భార్యాభర్తలు సంపూర్ణమైన సెక్స్ ఎలా చేసుకోవాలో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

భార్యాభర్తలంతా వారి రోజువారీ జీవనంలో శృంగారం కూడా ఇక భాగమని గుర్తించాలి. చాలామంది దంపతులు సెక్స్ అంటే అది కేవలం పడకగదిలో రెండు శరీరాల కలయికగా మాత్రమే అని అనుకుంటారు. ఇంకొందరైతే శృంగారం అంటే అమ్మాయిని అనుభవించడం అనే భావనలో ఉంటారు.

ఆ పని ఒక్కటే కాదు

ఆ పని ఒక్కటే కాదు

శృంగారంలో కేవలం ఆ పని ఒక్కటే కాదు. ఇంకా చాలా ఉంటాయి. భార్యాభర్తల ఇద్దరి మధ్య స్పర్శ నుంచి, ఓ బిగి కౌగిలి దాకా ఏదైనా సరే శృంగారంలో భాగమే. అలా దంపతుల మధ్య ఏర్పడిన ఆ కాంక్షలన్నీ చివరకు సెక్స్‌కు దారి తీస్తాయి. రొమాన్స్ లో చివరి అంకమే సెక్స్‌.

డైరెక్ట్ గా సెక్స్ లో కూడా పాల్గొంటే

డైరెక్ట్ గా సెక్స్ లో కూడా పాల్గొంటే

అయితే భార్యాభర్తలు ఎలాంటి రొమాన్స్ చేయకుండానే డైరెక్ట్ గా సెక్స్ లో కూడా పాల్గొనవచ్చు. కానీ ఆ జీవితం కొంతకాలానికి నిస్తేజంగా మారుతుంది. అందుకే శృంగారం విషయంలో స్వేచ్ఛను, భావ ప్రకటనను కోల్పోయినవారు శృంగారానుభూతుల్ని అందుకునే ప్రయత్నంలోనూ విఫలం అవుతారు.

దాహం, ఆకలి లాంటిదే శృంగారం

దాహం, ఆకలి లాంటిదే శృంగారం

భార్యతో కేవలం సెక్స్ లో పాల్గొంటాం.. ప్రేమ, రొమాన్స్ ఇవన్నీ ఏమీ చేయమని అనుకునే వారు శృంగారం పట్ల అనాసక్తిని పెంచుకుని జీవితంలో శృంగారమంటే ఏ ప్రాముఖ్యంలేని అంశంగా భావించే దశకు చేరుకుంటారు. అందుకే మానవ శరీరంలో కలిగే భౌతిక, రసాయనిక మార్పులు ఫలితంగా కలిగే జీవరసాయన చర్యల ఫలితమైన దాహం, ఆకలి లాంటిదే శృంగారం కూడా.

భార్యాభర్తల జీవితం బాగా ఉంటుంది

భార్యాభర్తల జీవితం బాగా ఉంటుంది

శృంగారం అనేది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు మానసికమైంది కూడా. అందుకే శృంగారాన్ని కేవలం దేహానికి సంబంధించిన ఓ చర్యగా మాత్రమే చూడడం ప్రారంభిస్తే అది భౌతిక అవసరంగానే మిగిలిపోతుంది. దంపతుల మధ్య పరస్పర అన్యోన్యతకు కారకంగా శృంగారాన్ని గుర్తించగలిగితే అలాంటి భార్యాభర్తల జీవితం చాలా బాగా ఉంటుంది.

శృంగారం చాలా అవసరం

శృంగారం చాలా అవసరం

నిజానికి శృంగారం అన్నది దంపతుల మధ్య ఉన్న ప్రేమను మరింత బలంగా చేసేందుకు తోడ్పడే ఓ సాధనం లాంటిది. దంపతుల మధ్య ఉండాల్సిన ప్రధాన అంశాలైన ప్రేమ, అనురాగం, బాధ్యత, భద్రత, నమ్మకం, విశ్వాసం తదితర అంశాలు జీవితాంతం వాటి తీవ్రతను కోల్పోకుండా ఉండాలనుకుంటే శృంగారం చాలా అవసరం.

పడకింటి అవసరం కాకూడదు

పడకింటి అవసరం కాకూడదు

ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో తన తాను ఒక గొప్ప శృంగార పురుషుడిగా భావించుకోవాలి. అప్పుడే జీవితంలోని ఇతర భావనల్లాగే శృంగార జీవితాన్ని సైతం పరిపూర్ణంగా అనుభవించగల్గుతారు. భార్యాభర్తల మధ్య శృంగారమనేది కేవలం ఓ పడకింటి అవసరంగా మారిపోకుండా ఉండాలి.

