For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క నైట్ నాతో గడుపుదామని వచ్చాడు.. కానీ అతను చేసిన సాయం మాత్రం మరువలేనిది - #mystory147

ఎందరో అమ్మాయిలు వేశ్యావృత్తి వల్ల బలవంతంగా ఇరుక్కుని దేశంలో వేధనకు గురవుతూనే ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారి బతుకును బజారుకీడ్చుకోలేక నలిగి నలిగి చస్తున్నారు.

|

నాది చాలా పేద కుటుంబం. మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. మేం నలుగురం అక్కాచెల్లెళ్లం. అమ్మనే మమ్మల్ని పెంచి పోషించింది. మా అక్కా చెల్లెళ్లలో నేనే పెద్దదాన్ని. పేద కుటుంబం అయినా మా అమ్మ మమ్మల్ని బాగానే పెంచి పోషించింది.

సమాజంలో చాలా చులకన

సమాజంలో చాలా చులకన

పేదరికంలో ఉండే అమ్మాయిలంటే సమాజంలో చాలా చులకన ఉంటుంది. కానీ మేము మనుషులమే. మాకు అందరిలాగానే హుందాగా బతకాలనిపిస్తుంటుంది. డబ్బు లేని వారి దగ్గర వాస్తవానికి చాలా విలువలు ఉంటాయి.

ఎంతో గౌరవంగా బతుకుతుంటారు

ఎంతో గౌరవంగా బతుకుతుంటారు

అన్నీ ఉన్న వాళ్లు అహంకారం ప్రదర్శించొచ్చు కానీ ఏమీ లేని వారు ఎంతో గౌరవంగా బతుకుతుంటారు. నాకు, మా చెల్లెల్లకు బాగా చదువుకోవాలని ఉండేది. కానీ అమ్మ కూలీపై ఆధారపడి అందరం బాగా చదువుకోవాలంటే సాధ్యం కాదని మాకు తెలుసు.

మంచి మార్కులతో పాసయ్యాను

మంచి మార్కులతో పాసయ్యాను

అయినా మనం అనుకున్నవన్నీ జరగవు కదా. నేను పదో తరగతిలో మంచి మార్కులతో పాసయ్యాను. నన్ను మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ల ఇంటికి పంపించింది. నేను వాళ్ల వద్దే ఉంటూ చదువుకునేదాన్ని. మా అమ్మకు ఒక తమ్ముడు ఉండేవాడు. ఆయనకు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు మా అమ్మమ్మ వాళ్లు.

బంధువుల అమ్మాయితో పెళ్లి

బంధువుల అమ్మాయితో పెళ్లి

కానీ అంత చిన్న వయస్సులో నాకు పెళ్లి ఇష్టం లేదు. అందుకే చేసుకోను అని చెప్పారు. మావయ్య కూడా నన్ను బాగానే చూసుకునేవాడు. కొన్ని రోజులకు మా మావయ్యకు మా బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది.

హాస్టల్లో ఉంటూ

హాస్టల్లో ఉంటూ

మావయ్య భార్య రోజూ నన్ను ఏదో వంకతో తిట్టేది. దీంతో నేను అమ్మమ్మ వాళ్ల ఇంట్లో నుంచి బయటకు వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకునేదాన్ని. మా అమ్మ, చెల్లెల్లు పడే కష్టాలు చూసి నా చదువు మాసేసి ఏదైనా చిన్న పని చేద్దాం అని భావించాను.

నాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు

నాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు

మొదట కొన్ని షాంపింగ్ కాంప్లెక్స్ లలో పని చేశాను. తర్వాత వేరే మెట్రో నగరాల్లో మంచి జీతం ఇస్తారని ఒక సూపర్ వైజర్ చెప్పడంతో అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. నాతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు ఆ సూపర్ వైజర్ వెంట వెళ్లాం.

