అతను మా అమ్మని కాదని మరో ఆమెతో కులుకుతున్నాడు - My Story # 113

Written By:
Subscribe to Boldsky

నా పేరు ఐశ్వర్య. మా నాన్న అంటే చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం ఉండేది. చిన్నప్పుడు నాకు కుటుంబం అంటే ఎంతో ఇష్టం ఉండేది. కాస్త ఊహ తెలిశాక ఆయనంటే అసహ్యం పుట్టింది. మా ఇంట్లో నేను, మా చెల్లి, మా అమ్మ ఉంటాం. మా నాన్న పేరు పాసుల. ఆయన మాతో పాటు ఉండడు.

మరో కుటుంబం

మరో కుటుంబం

మా నాన్నకు మరో కుటుంబం ఉంది. ఆయన చేసుకున్న భార్య, ఆయన పిల్లలుగా సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్లు ఆయనతో పాటు ఉంటారు. మా అమ్మ చేసిన తప్పు వల్ల నేను, మా చెల్లి ఇబ్బందులుపడాల్సి వస్తోంది.

పెద్ద సాహిత్యవేత్త

పెద్ద సాహిత్యవేత్త

మా నాన్న పెద్ద సాహిత్యవేత్త. సమాజంలో ఆయనకంటూ ఒక గుర్తింపు కూడా ఉంది. రోజూ ఆయన ఫొటోలు పేపర్లలో వస్తుంటాయి. వాటిని చూస్తే నాకు గుండెలోని బాధ మొత్తం తన్నుకుని బయటకు వస్తుంది.

మంచోడు కాదు

మంచోడు కాదు

మా నాన్న సమాజం అనుకున్నంత మంచోడు కాదు. కానీ ఈ వెర్రి సమాజం ఎలా ఇతన్ని నమ్ముతుందో నాకు అర్థం కావడం లేదు. ఎంతో మంది జీవితాలతో ఆడుకునే ఈయనను ఎందుకింత గుడ్డిగా నమ్ముతున్నారో నాకు తెలియడం లేదు.

చాలా జాగ్రత్తపడుతుంటాడు

చాలా జాగ్రత్తపడుతుంటాడు

మా అమ్మతో పాటు ఎందరో ఆడవారి జీవితాలను నాశనం చేసిన ఈయన తన తప్పులు ఎక్కడ బయటపడకుండా చాలా జాగ్రత్తపడుతుంటాడు. సమాజం దృష్టిలో ఈయన చాలా మంచోడు.

తూ అని ఉమ్మి వేస్తారు

తూ అని ఉమ్మి వేస్తారు

కానీ ఈ పాసుల అసలు స్వరూపం తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ అతన్ని తూ అని ఉమ్మి వేస్తారు. మమల్ని ఇంతగా క్షోభ పెడుతున్న నువ్వు చివరకు సాధించేదేమీ లేదు.

అక్రమ సంబంధం

అక్రమ సంబంధం

వాస్తవానికి ఈ పాసుల మొదట మా అమ్మనే ప్రేమించాడు. గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మా అమ్మకు తెలియకుండా భాగమతి అనే ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. తర్వాత అసలు విషయం అందరికీ తెలియడంతో భాగమతిని వివాహం చేసుకున్నాడు.

పట్టించుకోవడం లేదు

పట్టించుకోవడం లేదు

భాగమతిని చేసుకున్న తర్వాత ఇక మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈయనకు ఆమె ఎక్కువై పోయింది. ఆమె కోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధం అయిపోయాడు.

శాడిస్ట్

శాడిస్ట్

అంతేకాదు మా నాన్న ఒక శాడిస్ట్. అభం శుభం తెలియని చాలా మంది జీవితాలతో అతను ఆడుకున్నాడని మా అమ్మ చెప్పేది. అలాగే మా అమ్మ కూడా బలి అయ్యిందట.

మంచి వ్యక్తి కాదు

మంచి వ్యక్తి కాదు

ఈ పాసుల సమాజానికి కనిపించేంత మంచి వ్యక్తి కాదు. ఏ విషయాన్ని కూడా నేరుగా చెప్పే రకం కాదు. ఇక భాగమతి కోసం చాలా మంది జీవితాలతో కూడా ఆడుకున్నాడట. భాగమతి తనకు ఎవరైతే పడరో అలాంటి వ్యక్తుల పేర్లను పాసులకు చెప్పేదట.

ఇన్ డైరెక్ట్ గా దెబ్బతీసేవాడంట

ఇన్ డైరెక్ట్ గా దెబ్బతీసేవాడంట

పాసులకు బయట మంచి పలుకుబడి ఉంది కదా. ఇక రెచ్చిపోయేవాడట. వెనుకా ముందు ఆలోచించకుండా మా నాన్న అనబడే ఈ పాసుల అందరినీ ఇన్ డైరెక్ట్ గా దెబ్బతీసేవాడంట. అలా మా మామ వాళ్లను కూడా భాగమతి మాట విని వెన్నుదెబ్బ తీయడానికి ప్రయత్నించారు పాసుల.

నడిరోడ్లపై ఉరి తీయాలి

నడిరోడ్లపై ఉరి తీయాలి

ఇలాంటి పాసులాలు చాలామంది ఈ సమాజంలో ఉంటారు. వారి బారిన పడకుండా ప్రతి అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రతి కుటుంబ ఒక అనాథగా మారుతుంది. వాడు మా నాన్న చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. అతని పేరు వింటేనే ఒంట్లో రక్తం మరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్లను నడిరోడ్లపై ఉరి తీయాలి.

English summary

seriously they speak so ill of him and it boils my blood

వాస్తవానికి ఈ పాసుల మొదట మా అమ్మనే ప్రేమించాడు. గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మా అమ్మకు తెలియకుండా భాగమతి అనే ఆమెతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. తర్వాత అసలు విషయం అందరికీ తెలియడంతో భాగమతిని వివాహం చేసుకున్నాడు. భాగమతిని చేసుకున్న తర్వాత ఇక మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈయనకు ఆమె ఎక్కువై పోయింది. ఆమె కోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధం అయిపోయాడు.
Story first published: Tuesday, March 13, 2018, 13:29 [IST]