నెల తిరగక ముందే.. పెళ్లాం నెల తప్పాలంటే ఏం చెయ్యాలి?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నాకు పెళ్లి అయి ఏడాది అవుతుంది. మా బంధువులంతా పెళ్లి అయ్యి ఏడాది అవుతుంది. మరి గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతావు అంటూ నన్ను అడుగుతున్నారు. ఏ ఫంక్షన్ కు వెళ్లినా కూడా నన్ను ఈ ప్రశ్నతో వేధిస్తున్నాను. నేను నా భార్యతో రోజూ సెక్స్ లో పాల్గొంటాను. అయినా కూడా ఎందుకు నా భార్యను గర్భిణీగా చెయ్యలేకపోతున్నానో నాకు అర్థం కావడం లేదు.

భార్య గర్భిణీ కావాలని

భార్య గర్భిణీ కావాలని

సమాధానం : పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్కరూ చాలా త్వరగా తన భార్య గర్భిణీ కావాలని కోరుకుంటారు. తన భార్య త్వరగా గర్భిణీ కావాలని వేయికళ్లతో ఎదురు చూసే వారు చాలా మంది ఉంటారు.

మూడుసార్లు సెక్స్ లో పాల్గొని

మూడుసార్లు సెక్స్ లో పాల్గొని

ఓ మూడుసార్లు సెక్స్ లో పాల్గొని వెంటనే ఇక తన భార్య నెల తప్పాలని కోరుకునే మగవారు చాలా మంది ఉంటారు. భార్య నెల తప్పితే భర్త ఆనందమే వేరు కదా. అందుకే తన భార్య ఎప్పుడు నెల తప్పుతుందా అని ఎదురు చూస్తుంటాడు ప్రతి మగాడు.

ఈ సారైనా వర్క్ అవుట్ అవుతుందా?

ఈ సారైనా వర్క్ అవుట్ అవుతుందా?

అలాగే అమ్మాయి కూడా శోభనం రోజు మొదలుకుని సెక్స్ లో పాల్గొనే ప్రతి సారి ఈ సారైనా వర్క్ అవుట్ అవుతుందా లేదా అని పరితపిస్తుంటుంది. ఎందుకంటే తల్లి కావడం అనేది మహిళలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం.

సంవత్సరాలు తరబడి సెక్స్ లో పాల్గొన్నా

సంవత్సరాలు తరబడి సెక్స్ లో పాల్గొన్నా

స్త్రీలకు గర్భదారణ అనేది మాతృత్వానికి చిహ్నం. స్త్రీ, పురుషులిద్దరూ శారీరకంగా కలవడంతో స్త్రీకి గర్భాదారణ జరుగుతుంది. అయితే భార్యాభర్తలు సెక్స్ లో పాల్గొన్న వెంటనే గర్భం రాకపోవొచ్చు. కొందరు సంవత్సరాలు తరబడి సెక్స్ లో పాల్గొంటున్న కూడా గర్భం రాకపోవొచ్చు. ఇందుకు చాలా కారణాలుంటాయి.

భార్యాభర్తలకు అవగాహన అవసరం

భార్యాభర్తలకు అవగాహన అవసరం

స్త్రీకి గర్భం రావాలంటే ఏం చేయాలనే విషయాలపై భార్యాభర్తలకు అవగాహన ఉండాలి. ఎప్పుడు సెక్స్ లో పాల్గొంటే స్త్రీకి గర్భం వస్తుందనే విషయం కూడా తెలుసుకోవాలి. సాధారణంగా స్త్రీ రుతుస్రావం పూర్తయిన తర్వాత 12 నుంచి 16 రోజుల లోపు అండం విడుదల అవుతుంది.

అలా చేస్తే స్త్రీ గర్భిణీ అయ్యే అవకాశం

అలా చేస్తే స్త్రీ గర్భిణీ అయ్యే అవకాశం

ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ శృంగారంలో పాల్గొనాలి. అలా చేస్తే స్త్రీ గర్భిణీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో శృంగారంలో పాల్గొంటే మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలు, మహిళలలో విడుదలయ్యే అండంతో కలసి ఫలదీకరణం చెందుతాయి.

రుతుస్రావం పూర్తయిన తర్వాత

రుతుస్రావం పూర్తయిన తర్వాత

ఫలదీకరణం పూర్తయ్యాక పిండం ఏర్పడుతుంది. అలా అమ్మాయికి అమ్మ అయ్యే భాగ్యం కలుగుతుంది. అయితే అందరు స్త్రీలలో రుతుస్రావం పూర్తయిన తర్వాత 12 నుంచి 16 రోజుల లోపే అండం విడుదల అవ్వాలనే రూల్ ఏమీ లేదు.