అన్నీ తీసుకొని ఇచ్చేవాడు

అన్నీ తీసుకొని ఇచ్చేవాడు

మమ్మల్ని అతను ఒక రూమ్ కు తీసుకెళ్లాడు. రెండు రోజులు ఇక్కడే ఉండండని చెప్పాడు. రూమ్ లో నుంచి బయటకు రాకండి అని చెప్పాడు. మాకు సమయానికి అన్నీ తీసుకొని ఇచ్చేవాడు.

రూమ్ లో ఉంచి తాళం వేసి వెళ్లేవాడు

రూమ్ లో ఉంచి తాళం వేసి వెళ్లేవాడు

మీ అందరికీ జాబ్ లు దొరికాయి. అయితే వేతనం విషయంలో నేను మాట్లాడడానికి వెళ్తున్నాను అని చెప్పి అతను మమ్మల్ని రూమ్ లో ఉంచి తాళం వేసి వెళ్లేవాడు. ఇది కొత్త ప్రాంతం, మీకు ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్పినట్లు వినండి అనే చెప్పేవాడు.

ఫుడ్, బెడ్ అన్నీ

ఫుడ్, బెడ్ అన్నీ

అతను చెప్పినట్లుగానే రెండ్రోజులు విన్నాం. రెండో రోజు సాయంత్రం ఒక కారు రూమ్ దగ్గరకు వచ్చింది. అందులో మమ్మల్ని ఎక్కించుకుని ఒక పెద్ద బంగ్లాకు తీసుకెళ్లారు. మీకు ఈ రోజు నుంచే ఇక్కడే మీరు ఉండండి. మీకు ఇక్కడే ఫుడ్, బెడ్ అన్నీ ఉంటాయన్నారు.

షాపింగ్ కాంప్లెక్స్ కు అనుకున్నాం

షాపింగ్ కాంప్లెక్స్ కు అనుకున్నాం

లోపలికి వెళితే అన్ని విషయాలు చెబుతారు అని చెప్పారు. మేము ఉండడానికి ఒక రూమ్ కూడా ఇచ్చారు. ఫ్రెషప్ కండి అని చెప్పారు. అందరం ఫ్రెష్ అప్ అయ్యాక ఇక షాపింగ్ కాంప్లెక్స్ కు తీసుకెళ్తారనుకున్నాం.

భాష తెలియకపోవొచ్చు గానీ

భాష తెలియకపోవొచ్చు గానీ

కానీ మమ్మల్ని కొందరు వ్యక్తులు వచ్చి చూసి వెళ్లి పోయారు.

కొద్ది సేపట్లోనే అక్కడ వాతావరణం మాకు అర్థం అయిపోయింది. భాష తెలియకపోవొచ్చు గానీ వారు మాట్లాడుకునే మాటలు, వారి హావాభావాలు అన్నీ అర్థం అయ్యాయి.

వేశ్యావృత్తి చేయించే వ్యక్తులకు

వేశ్యావృత్తి చేయించే వ్యక్తులకు

సూపర్ వైజర్ మమ్మల్ని వేశ్యావృత్తి చేయించే వ్యక్తులకు విక్రయిస్తున్నారని తెలుసుకున్నాం. వెంటనే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాం. కేకలు పెట్టాం. అంత వరకు గొర్రెల్లా కసాయిని నమ్మాం అని మాకు తెలియదు.

తప్పించుకుని వెళ్లాలి

తప్పించుకుని వెళ్లాలి

చివరకు సూపర్ వైజర్ అక్కడ మమ్మల్ని అమ్మేసి డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. ఒక్కసారిగా నా జీవితం మొత్తం కళ్ల ముందు తిరిగింది. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లాలి అనిపించింది. కానీ ఒక్క దారి కూడా మాకు లేదు.

కాపు కాస్తూ ఉన్నారు

కాపు కాస్తూ ఉన్నారు

మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఎలా వెళ్లాలో కూడా తెలియదు. మేముండే చోట చాలా మంది మగవారు, ఆడవారు మమ్మల్ని కాపు కాస్తూ ఉన్నారు. అయినా పారిపోవాలని చాలా బలంగా అనుకున్నాం.

