Just In
- 3 hrs ago
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- 13 hrs ago
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- 14 hrs ago
Kumbh Mela 2021: సరిగ్గా 83 ఏళ్ల తర్వాత కుంభమేళాలో మళ్లీ ఇప్పుడు అది రిపీట్ అయ్యింది...
- 15 hrs ago
కొబ్బరి పాలు ఇలా ఉపయోగిస్తే జుట్టు సమస్యలు పోయి, జుట్టు తిరిగి అందంగా పెరుగుతుంది..
Don't Miss
- News
కాస్సేపట్లో వ్యాక్సినేషన్: వైఎస్ జగన్ షెడ్యూల్ ఇదే: వారంలో ఎన్ని రోజులు వ్యాక్సిన్?
- Sports
4 పరుగుల తేడాలో మూడు వికెట్లు.. ఆసీస్ స్కోర్ 332/8!!
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చీ.. అలాంటి మొగుడు ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే, ఆ సమయంలో ఇబ్బందిపెడతాడు..
మాది చాలా బీద కుటుంబం. మా నాన్న తాగుడుకు బానిస అయి అప్పుల పాలయ్యాడు. దీంతో అమ్మనే ఇంటి బాధ్యతలు చూసుకునేది. అమ్మ ఇళ్లలో పని చేస్తూ నన్ను చదివించింది. తమ్ముడు చదువుకుంటూనే పని చేసేవాడు.
నేను కాలేజీకి వెళ్లి వచ్చిన వెంటనే కుట్టు మిషన్ నేర్చుకునేందుకు వెళ్లేదాన్ని. మా అమ్మ పని చేసే ఇళ్లలో అప్పుడప్పుడు నేను కూడా వెళ్లి పని చేసేదాన్ని. ఒక రోజు ఇంట్లో పని చేస్తుండగా ఆ ఇంటి ఓనర్లు ఏ చదువుతున్నావు అమ్మాయి అంటూ నా డిటేల్స్ అడిగారు.

మిమ్మల్ని ఒకటి అడగలానుకుంటున్నా
నా చదువు గురించి మొత్తం చెప్పాను. నేను కాలేజీలో ఫస్ట్ అండీ.. ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాను అని చెప్పాను. అంతలోనే మా అమ్మ వచ్చింది.. సులోచనమ్మా.. మీరు ఏమనుకోకుంటే మిమ్మల్ని ఒకటి అడగలానుకుంటున్నామన్నారు ఆ ఇంటి పెద్దలు.

మీ కూతురు సంధ్యను ఇస్తారా
అదేంటీ అయ్యగారు, అమ్మగారు అలా అంటారేంటండీ. అడగండీ అని అమ్మ అంది. మీ కూతురు సంధ్యను మాకు తెలిసిన ఒక అబ్బాయికి అడగాలనుకుంటున్నామని చెప్పారు. అబ్బాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మంచి ఆస్తి ఉంది. చాలా మంచివాడు. అయితే అతని మొదటి భార్య ఏవో కారణాల వల్ల అతనికి విడాకులు ఇచ్చింది.

రెండో పెళ్లి అనుకోకండి
మీ అమ్మాయి సంధ్యను అతనికి అడగాలని మాకు చాలా రోజులుగా ఉంది. మీకు ఇష్టం ఉంటే చెప్పండి.. ఇది మాత్రం మంచి సంబంధం. రెండో పెళ్లి అని ఏమీ ఆలోచించుకోకండి. ఆ అబ్బాయికి కులం, డబ్బు, స్థాయి కూడా పట్టించుకోడు.

ఏ అమ్మాయికైనా తాళి కట్టేస్తాడు
మేము చెబితే ఆ అబ్బాయి ఏ అమ్మాయి మెడలో అయినా తాళి కట్టేస్తాడు. మీరు ఒకే అంటే మేము ఆ అబ్బాయితో మాట్లాడతాం అన్నారు. సరే అయ్యగారు మేము రేపటిలోపు ఏదో ఒక విషయం చెబుతాం అంది.

భయం వేస్తుంది అమ్మా
ఇంటికొచ్చాక నేను, అమ్మ, తమ్ముడు దానిపైనే మాట్లాడుకున్నాం. అంత గొప్పింటోళ్లు సంబంధం అడుగుతుంటే ఎందుకు కాదనాలి అని అమ్మ అంది. రెండో సంబంధం అంటే నాకు ఎందుకో భయం వేస్తుంది అమ్మా అన్నాను.

పెళ్లి అతనితో జరిగిపోయింది
చివరకు మా అమ్మ ఏవేవో మాటలు చెప్పి నన్ను ఒప్పించింది. తర్వాత నా పెళ్లి అతనితో జరిగిపోయింది. పెళ్లయితే అయ్యిందికానీ నాకు మాత్రం మనస్సులో చాలా భయం ఉండేది. పెళ్లికి ముందు నేను అతన్ని సరిగ్గా కూడా చూడలేదు.

తన కూతురు అనుకుంటారు
పెళ్లయ్యాక చూశాను. బాగా ఏజ్ బార్ వ్యక్తిలా ఉన్నాడు. తనను నన్ను చూస్తే ఎవరైనా సరే తన కూతురు అనుకుంటారుగానీ భార్య అని ఎవరూ అనుకోరు. అయినా సరే పెళ్లి చేసుకున్నాక ఇవన్నీ ఆలోచిస్తే కుదరదు అనుకున్నాను.