భర్తతో సెక్స్ లో పాల్గొంటే

భర్తతో సెక్స్ లో పాల్గొంటే

కొందరు మహిళలకు పీరియడ్స్ పూర్తి అయిన 8 నుంచి 10 రోజుల లోపు అండం విడుదలవుతుంది. ఆ సమయంలో భర్తతో సెక్స్ లో పాల్గొంటే గర్భదారణ జరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇది చాలా తక్కువ మంది స్త్రీలలో జరుగుతుంది.

కొన్ని రకాల భంగిమల్లో సెక్స్

కొన్ని రకాల భంగిమల్లో సెక్స్

అయితే స్త్రీ గర్భం దాల్చాలంటే శృంగారం భంగిమలు కూడా చాలా తోడ్పడుతాయి. కొన్ని రకాల భంగిమల్లో సెక్స్ లో పాల్గొంటే గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకానీ శృంగారంలో రోజూ పాల్గొనడం వల్లే గర్భం రాదు.

అండం విడుదలయ్యే సమయంలో

అండం విడుదలయ్యే సమయంలో

వీర్యకణాలు ఎక్కువ సమయం స్త్రీ యోనిలో ఉంటే గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మహిళలకు అండం విడుదలయ్యే సమయంలో ఆ వీర్య కణాలు యోని మార్గంలో రెడీగా ఉండాలి. మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదలవుతుంది. అదే మగవారిలో వేలసంఖ్యలో ఒకసారి శుక్రకణాలు విడుదలవుతాయి.

7 నుంచి 12 గంటలు మాత్రమే

7 నుంచి 12 గంటలు మాత్రమే

మామూలుగా మగవారి వీర్యంలో ఉండే శుక్రకణాలు అయిదు రోజుల వరకు చురుగ్గా ఉంటాయి. అదే మహిళల నుంచి విడుదలయిన అండం 7 నుంచి 12 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో శుక్రకణంతో అండం ఫలదీకరణం చెందినట్లయితే స్త్రీకి గర్భం వస్తుంది.

10 గంటల్లోపు పిండం

10 గంటల్లోపు పిండం

అండంతో శుక్రకణం ఫలదీకరణం చెందిన తరువాత 10 గంటల్లోపు పిండం ఏర్పడుతుంది. ఇక చాలామందిలో గర్భం రావడానికి శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలనే అనుమానం కూడా ఉంటుంది.

అండం విడుదలకు ముందు రోజు

అండం విడుదలకు ముందు రోజు

మహిళల్లో అండం విడుదలకు నాలుగు లేక అయిదు రోజులు ముందు కాని, అండం విడుదలకు ముందు రోజు సంభోగం చేయడం వల్ల గర్భాన్ని పొందవచ్చు. మహిళలకు అండం ఎప్పుడు విడుదలవుతుందో వారికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఆ రోజు భర్తతో సెక్స్ చేస్తే చాలు. దాదాపు గర్భం దాల్చవచ్చు.

అలా సెక్స్ చేస్తేనే

అలా సెక్స్ చేస్తేనే

అయితే ఎలా అంటే సెక్స్ చేయకూడదు. స్త్రీ జననేంద్రియం లోపలికి పురుషుడి వీర్యకణాలు చొచ్చుకుపోయే శృంగార భంగిమల్లో సెక్స్ చేస్తేనే ఈజీగా స్త్రీ గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది.

సరైన భంగిమలో సెక్స్ లో పాల్గొనాలి

సరైన భంగిమలో సెక్స్ లో పాల్గొనాలి

త్వరగా గర్భం రావాలంటే సెక్స్ లో ఎలా అంటే పాల్గొనకూడదు. సరైన భంగిమలో సెక్స్ లో పాల్గొంటేనే స్త్రీకి త్వరగా గర్భం వస్తుంది. వీర్యం యోనిలోపలికి వెళ్లి గర్భం రావాలంటే కరెక్ట్ భంగిమలో సెక్స్ చేయాలి. అమ్మాయిపై అబ్బాయి పడుకుని సెక్స్ చేయాలి. సెక్స్ చేసేటప్పుడు అమ్మాయి నడుము కింద భాగంలో దిండు పెట్టాలి.

కరెక్ట్ గా యోనిలోపలికి

కరెక్ట్ గా యోనిలోపలికి

ఇలాంటి భంగిమ వల్ల పురుషాంగం నుంచి విడుదలయ్యే శుక్రకణాలు పక్కకు పోకుండా కరెక్ట్ గా యోనిలోపలికి వెళ్తాయి. సెక్స్ అయిపోయాక కూడా పురుషాంగాన్ని యోని నుంచి తీయకుండా అలాగే ఉంచాలి. శుక్రకణాలు యోనిలో ప్రవేశించే వరకు అమ్మాయి నడుము సెక్స్ అయిపోయాక 10 నుంచి 15 నిమిషాల వరకు దిండుపైనే ఉంచాలి.