కస్టమర్ దగ్గరకు పంపారు

కస్టమర్ దగ్గరకు పంపారు

మా ముగ్గురిని ఒక రూమ్ లో వేసి నానా టార్చర్ చేశారు. మేము ఒప్పుకునేంత వరకు వదల్లేదు. చివరకు మమ్మల్ని రెడీ చేశారు. నన్ను ఒక కస్టమర్ దగ్గరకు పంపారు. ఆయన రాగానే నాకు ఇది ఫస్ట్ టైమ్. కాస్త సహకరించండి అంటూ హిందీలో చెప్పాడు.

భరోసా ఇచ్చాడు

భరోసా ఇచ్చాడు

నాకు వచ్చిన హిందీలో, ఇంగ్లిష్ లో నా బాధను మొత్తం అతనితో చెప్పుకున్నా. వేశ్యావృత్తి నాకు ఇష్టం లేదని చెప్పాను. వ్యభిచార వృత్తి నుంచి బయటపడేయండి అంటూ కాళ్లు పట్టుకున్నా. మొక్కాను. మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లే బాధ్యత నాది అని అతను భరోసా ఇచ్చాడు. తర్వాత రూమ్ నుంచి బయటకు వెళ్లాడు.

నన్ను బుక్ చేసుకున్నాడు

నన్ను బుక్ చేసుకున్నాడు

ఆ రోజు మాకు హెల్త్ బాగోలేదని, రేపటి నుంచి డ్యూటీ చేస్తామని అక్కడి వారిని నమ్మించాం. మరుసటి రోజు సాయంత్రం అతను తన ఫ్రెండ్స్ తో సహా బంగ్లాకు వచ్చాడు. ముందుగా అనుకున్న ప్రకారమే మళ్లీ నన్ను బుక్ చేసుకున్నాడు.

అతను దేవుడు

అతను దేవుడు

పక్కా ప్లాన్ వేసి మా ముగ్గురిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చాడు. తర్వాత ట్రైన్ ఎక్కించి చార్జీలకు డబ్బుచ్చి వెళ్లిపోయాడు. నిజంగా అతను దేవుడు. అక్కడ లోకల్ పోలీసులకు, రాజకీయనాయకులకు డబ్బుచ్చి మేనేజ్ చేసే ఆ బ్రోతల్ సంస్థ నుంచి మమ్మల్ని బయటపడేసేందుకు అతను ప్రాణాలకు సైతం తెగించాడు.

ఆ హీరో ఎవరో మాకు తెలియదు

ఆ హీరో ఎవరో మాకు తెలియదు

నిజంగా అతను హీరో. అమ్మాయిల కష్టాలను అర్థం చేసుకుని వ్యభిచారం నుంచి వేశ్యావృత్తి నుంచి మమ్మల్ని కాపాడిన ఆ హీరో నిజంగా ఎవరో మాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు నాకు పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. నా సంసారం చాలా బాగుంది. కానీ ఆ రోజులు గుర్తొస్తే మాత్రం చాలా భయం వేస్తుంది.

మానవ మృగాలు

మానవ మృగాలు

ఇలా ఎందరో అమ్మాయిలు వేశ్యావృత్తి వల్ల బలవంతంగా ఇరుక్కుని దేశంలో వేధనకు గురవుతూనే ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారి బతుకును బజారుకీడ్చుకోలేక నలిగి నలిగి చస్తున్నారు. పేదరికం, కష్టాలను ఆసరాగా చేసుకుని చాలా మంది అమ్మాయిలను వేశ్యావృత్తిలోకి దింపి నాశనం చేసే మానవ మృగాలు చాలానే ఉన్నాయి ఈ సమాజంలో.

English summary

i can't forget those days

i can't forget those days
Story first published:Wednesday, April 18, 2018, 11:42 [IST]
Desktop Bottom Promotion