30ఏళ్లు దాటాక పెళ్లి ...! జీవితంలో అత్యంత ఉత్త‌మ నిర్ణ‌యం అదే! ఎందుకంటే...

By: sujeeth kumar
Subscribe to Boldsky

పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? 20ఏళ్లు నిండ‌గానే చెసెయ్యాల‌ని పెద్ద‌ల ఆరాటం. సంసార సాగ‌రంలో మున‌గ‌డానికి అప్పుడే తొంద‌ర ఎందుక‌ని యువ‌త ఆక్రోశం. 30ఏళ్ల త‌ర్వాత నిదానంగా పెళ్లి చేసుకుంటే ఉన్న లాభాలేమిటో, జీవితంలో స‌రైన నిర్ణ‌యం ఎలా అవుతుందో ఈ వ్యాస‌క‌ర్త త‌న సొంత క‌థ ద్వారా చెప్ప‌ద‌లిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ అనుభ‌వాలేమిటో తెలుసుకుందాం ప‌దండి.

1. పెళ్లి చేసుకునేందుకు తొంద‌ర ప‌డ‌లేదు!

1. పెళ్లి చేసుకునేందుకు తొంద‌ర ప‌డ‌లేదు!

సంప్ర‌దాయ కుటుంబంలో పెరిగాను. నాకు 25ఏళ్లు రాక‌ముందు నుంచే పెళ్లి చేసుకోమ‌ని త‌ల్లిదండ్రుల పోరు మొద‌లైంది. 30కి వ‌చ్చేస‌రికి పెళ్లి గురించిన వాళ్ల అభ్య‌ర్థ‌న‌ల‌న్నీ బెదిరింపుల‌య్యాయి. అయినా నేనేమీ తొణ‌క్కుండా నాకు స‌రైన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడే చేసుకుంటాను అని క‌రాఖండిగా చెప్పేసాను. 30ల‌లో సోలో లైఫ్ గ‌డ‌ప‌డం అంత సులువేమీ కాలేదు. స‌రైన భాగ‌స్వామి దొరికే వ‌ర‌కు వేచిచూడాల‌నుకున్నాను. 37ఏళ్ల‌కు అదీ మిస్ట‌ర్ రైట్‌తో నా పెళ్లి జ‌రిగిపోయింది. నా జీవితంలో బెస్ట్ నిర్ణ‌యం ఇదే!

2. అప్ప‌టికీ బాగా సెటిలయ్యాను

2. అప్ప‌టికీ బాగా సెటిలయ్యాను

నాకు పెళ్లి అయ్యే స‌మ‌యానికి కెరీర్ ప‌రంగా బాగా సెటిల్ అయ్యాను. జీవితం నుంచి ఏంకావాలో నాకు అర్థ‌మైంది. పెళ్లిని కేవ‌లం ఇద్ద‌రి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర సంబంధంలాగే చూశాను. జీవిత భాగ‌స్వామితో అన్నీ పంచుకోగ‌లిగే వ్య‌క్తి కోసం ఇన్నాళ్లు ఎదురుచూశాను. నా బ‌ల‌హీన‌త‌లో, క‌ష్ట‌స‌మ‌యాల్లో తోడుండాల‌ని ఆకాంక్షిచాను. నా భాగ‌స్వామికి ఇలాగే తోడుండాల‌ని అనుకున్నాను. 30ల‌లో నా భాగ‌స్వామిని, న‌న్ను బాగా చూసుకోగ‌లిగే సామ‌ర్థ్యం వ‌చ్చేసింది.

3. పొర‌పాట్ల నుంచి నేర్చుకున్నా...

3. పొర‌పాట్ల నుంచి నేర్చుకున్నా...

మూడు ప‌దుల వ‌య‌సుకు వ‌చ్చేస‌రికి తెలివైన వ్య‌క్తిగా ఎదిగాను. పొర‌పాట్ల నుంచి చాలా నేర్చుకున్నాను. పాత సంబంధాలతో చెల‌రేగిన త‌ప్పుల‌ను పున‌రావృతం కాకుండా చేసుకోగ‌లిగాను. ఇంట్లో వాళ్ల నుంచి పెళ్లి చేసుకోమ‌ని ఒత్తిడి పెరిగినా స‌సేమిరా ఒప్పుకోలేదు. తొంద‌ర‌పాటుతో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకూడ‌దు అని కృత‌నిశ్చ‌యంతో ఉన్నాను.

