సెక్స్ లో మంచి సంతృప్తి పొందాలనుకునేవారు.. పిల్లలు త్వరగా పుట్టాలనుకునే వారికి వాజీకరణ బెస్ట్

Written By:
Subscribe to Boldsky

వీర్యం స్కలనం సమస్యతో చాలా మంది మగవారు బాధపడుతుంటారు. దీనివల్ల సెక్స్ లో అస్సలు సంతృప్తి పొందలేరు. యోనిలో అంగం పెట్టి పెట్టగానే వీర్యం కారిపోతూ ఉంటుంది. దీంతో సెక్స్ ను ఎంజాయ్ చెయ్యలేక చాలా ఇబ్బందులుపడతారు మగవారు.

పురుషాంగం మెత్తబడిపోతుంది

పురుషాంగం మెత్తబడిపోతుంది

ప్రతి మగవాడిలో వీర్యం పడిపోగానే పురుషాంగం మెత్తబడిపోతుంది. దీంతో సెక్స్ ను అస్సలు చెయ్యలేరు. యోనిలో అంగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత వీర్యం పడిపోయేదాకా మగవారు సెక్స్ చేస్తారు. ఇక వీర్యస్కలనం అయ్యేటప్పుడు మగవారు ఎక్కువగా సంతృప్తికి లోనవుతారు. ఇలా ఈ ప్రక్రియ మొత్తం ఐదు నుంచి పదినిమిషాల దాకా ఉండొచ్చు.

పదిహేను నిమిషాల వరకు

పదిహేను నిమిషాల వరకు

ఇంకొందరు మగవారు వీర్యాన్ని స్కలించకుండా దాదాపు పదిహేను నిమిషాల వరకు కూడా సెక్స్ చేయగలుగుతారు. అయితే ఇందుకు చాలా రకాల టెక్నిక్స్ పాటించాలి. ఫోర్ ప్లే చేయడం, యాంగిల్స్ మార్చడం వంటివి చేయాలి.

బాధ వర్ణణాతీతం

బాధ వర్ణణాతీతం

మరి అంగాన్ని యోనిలో పెట్టిపెట్టగానే వీర్యాన్ని స్కలించే మగవారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. అలాంటి సమస్య ఏ మగవాడికి రాకూడదు. దీని వల్ల సెక్స్ లో దంపతులిద్దరికీ విపరీతమైన అసంతృప్తి కలుగుతుంది.

సెక్స్ ను ఎంజాయ్ చెయ్యలేరు

సెక్స్ ను ఎంజాయ్ చెయ్యలేరు

సెక్స్ లో పాల్గొన్న కొద్దిసేపటికే లేదా స్త్రీకి భావప్రాప్తి కలగకముందే వీర్యస్కలనం జరగడం వల్ల అటు అబ్బాయి.. ఇటు అమ్మాయి ఇద్దరూ సెక్స్ ను ఎంజాయ్ చెయ్యలేరు.

శీఘ్రస్కలనం

శీఘ్రస్కలనం

సెక్స్ స్టార్ట్ చేశాక మూడు నిమిషాల్లో వీర్య స్కలనం అయితే దాన్ని శీఘ్రస్కలనం సమస్య అంటారు. మగవారి సెక్స్ జీవితాన్ని ఇది కుదిపేస్తుంది.

చాలా కారణాలు

చాలా కారణాలు

త్వరగా వీర్యం స్కలనం కావడానికి చాలా కారణాలున్నాయి. హార్మోనల్ లెవెల్స్‌లో తేడాలు రావడం, కెమికల్ (సెరటోని న్) లెవెల్స్‌లో తేడాలు రావడం, ఎజాకులేటరీ సిస్టమ్ లోని లోపాలు ఉండడం ప్రధాన కారణాలు. అలాగే వంశానుగతంగా, జన్యుపరంగా వచ్చే మూలాలు కూడా శీఘ్రస్కలనానికి కారణాలు.

త్వరగా స్కలనం

త్వరగా స్కలనం

అలాగే ప్రొస్ట్రేట్ వ్యాధులకు గురికావడం, యురెథ్రాలో వాపురావడం, ఇన్‌ఫెక్షన్లు రావడం, యురెథ్రాలో సమస్య ఉంటే కూడా వీర్యం త్వరగా స్కలనం అవుతుంది. రక్తపోటు, మధుమేహం, ఆల్కహాల్స్ ఎక్కువగా తీసుకుంటే కూడా వీర్య స్కలన సమస్య వస్తుంది.

వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం

వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం

శీఘ్రస్కలన సమస్య నివారణకు ఆయుర్వేదంలో చాలా చికిత్సలుంటాయి. వాతహర చికిత్సలుంటాయి. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకునే వైద్యం చేస్తారు. తర్వాత వాజీకరణ చికిత్సలు చేస్తారు. ఇందులో వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం కూడా ఉంటుంది.