నుదిటిమీదనో, మెడఒంపులోనో

నుదిటిమీదనో, మెడఒంపులోనో

మీ భార్య ఒంటరిగా ఉన్నప్పుడు చిలిపితనం నిండిన కళ్లతో చూపులతో ఓ బాణం విసరడం చేయాలి. నుదిటిమీదనో, మెడఒంపులోనో ఓ చిన్నముద్దు పెట్టాలి. వంటింట్లోనో, మరోచోటో ఎవరూ లేని సమయంలో ఓ బిగి కౌగిలిలో ఆమెను బంధించాలి. ఇలా ఏదైనా కావచ్చు అది మీ శృంగార జీవితాన్ని మరింత బలంగా మార్చుతుంది.

నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తివి

నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తివి

భార్యాభర్తలు శృంగారం అంటే కేవలం సెక్స్ అని మాత్రమే కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పాటించాలి. భార్యతో నిన్ను నేనూ ఎప్పుడూ ప్రేమిస్తున్నాను, నీతోడులోనే నాకు ఆనందం ఉంది.నువ్వు మాత్రమే నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తివి అనే విషయాలు కూడా చెప్పాలి.

బాగా అనుభవించగలగాలి

బాగా అనుభవించగలగాలి

శృంగారం దానికి సంబంధించిన చేష్టలు ఉన్న జీవి మనిషి మాత్రమే. అందువల్ల శృంగారాన్ని బాగా అనుభవించగలగాలి. మనిషికి మాత్రమే తెలిసిన శృంగారాన్ని ప్రస్తుతం సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నాడు.

నామమాత్రంగా సెక్స్

నామమాత్రంగా సెక్స్

బిజీ లైఫ్ లో ఉండి చాలా మంది భార్యాభర్తలు శృంగారాన్ని పట్టించుకోవడం లేదు. ఏదో నామమాత్రంగా సెక్స్ పాల్గొంటూ జీవితాన్ని అలా గడిపేస్తున్నారు. శృంగార ప్రపంచానికి దూరంగా బతికే భార్యాభర్తలంతా ఇప్పటి నుంచైనా సంపూర్ణ శృంగారానికి దగ్గర కావాలి. అప్పుడే ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది. సంపూర్ణ శృంగారం అంటే కేవలం సెక్స్ ఒక్కటే కాదు అని మీరు గుర్తు పెట్టుకోవాలి.

శృంగారానికి ఓ స్థానం

శృంగారానికి ఓ స్థానం

శృంగారానికి ఎప్పుడైతే మనుషులు దూరం అవుతారో అప్పుడు

మిగిలిన ప్రపంచంలోని ఆనందం సైతం మీకు దూరం అవుతుంది. అందుకే జీవితంలో శృంగారానికి సైతం ఓ స్థానముందని గుర్తిస్తే అలాంటి భార్యాభర్తల జీవితం చాలా ఆనందంగా ఉంటుంది.

మహిళలే బాగా అనుభవిస్తున్నారట

మహిళలే బాగా అనుభవిస్తున్నారట

అయితే ప్రస్తుతం పురుషుల కంటే మహిళలే శృంగార స్వేచ్ఛను ఎక్కువగా అనుభవిస్తున్నారట. యుక్త వయస్సులో ఒకరికంటే ఎక్కువ మందితో పడక సుఖాలను అనుభవిస్తున్నారని.. శృంగార వైఖరులు, జీవిత విధానాలపై నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.

అలా శృంగారం చేసుకోవడం మంచిది

అలా శృంగారం చేసుకోవడం మంచిది

అలాగే స్వలింగ సంపర్కాల విషయంలోనూ మహిళలు మగవారిని దాటిపోయారట. గత దశాబ్ద కాలంలో స్త్రీ, పురుషుల మధ్య అంతరం తరిగిపోయిందని కూడా ఒక సర్వేలో తేలింది. అయితే స్వలింగ సంపర్కం వాటికి అలవాటుపడకుండా, కేవలం భర్తతో భార్య, భార్యతో భర్త శృంగారం చేసుకోవడం మంచిది.

English summary

the role of romance in a relationship and its importance

the role of romance in a relationship and its importance
Story first published: Tuesday, April 17, 2018, 9:00 [IST]