4. ఓపిక‌, స‌హ‌నం వ‌స్తుంది

4. ఓపిక‌, స‌హ‌నం వ‌స్తుంది

కాలంతోనే ఓపిక పెరుగుతూ వ‌స్తుంది. ఓపిక‌, స‌హ‌నం పాటించిన వారి వైవాహిక జీవిత‌మే ఆనందంగా ఉంద‌ని చాలా సార్లు రుజువైంది. పెళ్లి త‌ర్వాత ఎలాంటి ఆటంకాలు ఏర్ప‌డినా వాట‌న్నింటినీ ఓపిక‌తో ప‌రిష్క‌రించుకోగ‌లిగే నేర్పు వ‌చ్చేస్తుంది. కొత్త‌గా పెళ్ల‌యిన యువ జంటలు పోట్లాడుతూనే స‌గం కాలం గ‌డిపేస్తారు. అదే మెచ్యూర్డ్ గా ఉన్న వ్య‌క్తుల మ‌ధ్య స‌రైన అవ‌గాహ‌న‌, అర్థం చేసుకునే త‌త్వం ఉంటుందని నా న‌మ్మ‌కం.

5. పిల్ల‌ల కోస‌మే పెళ్లి! అస్స‌లు వ‌ద్దు

5. పిల్ల‌ల కోస‌మే పెళ్లి! అస్స‌లు వ‌ద్దు

30ల చివ‌ర్లో పిల్ల‌ల‌ను క‌న‌డం అంత మంచిది కాదంటారు. మా త‌ల్లిదండ్రులు కూడా ఇదే విష‌యాన్ని ప‌ట్టుకొని తొంద‌ర‌గా పెళ్లి చేయాల‌ని చూశారు. అప్ప‌టికే నాకు పాలిసిస్ట‌క్ ఓవ‌రీ సిండ్రోమ్ ఉంద‌ని క‌నుగొన్నారు. లేటుగా పిల్ల‌ల్ని క‌న‌డానికి ప్ర‌య‌త్నిస్తే కాలేర‌ని డాక్ట‌ర్లు చెప్పారు. అయితే నేను దీనికీ సిద్ధ‌ప‌డ్డాను. పిల్ల‌ల కోస‌మే అని త్వ‌ర‌గా పెళ్లి చేసుకోవ‌డం నా మ‌న‌సుకు విరుద్ధంగా అనిపించింది. స‌హ‌జంగా త‌ల్లికాలేక‌పోవ‌చ్చు. ఎల్ల‌ప్పుడూ ప్రేమ‌ను పంచే మాతృమూర్తినైతే కాగ‌ల‌ను క‌దా!

6. నా ప్రాథ‌మ్యాలు తెలిసొచ్చాయి

6. నా ప్రాథ‌మ్యాలు తెలిసొచ్చాయి

20ల‌లో ఉండ‌గా నా కోసమే నేను గ‌డిపాను. ప్ర‌యాణాలు, కెరీర్‌, వ్య‌క్తిగ‌త జీవితం. ఇలా 30కి చేరుకునేస‌రికి బాగా అనుభ‌వం వ‌చ్చింది. జీవితంపైన ఒక క్లారిటీ వ‌చ్చేసింది. ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను, ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌తో వేరుగా చూడ‌గ‌లిగే నేర్పు వ‌చ్చేసింది. నా పెళ్లి స‌మ‌యానికి నా ల‌క్ష్యాలు, ప్రాథ‌మ్యాల‌పై స‌రైన గురి కుదిరింది. వ్య‌క్తిగ‌త జీవితంలో ఎలాంటి గొడ‌వ‌లు రాకుండా చూసుకోగ‌లిగే నేర్పు వ‌చ్చేసింది అనుకుంటున్నాను.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి.

English summary

i-got-married-in-my-late-thirties-and-it-was-the-best-decision-of-my-life

i-got-married-in-my-late-thirties-and-it-was-the-best-decision-of-my-life,
Story first published: Friday, February 2, 2018, 17:00 [IST]
Subscribe Newsletter