వాజీకరణ చికిత్స

వాజీకరణ చికిత్స

శీఘ్ర వీర్య స్కలన సమస్యతో పాటు, అంగస్తంభన సమస్యలకు

ఆయుర్వేదంలో చాలా రకాల చికిత్సలున్నాయి. ఆయుర్వేదంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం శృంగార సమస్యల పరిష్కారానికి , సంతానలేమి సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే కేటాయించారు. ఆ విభాగాన్నే వాజీకరణ చికిత్స అంటారు.

వాజీకరణ తంత్రం

వాజీకరణ తంత్రం

ఆయుర్వేదంలో అష్టాంగాలు అంటూ ఒక ఎనిమిది విభాగాలు ఉన్నాయి. వాటిలో లైంగిక విషయాలకే ప్రత్యేకించి వాజీకరణ తంత్రం ఉంది. ఇది సమస్త లైంగిక సమస్యలకు నివారణా మార్గాలను సూచించడంతో పాటు సంతాన లేమి సమస్యను కూడా పరిష్కరిస్తుంది.

గుర్రంలా శృంగారం చేయగల సామర్థ్యం

గుర్రంలా శృంగారం చేయగల సామర్థ్యం

వాజీకరణం అంటే గుర్రంలా శృంగారం చేయగల సామర్థ్యం కలిగిన ఔషధాలు అని అర్థం. ఈ చికిత్స వల్ల ఎంతో కాలంగా బాధపడుతున్న స్త్రీ, పురుష శృంగార సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

డాక్టర్లను సంప్రదించరు

డాక్టర్లను సంప్రదించరు

విదేశాల్లో శృంగార సమస్యలు వస్తే భార్యాభర్తలిద్దరూ చాలా తొందరగా డాక్టర్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటారు. కాని మన దేశంలో చాలా మంది సెక్స్ సమస్యల గురించి డాక్టర్‌ను సంప్రదించడానికి సంశయిస్తుంటారు.

వాజీకరణ ఔషధాలు వాడితే

వాజీకరణ ఔషధాలు వాడితే

వాజీకరణ ఔషధాలు వాడినట్లయితే పురుషులలో శృంగార సమస్యలతో పాటు సంతానలేమి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. అలాగే ఆయుర్వేదంలో సంతానలేమి సమస్యను కూడా పరిష్కరించడానికి చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.

మంచి ఫలితాలు

మంచి ఫలితాలు

పీరియడ్స్ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు, ట్యూబ్స్‌లో బ్లాక్స్ ఉన్నప్పుడు, అబార్షన్స్ ఎక్కువగా అయ్యే మహిళలు ఆయుర్వేదంలో పేర్కొన్న అనువాసనవస్తి, ఉత్తరవస్తి వంటి శోధన చికిత్సల ద్వారా మంచి ఫలితాలు పొందుతారు.

సంతాన లేమి

సంతాన లేమి

ఇక సంతాన లేమికి పురుషులు కారణమ అయితే పంచకర్మ చికిత్సలు చేసి వాజీకరణ ఔషధాలు వాడాలి. దీని ద్వార మంచి ఫలితాలు లభిస్తాయి.

వీర్యకణాల సంఖ్య తక్కువ

వీర్యకణాల సంఖ్య తక్కువ

కొందరు మగవారిలో శీఘ్రస్కలనంతో పాటు వీర్యకణాల సంఖ్య పూర్తిగా ఉండదు. ఉన్నా కూడా ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కణాల్లో కదలిక ఉండదు. ఇలాంటి వారికి ఆయుర్వేదంలో చాలా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

మంచి మందులు

మంచి మందులు

వీర్యకణాలు పూర్తిగాలేని వారికి అంటే అజోస్పెర్మియా సమస్యకు ఇతర వైద్యవిధానాల్లో మంచి ఫలితాలను ఇచ్చే మందులు లేకపోయినా ఆయుర్వేదంలో ఈ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.

పంచకర్మ అవసరం

పంచకర్మ అవసరం

ఆయుర్వేద చికిత్సలతో శుక్రకణాలు పరిపుష్టం అవుతాయి. అయితే వాజీకరణాలు తీసుకునే ముందు శరీరంలోని విషపదార్థాలను మొత్తం తొలగించుకోవాలి. అందుకు పంచకర్మ చికిత్సలు చేయించుకోవాలి.

చెక్ పెట్టొచ్చు

చెక్ పెట్టొచ్చు

వీటన్నిటిద్వారా మొత్తంగా మీ లైంగిక శక్తి, కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ చాలా శక్తివంతంగా మారుతుంది. దీంతో శీఘ్రస్కలన సమస్యతో పాటు సంతానలేమి సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. ఇలా సెక్స్ పరంగా ఏర్పడే చాలా సమస్యలకు ఆయుర్వేదంలో మంచి చికిత్సలున్నాయి.

English summary

importance of vajikarana therapy sexual disorders ayurvedic treatment

importance of vajikarana therapy sexual disorders ayurvedic treatment
Story first published: Tuesday, March 20, 2018, 15:30 [IST]