేదే లేదు

పాప పుట్టి మూడేళ్లు దాటింది. అంత వరకు మా ఇద్దరి మధ్య సెక్స్ అనేది లేదు. అస్సలు నన్ను టచ్ చేసేవాడు కాదు మా అత్తమామనేమో మళ్లీ ఒక పాపనో, బాబునో మాకు పుడితే చూడాలని ఆశతో ఉన్నారు.

టచ్ కూడా చెయ్యడు

టచ్ కూడా చెయ్యడు

కానీ వాళ్లకు నా సమస్య గురించి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చాలా రోజులుగా నన్ను మా ఆయన రాత్రి పూట అస్సలు టచ్ కూడా చెయ్యడం లేదు. అయినా నేను ఆయనతోనే కలిసి ఉంటున్నా. అత్తమామల ఇంట్లోనే ఉంటున్నా.

ఆమెతో రోజూ గడుపుతాడు

ఆమెతో రోజూ గడుపుతాడు

మా ఆయన నాకన్నా తాను ఇష్టపడే ఇంకో అమ్మాయితోనే రోజూ గడుపుతూ ఉంటాడు. రాత్రి ఒంటిగంటకో, రెండు గంటలకో ఇంటికి వస్తాడు. నేను అప్పటికే పడుకుని ఉంటాడు. మళ్లీ తెల్లవారుజామున నేనే లేవకముందే వెళ్లిపోతాడు.

ఇలా కాపురం చేస్తే ఎలా?

ఇలా కాపురం చేస్తే ఎలా?

ఇలా నన్ను టచ్ చెయ్యకుండా.. నాపై కాస్త కూడా ప్రేమ చూపకుండా కాపురం చేస్తే మా అత్తమామల కల నెరవేరేది ఎలా? నన్ను మా ఆయన మానసికంగా చాలా టార్చర్ చేస్తున్నాడు.

భరించే ఓపిక లేదు

భరించే ఓపిక లేదు

నాతో తను చాలా రోజులుగా శారీరకంగా కలవడం లేదనే విషయాన్ని బయటపెడితే నలుగురిలో చిన్నచూపు కావడం తప్పా ఇంకేమి ప్రయోజనం ఉండదని నేను బయటికి చెప్పుకోలేకపోతున్నాను. ఇన్నాళ్లు భరించాను. ఇక భరించే ఓపిక నాకు లేదు.

English summary

he was never in love with me and never would be

he was never in love with me and never would be
Story first published: Saturday, February 24, 2018, 11:30 [IST]