For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయన పెళ్లికి ముందే నన్ను ప్రెగ్నెంట్ ని చేశాడు, అందరూ నోటికొచ్చినట్లు నన్ను తిట్టారు

|

నేను పీజీ ఎంట్రెన్స్ రాసే సమయంలో తను నాకు పరిచయం అయ్యాడు. అప్పుడు కర్నూలులో యూనివర్సిటీ లేదు పీజీ సెంటర్ కూడా ఓపెన్ కాలేదు. అందుకే డిగ్రీ అయిపోగానే అనంతపురంలోని వర్సీటీలో పీజీకి అప్లై చేశాను.

ఎంట్రెన్స్ టెస్ట్ కు ఒక రోజు ముందే కర్నూలు నుంచి అనంతపురానికి బస్ లో బయల్దేరాను. అప్పటికే బస్ ఫుల్ అయిపోయింది. అయితే జెంట్స్ సీట్లలో ఒక అతని పక్కన ఖాళీగా ఉంది. ఏమండీ ఇక్కడ కూర్చొవచ్చా అన్నాను. కూర్చొండి అన్నాడు.

డోన్ దగ్గరకు వెళ్లే వరకు

డోన్ దగ్గరకు వెళ్లే వరకు

బస్ డోన్ దగ్గరకు వెళ్లే వరకు కూడా నా పక్కన ఉన్న అతని ముఖం వైపు సరిగ్గా చూడలేదు. డోన్ లో బస్ ఆగాక కిందకు దిగి వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. కాస్త విండో వైపు కూర్చొవచ్చా అండీ అడిగాను. సరే అన్నాడు.

కర్నూలు అన్నాను

కర్నూలు అన్నాను

ఏ ఊరు మీది అన్నాడు, కర్నూలు అన్నాను. మీది? మాది కర్నూలు పక్కనే పల్లెటూరు అన్నాడు. నా చేతిలో ఉన్న పీజీ ఎంట్రెన్స్ బుక్ చేసి ఎగ్జామ్ కు వెళ్తున్నారా అని అడిగాడు. అవునండీ అన్నాను. నేను కూడా అన్నారు.

గర్ల్స్ డిగ్రీ కాలేజీ

గర్ల్స్ డిగ్రీ కాలేజీ

ఓ.. అలాగా డిగ్రీ ఏ కాలేజీ మీది? బీక్యాంప్ లోని ఒక కాలేజీ పేరు చెప్పాడు. మరి మీది ఏ కాలేజీ అని అడిగాడు. నాది కర్నూలులోనే ఒక గర్ల్స్ డిగ్రీ కాలేజీ అని చెప్పాను. అలా మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.

నాన్ స్టాఫ్ గా మాట్లాడుకున్నాం

నాన్ స్టాఫ్ గా మాట్లాడుకున్నాం

అనంతపురం వచ్చే వరకు నాన్ స్టాఫ్ గా మాట్లాడుకున్నాం. అన్నీ చదువుకు సంబంధించిన విషయాలే. ఇద్దరం ఎమ్మెస్సీకి అప్లై చేశాం. ఆ రోజు బస్టాండ్ నుంచి నేను మా బంధువుల ఇంటికి వెళ్లాను. తను యూనివర్సిటీలోని తన ఫ్రెండ్స్ రూమ్ కు వెళ్లాడు.

Most Read :బావ అని పిలవగానే నరనరాల్లో కరెంట్ పాస్, మేనమామ కూతురితో ముద్దుల దాకా యవ్వారం #mystory317

ఆనందం కలిగింది

ఆనందం కలిగింది

మరుసటి రోజూ ఇద్దరం ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ రాశాం. పరీక్ష అయిపోయాక తన కోసం ఎదురు చూశాను. తాను వచ్చేసరికి ఏదో తెలియని ఆనందం కలిగింది. ఒక చెట్టు కింద తనతో మాట్లాడుకుంటూ కూర్చొన్నా.

తనతో మాట్లాడుతూ ఉంటే

తనతో మాట్లాడుతూ ఉంటే

తర్వాత ఇద్దరం వెళ్లి హోటల్ లో భోజనం చేశాం. ఎందుకో తనతో మాట్లాడుతూ ఉంటే నాకు అలాగే కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది. తనది నాది అన్ని విషయాలపై ఒకే అభిప్రాయం.

Most Read :నా మరదలితో చాలా కెమిస్ట్రీ నడిచింది, అమ్మ లేచిపోవడంతో మామయ్యకు నచ్చలేదు, వేరొకరితోపెళ్లి #mystory319

క్యాంపస్ లోనే పీజీ

క్యాంపస్ లోనే పీజీ

తర్వాత తను కర్నూలు వెళ్లిపోయాడు. నేను ఆ రోజు అంతా అనంతపురంలో మా బంధువుల ఇంట్లోనే ఉండి మరుసటి రోజు వెళ్లాను. మా ఇద్దరికీ క్యాంపస్ లోనే పీజీ సీట్లు వచ్చాయి. అక్కడ మా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది.

బయట రూమ్ తీసుకుని

బయట రూమ్ తీసుకుని

రోజూ తనతో ఏవేవో విషయాలపై మాట్లాడేదాన్ని. మాకు తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడ్డాం. పీజీ ఫస్ట్ ఇయర్ లోనే తను నాకు ప్రపోజ్ చేశాడు. నేను వెంటనే ఒకే చేశాను. తర్వాత క్యాంపస్ లో కాకుండా బయట రూమ్ తీసుకుని ఉండడం స్టార్ట్ చేశాం.

