పెళ్లి కూతుర్లు కొత్త కుటుంబంతో ఎలా కలసిపోవాలో తెలియజేసే చిట్కాలు ఇవే

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

వివాహానికి సంబంధించిన పనులు సాగుతున్నంతసేపు పెళ్ళికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ ఎంతో ఆనందంగా, హాయిగా ఉంటారు. వివాహం అయిన మొదటి సంవత్సరం ఎంతో ఆతురతగా ఉంటుంది. ఆ తర్వాతనే అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. వివాహం అయిపోయిన తర్వాత పెళ్లికూతురు ఎంతో ఓపికతో ఉండాలి, దైర్యంగా ఉండాలి. ఇలా ఉంటేనే తాను అడుగుపెట్టిన కొత్త కుటుంబంతో త్వరగా కలిసిపోగలదు.

సంబంధ బాంధవ్య నిపుణులు ఏమని చెబుతున్నారంటే, భారతీయ స్త్రీలు ఎప్పుడైతే పెళ్లయిపోయిన తర్వాత కొత్త కుటుంబంలోకి అడుగుపెడతారో, ