మీ అనుబంధం విషపూరితమవుతుందని ఎలా గ్రహించాలి?

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

మీరు మీ అనుబంధంలో ఒత్తిడిని చవిచూస్తున్నారా? మీకు మీ పరిస్థితుల పట్ల మౌనాన్ని వీడి, మీ సంకెళ్ళను తెంచుకోవాలని బలంగా అనిపిస్తుందా? మీ అనుబంధంలో మీరు కోరుకున్న కనీస తృప్తి, స్వాంతన లభించట్లేదా?

మొదలుపెట్టిన కొత్తలో అనుబంధం ప్రతిఒక్కరుకి అందమైన అనుభూతిలా ఉంటుంది. ఆ అనుబంధం సరైన పంధాలో సాగుతున్నప్పుడు, మీ ఆనందానికి అంతు లేనట్టు, మీ నరనరాల్లో ఆ ఆనందం యొక్క మత్తు ప్రవహిస్తున్నట్లు ,ఒక ప్రభంజనం వలె అనిపిస్తుంది. కాని కొన్నిసార్లు సమయం గడుస్తున్నకొద్దీ ఆ మధురిమలు మాయమవుతాయి.

HOW TO KNOW YOUR RELATIONSHIP IS TOXIC? QUESTION YOU NEED TO ASK

మీ అనుబంధం విషపూరితమవుతుందని ఎలా గ్రహించాలి?

మీ అనుబంధం మీకు నాలుగు గోడల మధ్య బందీని అనే అనుభూతినిస్తుంటే ఏమి చేయాలి?

మీరు లోలోపల బాధను అనుభవిస్తూ దుఃఖానికి గురవుతున్నారా?

మీరు అనుబంధం చేదుగా మారడానికి దారితీసిన మార్గాలను అన్వేషిస్తున్నారా? మీ భాగస్వామి ప్రవర్తనను మీరు సహించలేకపోతున్నారా?

ఇటువంటి పరిస్థితులలో సరైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవలసి ఉంటుంది. ఈ ప్రశ్నలు మీకు సరైన మార్గనిర్దేశం చేసి ఒక నిర్దారణకు రావడానికి సహకరిస్తాయి. .

మీరు ఈ వ్యాసాన్నిచదవబోయేముందు మీకొక సున్నితమైన విన్నపం. ఈ వ్యాసం చదివిన తరువాత, మీరు మీ భాగస్వామితో కలిసి కూర్చుని మీ అనుబంధాన్ని తీయగా మార్చుకోవాలంటే ఏ మార్గాలు ఉన్నాయో, ఏమి చేయాలో నిజాయితితో చర్చించండి.

అయినప్పటికీ మీ అనుబంధంలో ఎటువంటి మార్పు రాకుండా, మీకు చేదును మాత్రమె రుచి చూపిస్తుంటే, ఆ బంధానికి జోలపాడి నిద్రపుచ్చాల్సిందే! ఆ బంధం ఏనాటికైనా కుప్పకూలిపోతుంది.

1. ఈ అనుబంధానికి నేను తగిన వ్యక్తినేనా?

1. ఈ అనుబంధానికి నేను తగిన వ్యక్తినేనా?

మీ భాగస్వామి మీ వ్యక్తిత్వం తనకు తగినట్టు లేదని, మీలో మార్పు ఆవశ్యకమని అనిపించేటట్లు ప్రవర్తిస్తూ, మీకు మీ సమగ్రత మరియు ధర్మాన్ని నిర్వర్తించడం పట్ల అనుమానం మొదలయ్యేట్టు చేస్తున్నారా? మీరు తనకు తగిన వారు కాకపోయినా, వారు మీతో కలిసి ఉండటం మీ అదృష్టమని పదేపదే గుర్తుచేస్తూ ఉన్నట్లయితే, అది మీ అనుబంధానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైనదని తెలియజేస్తుంది.

మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మీరెప్పుడు మీలానే ఉంటారు. మీ పట్ల ఇతరుల ప్రవర్తన, వారు మీ పట్ల ఎటువంటి భావాలు కలిగి ఉన్నారనేది తెలియజేస్తుంది. మీ ప్రేమ కనుక వారికి సరిపడకపోతే, మీరు వారికి దూరంగా జరిగిపోవడమే మంచిది.

2. ఈ అనుబంధం వలన మీకు ఎటువంటి ప్రయోజనమైనా ఉందా?

2. ఈ అనుబంధం వలన మీకు ఎటువంటి ప్రయోజనమైనా ఉందా?

ఒకవేళ మీ అనుబంధం ఎటువంటి పరస్పర ప్రయోజనం కలిగించకపోతే, ఆ అనుబంధంకై నిలబడి ఉండటం అనవసరం. ఒక ఆరోగ్యమైన అనుబంధంలో ఉన్నవారు భాగస్వామితో కలిసి వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ఎదుగుతారు.

మీ విషయంలో ఇలా జరగనట్లయితే కనుక, ఆ అనుబంధంలో మిమ్మల్ని ఇముడ్చుకోనవసరం లేదు. దానిని అలా విడిచిపెట్టేయండి. మీరు ఆ అనుబంధానికి ఏ విధంగా కూడా సంసిద్ధంగా లేరని గుర్తించండి.

౩. ఎప్పుడు బంధం నిలుపుకోవడం కొరకు నేను మాత్రమే ఎందుకు త్యాగాలు చేయాలి?

౩. ఎప్పుడు బంధం నిలుపుకోవడం కొరకు నేను మాత్రమే ఎందుకు త్యాగాలు చేయాలి?

ఈ ప్రశ్న పదేపదే మీ మనసులో మెదులుతుందా? అలా ఐతే మీ బంధం నిలుపుకోవడం కొరకు మీరు చాలా కోల్పోవలసి ఉంటుంది. మీ భవిష్యత్తు అందంగా మరియు ఆనందంగా ఉండాలనుకుంటే, ఇటువంటి పేలవమైన అనుబంధాన్ని వదులుకోండి. అనునిత్యం మీరు రాజీ పడాల్సిందే కానీ, మీ భాగస్వామి మీకు సంబంధించిన ఎటువంటి విషయంలోనూ రాజీ పడకపోయినా లేదా త్యాగానికి సిద్ధపడకపోయినా, అది మీ బంధం విషపూరితంగా మారుతుందనడానికి సంకేతం. ఎందుకంటే ఈ అనుబంధంలో ప్రేమ, అభిమానం అనే పెట్టుబడి కేవలం మీరొక్కరే పెడుతున్నారు.

4. ఈ అనుబంధంలో నేను తగినంత గౌరవం పొందుతున్నానా?

4. ఈ అనుబంధంలో నేను తగినంత గౌరవం పొందుతున్నానా?

ఇది మీకు మీరు వేసుకోవలసిన చాలా పెద్ద ప్రశ్న. మీకు తగినంత గౌరవం దక్కట్లేదని మీరు భావిస్తున్నట్లయినా లేదా అందుకు సంబంధించిన దారులన్నీ మూసుకుపోయినట్లనిపించినా, మీరు అటువంటి అనుబంధాన్ని వదులుకోవలసినదే! లేదంటే ఆ బంధం మీకు భయంకరంగా మరియు హానికరంగా పరిణమిస్తుంది.

గౌరవమనేది ప్రతిఒక్కరి కనీస అవసరం. మీ భాగస్వామి మిమ్మల్ని గౌరవించడంలో విఫలమయినట్లయితే, అటువంటి వ్యక్తితో బంధంలో మీరు మనలేరు.

English summary

HOW TO KNOW YOUR RELATIONSHIP IS TOXIC? QUESTION YOU NEED TO ASK

If you are constantly asking yourself this question, then you need to think that there is a lot at stake for you. You need to cut loose this relationship, in order help yourself have a better tomorrow. Your partner doesn't sacrifice or compromise any part of his/her life for this relationship. It is only you.
Story first published: Monday, May 7, 2018, 12:30 [IST]