స్త్రీ యోని ద్వారా ప్రవేశించవు

స్త్రీ యోని ద్వారా ప్రవేశించవు

ఇక స్త్రీ తన భాగస్వామి పైన ఉండి రతి జరపటం వలన పురుషాంగం నుంచి విడుదలయ్యే శుక్రకణాలు స్త్రీ యోని ద్వారా ప్రవేశించవు. దీని వల్ల గర్భం రాదు. అందువల్ల పిల్లలు కావాలనుకుంటే ఈ భంగిమలో సెక్స్ లో పాల్గొనకండి.

లుబ్రికేంట్స్ వాడకండి

లుబ్రికేంట్స్ వాడకండి

అలాగే గర్భాన్ని ధరించాలి అనుకుంటే సేన్టేడ్ టాంపోస్, వెజైనల్ స్ప్రే, కృత్రిమ లుబ్రికేంట్స్ లను వాడకండి. వీటి వాడకం వలన గర్భాశయ కండరాలు ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి.

శ్లేష్మం శుభ్రంగా ఉంటే

శ్లేష్మం శుభ్రంగా ఉంటే

స్త్రీ అండం ఫలదీకరణ సిద్దంగా ఉన్న సమయంలో గర్భాశయ శ్లేష్మ ఉత్పత్తి అధికమవుతుంది. శ్లేష్మం శుభ్రంగా మందంగా ఉంటే స్త్రీ అండం ఫలదీకరణకు సిద్దంగా ఉందని అర్థం.

ఒత్తిడిని జయించే పద్దతులు

ఒత్తిడిని జయించే పద్దతులు

గర్భం ధరించాలి అనుకునే వారిలో దంపతులిద్దరూ ఒత్తిడిని అధిగమించాలి. ఒత్తిడి వలన స్త్రీ, పురుషుల శరీర హార్మోన్లలో వ్యత్యాసాలు కలుగుతాయి. ఫలితంగా, గర్భధారణలో సమస్యలు కలుగుతాయి. కావున ఒత్తిడిని జయించే పద్దతులను అనుసరించాలి.

బీ - విటమిన్

బీ - విటమిన్

స్త్రీలు ఫోలిక్ ఆసిడ్ (బీ- విటమిన్) అధికంగా తీసుకోవాలి. అలా చేస్తే గర్భాన్ని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సహజంగా, ఫోలిక్ ఆసిడ్ పాలకూర, బ్రోకలీ ఆస్పరాగస్ వంటి పచ్చని ఆకుకూరలలో పుష్కలంగా ఉంటుంది.

వైద్యుడిని కలవాలి

వైద్యుడిని కలవాలి

ఫోలిక్ ఆసిడ్ ను పుష్కలంగా కలిగి ఉండే మరొక సహజ మూలాధారంగా బీట్రూట్ ను చెప్పవచ్చు. వీటితో పాటుగా, ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను కూడా తీసుకోవటం మంచిది. కానీ, ఫోలిక్ ఆసిడ్ ఉపభాగాలను తీసుకునే ముందు వైద్యుడిని కలవటం మంచిది.

వ్యాయామం, యోగా

వ్యాయామం, యోగా

అలాగే గర్భం దాల్చాలనుకున్న మహిళ రోజూ వ్యాయామాలు, యోగా చేయాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఎక్కువగా నిద్రపోవాలి. ఎక్కువ నీరు తాగాలి. ఒత్తిడికి గురికాకూడదు. ఇవన్నీ భార్యాభర్తలు పాటిస్తే భార్య నెల తప్పడానికి ఒక్క నెల సరిపోతుంది.

9 నెలలు పది రోజులు

9 నెలలు పది రోజులు

సాధారణంగా గర్భదారణ సమయం నుంచి ప్రసవించే వరకూ 40 వారాల (9నెలల 10 రోజలు) కాలపరిమితిలో మహిళను గర్భవతి అంటారు. ఈ గర్భదశను మూడు దశలుగా విభజిస్తారు. మొదటి 12 వారాలను ఒకటోదశగానూ, 13-27 వారాలను రెండో దశగానూ, 28-40 వారాల కాలపరిమితిని మూడో దశగా పరిగణిస్తారు.

పరీక్షలు అవసరం

పరీక్షలు అవసరం

గర్భనిర్ధారణ అయిన తరువాత పరీక్షలు చేయించుకోవాలి. రక్తహీనత, మూత్రపిండాలలో ఏవైనా లోపాలుంటే ఆ ప్రభావం పిండంపై పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో గర్భస్రావం కూడా జరగవచ్చు. కాబట్టి రక్త పరీక్ష, మూత్ర పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు తీసుకోవాలి. గర్భసంరక్షణకు వైద్యులను తరచూ సంప్రదిస్తూ ఉండాలి.

English summary

how to get pregnant fast and easy

how to get pregnant fast and easy