మా ఆయన ఆ సమయంలో వీడియో తీసి.. చూసి ఎంజాయ్ చేద్దామంటాడు - My Story #24

Written By:
Subscribe to Boldsky

నాకు పెళ్లి అయ్యి చాలా రోజులైంది. మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం నన్ను బాగా ఇబ్బంది పెడుతుంటాడు. మేమిద్దరం రొమాన్స్ బాగా చేసుకుంటాం. మా ఆయన పడకగదిలో రెచ్చిపోతుంటాడు. ఇక ఆదివారం అయితే మేము దాని గురించే ప్లాన్ చేసుకుంటాం. అయితే అక్కడ జరిగే విషయాలు మొత్తం మా ఆయన వాళ్ల ఫ్రెండ్స్ కు చెబుతారు. ఎవరైనా ఆ విషయాలన్నీ ఫ్రెండ్స్ కు చెబుతారా?

హనిమూన్ విషయాలు కూడా

హనిమూన్ విషయాలు కూడా

మా పెళ్లి ఆగస్టులో అయ్యింది. మేము హనిమూన్ కు ఊటీ, కొడైకెనాల్, తర్వాత గోవా వెళ్లాం. అక్కడ రూమ్స్ బుక్ చేసుకుని నేను, మా ఆయన బాగా ఎంజాయ్ చేశాం. అయితే అక్కడ జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లుగా మా ఆయన వాళ్ల ఫ్రెండ్స్ కు చెప్పాడు.

ఫ్రెండ్స్ అందరికీ మా సెక్స్ గురించి చెప్పాడు

ఫ్రెండ్స్ అందరికీ మా సెక్స్ గురించి చెప్పాడు

మా ఆయనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో కొందరు ఆయనతో పాటు ఇంటికి కూడా వస్తుంటారు. వాళ్లంతా నన్ను చెల్లెమ్మా అని అతన్ని బావ అని పిలుస్తుంటారు. అయితే వాళ్లందరికీ మా సెక్స్ లైఫ్ గురించి మా ఆయన చెప్పాడు. తర్వాత అవే విషయాలను మా ఆయన నాతో చెప్పాడు. నాకు మండింది. ఇలా చేస్తాడేంటి అనుకున్నాను.

బాగా చదువుకున్నాడు

బాగా చదువుకున్నాడు

మా ఆయన బాగా చదువుకున్నాడు. చదువులో గోల్డ్ మెడలిస్ట్ కూడా. అయితే ఏం లాభం. ఇలా విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అతని మనసత్వం నాకేమి అర్థం కావడం లేదు.

వీడియోలు చూడడం

వీడియోలు చూడడం

అంతేకాదు బెడ్ రూమ్ లోకి రాగానే సెల్ లో నెట్ ఆన్ చేస్తాడు. అందులో ఏవేవో వీడియోలు చూస్తాడు. ఎక్కువగా పోర్న్ చూస్తుంటాడు. ఒక్కోసారి వాటిని నాకు కూడా చూపించడానికి ప్రయత్నిస్తాడు. నాకు అవి అస్సలు నచ్చవు.

అందులో ఉన్నట్లుగా చేయాలంటాడు

అందులో ఉన్నట్లుగా చేయాలంటాడు

మా ఆయన అందులో ఉన్నట్లుగా నాతో సెక్స్ చేయాలంటాడు. ఏవేవో భంగిమలు గురించి చెబుతుంటాడు. నాకున్న మూడ్ మొత్తం పోగొడుతాడు. నన్ను ఒక సెక్స్ టాయ్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటాడు.

వీడియోలు తీస్తాడు

వీడియోలు తీస్తాడు

వీడియోలు చూసి అందులో ఉన్నట్లు చేయడమే కాదు. మేమిద్దరం సెక్స్ లో పాల్గొన్నప్పుడు వీడియోలు తీసి తర్వాత వాటిని చూసి ఎంజాయ్ చేద్దామంటాడు. నేను దానికి అస్సలు ఒప్పుకోలేదు.

ఆ విషయాలే చెబుతుంటే..

ఆ విషయాలే చెబుతుంటే..

ఈయన సెక్స్ విషయాలే ఫ్రెండ్స్ కు చెబుతుంటే.. ఇక ఆ వీడియోలను ఫ్రెండ్స్ కు చూపించడని నమ్మకం ఏముంది. ఇదిలో నేను నా భార్య ఇలా చేశాం. చూడండి అంటూ మా ఆయన నా స్నేహితులకు చూపించే అవకాశం ఉంది.

ఎలా భరించాలి

ఎలా భరించాలి

మా ఆయన నన్ను బాగానే చూసుకుంటాడు. ఆర్థికంగా ఎలాంటి కష్టాలు లేవు. కారు, బంగ్లా అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ప్రవర్తనే నాకు నచ్చడం లేదు. ఎలా అంటే అలా ప్రవర్తిస్తాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతాడు. మరి పిచ్చివాడిలా చేస్తుంటాడు. ఇలాంటి అతన్ని ఎలా భరించాలి.