జరగకూడనవన్నీ

జరగకూడనవన్నీ

మా ఇద్దరినీ వర్సిటీలో అందరూ భార్యాభర్తలనుకునేవారు. అంత క్లోజ్ గా ఉండేవాళ్లం. ఇద్దరం రూమ్ నుంచి బైక్ పై వర్సీటికీ వచ్చేవాళ్లం. అయితే పెళ్లి కాకముందే మా మధ్య జరగకూడనవన్నీ జరిగిపోయాయి.

Most Read :నా మరదలిని పెళ్లి చేసుకోబోయే అతడికి అసలు విషయం చెప్పా, తాళి కట్టకుండా వెళ్లిపోయాడు #mystory321

శారీరకంగా ఒక్కటయ్యాం

శారీరకంగా ఒక్కటయ్యాం

కొన్ని బలహీన క్షణాల్లో మేమిద్దరం శారీరకంగా ఒక్కటయ్యాం. దీంతో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈ విషయం మా ఇంట్లో తెలిసింది. వాళ్లను మా పెళ్లికి ఒప్పిద్దామని ఇంటికి వెళ్లాను. మా అమ్మనాన్న నన్ను ఇంట్లోకి అడుగుపెట్టొద్దన్నారు.నువ్వు మాకు చనిపోయిన కిందే లెక్క అన్నారు. అబార్షన్ చేయించుకుని వస్తే ఎవరికో ఒకరికి తెలియకుండా కట్టబెడతామన్నారు.

నా తల ఎక్కడ పెట్టుకోవాలో

నా తల ఎక్కడ పెట్టుకోవాలో

వాళ్లకు మా ప్రేమ గురించి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు. నీ కూతురు వేరే కులంవాడిని ప్రేమించిందట కదా.. పెళ్లికి ముందే గర్భందాల్చిందట కదా అని అందరూ అంటూ ఉంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదంటూ మా నాన్న నాపై కోప్పడ్డాడు.

రిజిస్టర్డ్ మ్యారేజ్

రిజిస్టర్డ్ మ్యారేజ్

నేను ఏమీ మాట్లాడకుండా మళ్లీ అనంతపురం బయల్దేరాను. తనతో అన్ని విషయాలు చెప్పాను. మన పెళ్లికి మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదన్నాను. ఏం ఫర్వాలేదు. మనం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాడు. తర్వాత ఫ్రెండ్స్ అందరి సమక్షంలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం.

Most Read :నా భర్త పెళ్లికాకముందే యాభై మంది అమ్మాయిలతో గడిపాడు, అమాయకంగా ఉంటూ అమ్మాయిలతో అన్నీ అయిపోగొడతాడు

గవర్నమెంట్ జాబ్స్ సాధించాం

గవర్నమెంట్ జాబ్స్ సాధించాం

ఎమ్మెస్సీ పూర్తికాగానే ఇద్దరం నెట్ క్వాలిఫై అయ్యాం. నాకు జేఆర్ ఎఫ్ కూడా వచ్చింది. నేను పీహెచ్ డీ చేశాను. తను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మంచి పేరు సంపాదించాడు. తర్వాత ఇద్దరం గవర్నమెంట్ జాబ్స సాధించాం. ఆర్థికంగా బలపడ్డాం. అందరిలో మంచి పేరు సంపాదించుకున్నాం.

పెళ్లాడబోయే వ్యక్తితోనే తప్పు

పెళ్లాడబోయే వ్యక్తితోనే తప్పు

మాకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఒకప్పుడు మా ఇద్దరినీ అందరూ వెలివేశారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. మేము మాత్రం ఆ రోజు అలాగే ఉన్నాం.. ఈ రోజు అలాగే ఉన్నాం. పెళ్లి కాకుండా నేను తప్పు చేయడం తప్పే. కానీ నేను పెళ్లాడబోయే వ్యక్తితోనే ఆ తప్పు చేశాను.

Most Read :ఆమె భర్త మా స్నేహాన్ని అర్థం చేసుకున్నాడు కానీ అతనికీ అనుమానం వచ్చింది, దూరంపెట్టాడు #mystory300

జనాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు

జనాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు

ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా నన్ను నానా మాటలు అని టార్చర్ చేశారు. ఆ రోజు మాటలన్నంత వాళ్లంతా ఇప్పుడేమో నువ్వు చేసింది కరెక్టే అంటున్నారు. జనాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు. వారి మాటలను మీరేమీ పట్టించుకోకండి.

నిర్భయంగా చేసేయండి

నిర్భయంగా చేసేయండి

మీకు నచ్చింది.. మీ అంతరాత్మకు కరెక్ట్ అని అనుకున్నవన్నీ మీరు నిర్భయంగా చేసేయండి. జీవితంలో బాగా సెటిల్ అయితే మీరు ఏదీ చేసినా కూడా రైటే అంటారు. సెటిల్ కాకుంటే మీరు ఏదీ చేసినా తప్పే అంటారు. అంతే తేడా.

English summary

i got pregnant before my wedding

i got pregnant before my wedding