For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విడాకులు పొందే సమయంలో మా ఆయనపై ప్రేమ పెరిగిపోతుంది

మా అత్తనేమో ఇక్కడి నుంచి వెళ్లడం లేదు. ఆమెను పంపిస్తే నా సంసారం మళ్లీ హ్యాపీగా ఉంటుంది. మా ఆయనతో విడాకులు తీసుకోకుండా మా అత్తను దూరంగా పెట్టి హ్యాపీగా కాపురం చేసుకోవాలని ఉంది. దయజేసి నాకు సలహా ఇవ్వండి

|

ప్రశ్న : మాకు 2017లో పెళ్లి అయ్యింది. మొదట కొన్ని రోజులు మా ఆయన నాపై బాగా ప్రేమ చూపించారు. మేము హైదరాబాద్ లో ఉంటాం. పెళ్లి అయిన కొత్తలో నేను, మా ఆయన మాత్రమే ఉండేవాళ్లం. కొన్నాళ్ల తర్వాత మా అత్త మా దగ్గరకు వచ్చింది. ఆమె వచ్చిన కొన్నాళ్లకే మా సంసారంలో అలజడులు మొదలయ్యాయి. మా అత్త ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసేది.

లేనిపోనివి కల్పించి చెప్పేది

లేనిపోనివి కల్పించి చెప్పేది

నేను తనను ఏమీ అనకున్నా కూడా మా ఆయనకు లేనిపోనివి కల్పించి చెప్పేది. ఆయన వాళ్ల అమ్మ మాటలు విని నన్ను నోటికొచ్చినట్లు తిట్టేవాడు. చాలాసార్లు కొట్టాడు కూడా. మా అత్త కావాలని మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి మేమిద్దరం గొడవపడుతుంటే సినిమా చూసినట్లు చూసేది. దీంతో ఆయనతో నేను కాపురం చెయ్యలేనని డిసైడ్ అయ్యాను. విడాకులు కావాలని కోరాను. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నాడు. మ్యూచ్ వల్ గా విడాకులకు అప్లై చేశాం. త్వరలో మా ఇద్దరికీ విడాకులు మంజూరుకానున్నాయి.

ఇప్పుడు ప్రేమ పెరిగిపోతుంది

ఇప్పుడు ప్రేమ పెరిగిపోతుంది

అయితే నాకు మా ఆయనపై ఇప్పుడు ప్రేమ పెరిగిపోతుంది. వాస్తవానికి నా భర్త చాలా మంచోడు. కేవలం మా అత్త వల్లే నా సంసారం ఇప్పుడిలా తయారైంది. మా అత్తనేమో ఇక్కడి నుంచి వెళ్లడం లేదు. ఆమెను పంపిస్తే నా సంసారం మళ్లీ హ్యాపీగా ఉంటుంది. మా ఆయనతో విడాకులు తీసుకోకుండా మా అత్తను దూరంగా పెట్టి హ్యాపీగా కాపురం చేసుకోవాలని ఉంది. దయజేసి నాకు సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

అది సరైన నిర్ణయమే

అది సరైన నిర్ణయమే

సమాధానం : మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా వేధించే హక్కు మీ అత్తవారింటి వారికి లేదు. మీరు ఆ బాధలను తట్టుకోలేకే విడాకులు తీసుకోవాలనుకున్నారు కాబట్టి అది సరైన నిర్ణయమే. అయితే మీతో పాటు మీ అత్త లేకుంటే మీ ఆయనతో సంతోషంగా ఉంటానని మీరు అనుకుంటున్నారు. ఈ విషయంలో మీరు క్లారిటీగా ఉండాలి. మీ భర్త మీ మాటలను గౌరవించి మీ అత్త మాటలను నమ్మకుండా ఉండే మీ మధ్య ఎలాంటి సమస్యలు తలెత్తకపోవొచ్చు.

మీపైనే ఆధారపడి ఉంటుంది

మీపైనే ఆధారపడి ఉంటుంది

కానీ అలా జరిగే వీలుందో లేదో మీరు మొదట ఒక క్లారీటికీ రావాలి. మీ భర్తతో మీరు హ్యాపీగా ఉంటాను అనుకుంటే విడాకులను ఇప్పుడే రద్దు చేసుకోవడం మంచిది. అయితే విడాకులు తీసుకోవాలా వద్దా అనేది మీపైనే ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది మీరే.

English summary

I am getting divorced but I still love him and don't want to lose him

I am getting divorced but I still love him and don't want to lose him
Story first published:Monday, August 27, 2018, 18:06 [IST]
Desktop Bottom Promotion