ఆడవాళ్లకు కూడా చెబుతాడు

ఆడవాళ్లకు కూడా చెబుతాడు

అంతేకాదు ఆయనకు కొంతమంది లేడీస్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లకు కూడా మా పర్సనల్ మ్యాటర్స్ అన్నీ చెబుతారు. ఈయనకు అసలు సిగ్గుందా. వాళ్ల కన్నా సిగ్గు ఉండాలి కదా. వాళ్లు ఆడవాళ్లు కదా. ఇలాంటి విషయాలు వినడానికి కాస్త అయినా ఉండాలి.

అన్ని రకాలు సుఖాలున్నా..

అన్ని రకాలు సుఖాలున్నా..

అన్ని రకాల సుఖాలున్నా ఏదో కోల్పొతున్నామనే భావన మనస్సులో ఉంటుంది. ఏం చేయలేని పరిస్థితి. మీరే నాకు ఏదో ఒక సలహా ఇవ్వండి. నా పరిస్థితి దారుణంగా ఉంది. నేను ఈ విషయాలు బయటపెట్టడానికి మా ఆయన ప్రవర్తనే కారణం. మా ఆయన అలాంటి పనులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి.

- ప్రశ్న అడిగిన యువతి వివరాలు తెలియదు

సైకాలజిస్ట్ సమాధానం

సైకాలజిస్ట్ సమాధానం

మీ ఆయనపై పోర్న్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయన ఎక్కువగా పోర్న్ మూవీస్ చూడడం వల్లే అలా ప్రవర్తిస్తుండొచ్చు. వివాహ బంధానికి మన సంప్రదాయాల్లో చాలా విలువ ఉంది. ఆ బంధంలో జరిగే కొన్ని విషయాలు నాలుగు గోడల మధ్యే ఉండాలని చాలా మంది భావిస్తారు.

బాధాకరమే..

బాధాకరమే..

మీరు కూడా మీకు సంబంధించిన విషయాలు ఏవి బయటకు తెలియకూడదని భావిస్తున్నారు. ముఖ్యంగా మీ సెక్స్ లైఫ్ కు సంబంధించిన విషయాలు మీ ఆయనకు తెలిసిన వాళ్లకు తెలియడం మిమ్మల్ని బాధిస్తున్న విషయం.

ఏ ఆడపిల్ల అయినా అలాగే చేస్తుంది

ఏ ఆడపిల్ల అయినా అలాగే చేస్తుంది

ఎందుకంటే అప్పుడప్పుడు మీ ఆయనతో పాటు మీ ఇంటికొచ్చే ఆయన ఫ్రెండ్స్ కు ఆ విషయాలు తెలియడం వల్ల వాళ్ల ముందు నీ పరువు పోతుందని నీ భయం. ఏ ఆడపిల్ల అయినా ఈ విషయంలో కచ్చితంగా భయపడుతుంది. ఆందోళన చెందుతుంది.

చెప్పి చూసేందుకు ప్రయత్నించు

చెప్పి చూసేందుకు ప్రయత్నించు

మీ ఆయనకు ఒక రోజు నువ్వు పడుతున్న ఇబ్బందులు మొత్తం చెప్పి చూడు. అలాగే నీ సమస్యను వీలైతే మీ అత్తమామలతో కూడా చెప్పు. ఇంకా మీ ఆయన ఎవరు చెబితే వింటారో అలాంటి వారితో కూడా చెప్పించడానికి ప్రయత్నించు. కానీ అతన్ని ఎవరూ కూడా తిట్టకూడదు.

టార్చర్ చేస్తాడు

టార్చర్ చేస్తాడు

అతన్ని తిట్టినా, మందలించినా అతను మిమ్మల్ని టార్చర్ చేస్తాడు. అందువల్ల మీరు అతన్ని ఎంత సేపు ఉన్నా మంచిగా ఉంటూనే మార్చడానికి ప్రయత్నించాలి. అతనిపై మీరు కోపగించుకోండి.

సామరస్యంగా పరిష్కరించుకోండి

సామరస్యంగా పరిష్కరించుకోండి

జీవితభాగస్వాములు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తేనే జీవితం. ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒక విషయం వల్ల బాధపడితే ఆ కాపురం అంత సజావుగా సాగదు. మీ మధ్య ఏర్పడే విబేధాలు ఇంకా కాస్త పెద్దవి అవుతాయి. వాటి తాలుకా ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునే ఆలోచనలో ఉండండి. అందుకోసం అన్ని రకాలుగా ప్రయత్నించండి.

English summary

Mystory My husband discusses our sex life with his friends

Mystory My husband discusses our sex life with his friends
Story first published: Wednesday, January 3, 2018, 9:00 [IST]