అతని ప్రవర్తనపై అనుమానం
పెళ్లయిన మరుసటి రోజే నాకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. తను నాతో పైకి చాలా ప్రేమతో మాట్లాడాడు. అతను నా పక్కన ఉంటే నాకు చాలా భయం వేసింది. తను ఒక విలన్ లా కనపడేవాడు. తన ప్రవర్తన మొత్తం కూడా అలాగే ఉండేది.

పెళ్లయిన వారంరోజుల్లోనే
బతిమిలాడుతున్నట్లు మాట్లాడేవాడు. కానీ అందులో ప్రేమ ఉండదు. అంతా నటనే ఉంటుంది. పెళ్లయిన వారంరోజుల్లోనే నాకు తను నరకం చూపించాడు. నాకు పీరియడ్స్ వచ్చే ముందు బాగా పెయిన్ వస్తుంది.

నొప్పిని తట్టుకోలేను
ఆ నొప్పిని నేను అస్సలు తట్టుకోలేను. నాకు పెళ్లయిన కొన్ని రోజులకు బాగా పెయిన్ వచ్చింది. ఆ రోజు ఇంట్లో ఏ పని చేయలేకపోయాను. తర్వాత నా సమస్యను మా ఆయనకు చెప్పాను. తను అర్థం చేసుకోకపోగా నానా మాటలు అన్నాడు.

అది అంటే బాగా ఇష్టమట కదా
నాకు ఆ టైమ్ లో కాస్త నిమ్మరసం తీసుకొచ్చి ఇవ్వండని అడిగాను. అప్పుడు తను నాతో మాట్లాడిన తీరును చూసి నాకు తనపై చాలా అసహ్యం పుట్టింది. కొంత మంది అమ్మాయిలకు పీరియడ్స్ టైమ్ లో సెక్స్ చేయించుకోవడం అంటే బాగా ఇష్టమట కదా?

భార్యతో మరీ ఇంత దారుణంగా
నీకు కూడా అలాంటి కోరికలేమన్నా ఉన్నాయా? ఉంటే చెప్పు నేను సెక్స్ చేస్తా అన్నాడు. తను ఆ మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వచ్చింది. అసలు ఈయన నా భర్తేనా? భార్యతో మరీ ఇంత దారుణంగా మాట్లాడుతారా అనిపించింది.

శృంగారం చేయమని పట్టుపట్టాడు
నేను నొప్పితో అల్లాడిపోతుంటే ఇలా మాట్లాడుతున్నాడేంటీ అనుకున్నాను. కానీ తను అంతటితో ఆగలేదు. తనతో ఆ సమయంలోనూ శృంగారం చేయమని పట్టుపట్టాడు. చాలా రాక్షసంగా ప్రవర్తించాడు. తనలో నాకు ఒక రాక్షసుడు కనిపించాడు.

అందులో పాల్గొనకుంటే
ఆయన సైకో ప్రవర్తన వల్ల నేను నరకం అనుభవించాను. తనతో నేను అస్సలు కాపురం చేయలేనని అర్థమైంది. తను పెట్టే లైంగిక హింసకు నేను తట్టుకోలేకపోయేదాన్ని. తనతో సెక్స్ లో పాల్గొనకుంటే బయట వ్యక్తులతో ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నావా అంటూ నాపై అనుమానపడేవాడు.

నరకంలా ఉండేది
తనతో శారీరకంగా కలిస్తే నాకు నరకంలా అనిపించేది. తను ప్రవర్తన చూస్తే నాకు భయం వేసేది. నా సమస్య ఎవరితో చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు. ఒక పెద్దనగరంలో అపార్ట్ మెంట్ లో ఉండేవాళ్లం. ఆ వాతావరణం నాకు నచ్చలేదు. ఇక్కడ నేను చచ్చిపోయినా ఎవరూ పట్టించుకునేవారు లేరు అనిపించింది.

బాగా ఆస్తి ఉందికానీ
నా భర్త నన్ను చంపినా కూడా అడిగేవారు ఉండరనిపించింది. రోజురోజుకు నాలో భయాలు పెరిగిపోయాయి. తనకు బాగా ఆస్తి ఉందికానీ తనతో ఉంటే నాకు నిత్యం నరకంలా ఉండేది.

అలాంటి అతన్ని చేసుకుని ఉండి ఉంటే
అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని అనిపించేది. నా స్థోమతకు తగ్గట్లుగా ఏ ఆటో డ్రైవర్ నిగానీ, రోజూ ఏదో ఒక పని చేసి వచ్చి నన్ను పోషించే వ్యక్తిని చేసుకుని ఉండి ఉంటే ఇంత నరకం ఉండేదికాదు కదా అనిపించింది.

పారిపోయి వచ్చేశాను
ఆ రోజు ఇదే ఆలోచించి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. నేను చేసుకోను అని ఉంటే మహా అంటే రెండ్రోజులు ఆ ఇంటి పెద్దలు బాధపడి ఉండేవారేమో. నేను మొహమాటానికి వెళ్లి నా చేతులారా జీవితం నాశనం చేసుకున్నాను. నాకు తనతో ఉండడం అస్సలు నచ్చలేదు. అందుకే రాత్రిరాత్రికి పారిపోయి మా పుట్టింటికి వచ్చాను. విడాకులు ఇచ్చేశాను.