నా వయస్సు 18 సంవత్సరాలు.. నేను చట్టం ప్రకారం సెక్స్ లో పాల్గొనవచ్చా?

Written By:
Subscribe to Boldsky

ప్రశ్న : నా పేరు రాజు. నేను ఆటో డ్రైవర్ని. నా వయస్సు 18 సంవత్సరాలు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె వయస్సు 16 సంవత్సరాలు. మేమిద్దరం చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం. మా ఇళ్లలో చెప్పి మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం.

అమ్మాయికి కూడా 18 సంవత్సరాలు

అమ్మాయికి కూడా 18 సంవత్సరాలు

అయితే మా ఫ్రెండ్స్ కొందరు 18 ఏళ్లు ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకోవొచ్చు అని చెప్పారు. కానీ మరి కొందరు మాత్రం అమ్మాయికి కూడా 18 సంవత్సరాలుండాలి అని అన్నారు. నాకు ఈ వయస్సులకు సంబంధించిన విషయాలు అర్థం కావడం లేదు.

వయస్సులన్నీ నిర్ణయించారా?

వయస్సులన్నీ నిర్ణయించారా?

మరికొందరు ఫ్రెండ్స్ చట్టం ప్రకారం సెక్స్ లో పాల్గొనడానికి కూడా ఒక వయస్సును నిర్ణయించారని చెప్పారు. నిజంగా ఈ వయస్సులన్నీ నిర్ణయించారా? ఒక వేళ నిర్ణయిస్తే.. అబ్బాయికి ఎంత వయస్సు ఉండాలి? అమ్మాయికి ఎంత వయస్సు ఉండాలో చెప్పగలరు. అలాగే ఇప్పటికీ చాలా మంది ఈ వయస్సుల గురించి తెలియకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పగలరు.

అమ్మాయికి 18 ఏళ్లు

అమ్మాయికి 18 ఏళ్లు

సమాధానం : భారతీయ ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి 21 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్ల వయస్సు నిండాలి. అప్పుడే వారు పెళ్లి చేసుకోవడానికి అర్హులు.

అవగాహన లేకపోవడం

అవగాహన లేకపోవడం

కానీ ఇప్పటికీ గ్రామాల్లో చిన్న వయస్సులోనే అమ్మాయిలకు, అబ్బాయిలకు పెళ్లిళ్లు అవుతున్నాయి. మారుమూల గ్రామాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. బాల్య వివాహాలపై అవగాహన లేకపోవడం, దీనిపై ఇంకా ప్రచారం పెరగకపోవడం వల్ల కొందరు ఇప్పటికీ బాల్యవిహాలు జరిపిస్తున్నారు.

మరో మూడేళ్లు ఆగండి

మరో మూడేళ్లు ఆగండి

ఇక మీ విషయానికి వస్తే మీ వయస్సు ఇప్పుడు 18 సంవత్సరాలు అంటున్నారు. మీరు అబ్బాయి కాబట్టి మరో మూడేళ్లు ఆగి 21 ఏళ్లలో పెళ్లి చేసుకోండి. అప్పుడే మీరు చట్టం ప్రకారం పెళ్లికి అర్హులు.

ఆమె మైనర్

ఆమె మైనర్

ఇక మీరు ప్రేమించిన అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు అంటున్నారు. అంటే ఆమె మైనర్. మీ వయస్సు కూడా తక్కువే ఉంది. ప్రస్తుతం మీరిద్దరు వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం.

సెక్స్ కు కూడా అవే

సెక్స్ కు కూడా అవే

సెక్స్ కు సంబంధించి లీగల్ గా ఏదైనా వయస్సు నిర్ణయించారా అని అడిగారు.. సెక్స్ కు సంబంధించి కూడా పైనే తెలిపిన వయస్సులే వర్తిస్తాయి.

నిరక్షరాస్యత.. అవగాహన లేకపోవడం

నిరక్షరాస్యత.. అవగాహన లేకపోవడం

ఈ వయస్సుల గురించి చాలా మందికి తెలియకపోవడానికి కారణం... తల్లిదండ్రుల నిరక్షరాస్యత. సరైన అవగాహన లేకపోవడం. బాల్య వివాహాలపై సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషియల్‌ స్ట్రాటజీ సంస్థ గతంలో నిర్వహించిన ఒక సర్వే లో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని కూడా తేలింది.

గర్భధారణ కాస్త లేట్ గా

గర్భధారణ కాస్త లేట్ గా

ఇక 18 సంవత్సరాల వయస్సులో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆమె వెంటనే గర్భిణీ కావడం కూడా ఆమె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 18 సంవత్సరాలకు పెళ్లి అయినా కూడా గర్భధారణ కాస్త లేట్ గా కలిగేటట్లు జాగ్రత్తలు పాటించాలి. గర్భదారణకు 20-25 సంవత్సరాల మధ్య వయస్సు అనుకూలంగా ఉంటుంది.

10 ఏళ్ల వయస్సుంటే చాలు

10 ఏళ్ల వయస్సుంటే చాలు

మన దేశంలో 1860లో వివాహానికి 10 సంవత్సారాల వయస్సుంటే చాలు. అయితే 1891లో దానిని 12 సంవత్సరాలకు పెంచారు. 1925లో దాన్ని 14 సంవత్సరాలకు పెంచారు. అదే నిబంధన 1929లో చేసిన బాల్య వివాహాల నియంత్రణ చట్టంలోనూ చేర్చారు. 1949లో వివాహ వయస్సు 15 ఏళ్లయింది. 1955లో వధువుకు 15 సంవత్సరాలు, వరుడికి 18 సంవత్సరాలుగా మార్చారు.

ఆమె బాలిక కాదని చెబుతోంది

ఆమె బాలిక కాదని చెబుతోంది

1982లో వధువుకు 16 సంవత్సరాలు చేశారు. 2013లో దానిని 18 సంవత్సరాలకు పెంచారు. 2012 పోస్కో చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు ఆడపిల్ల బాలికగా చెబుతుండగా, సెక్షన్ -375 ప్రకారం వివాహం జరిగి ఉంటే ఆమె బాలిక కాదని చెబుతోంది. నిర్బయ చట్టం చేసినపుడు దీనిని సవరించాలనుకున్నా సాధ్యపడలేదు.

18 సంవత్సరాలు నిండాలి

18 సంవత్సరాలు నిండాలి

1976కు ముందు చట్టం ప్రకారం పెళ్లికుమారుడి వయస్సు 18, పెళ్లికుమార్తె వయస్సు 15 ఉండేది, దానిని తర్వాత సవరించి పెళ్లికుమారుడి వయస్సు 21, పెళ్లికుమార్తె వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలని నిర్ణయించారు. వివాహాలకు సంబంధించి చాలా చట్టాలున్నాయి. ఇటీవల కొందరు అబ్బాయికి 25 సంవత్సరాలు, అమ్మాయికి 21 సంవత్సరాలు నిర్ణయించాలని కూడా ముగ్గురు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

English summary

i want to know what is the legal age of having sex?

i want to know what is the legal age of having sex?
Story first published: Thursday, April 5, 2018, 11:30 [IST]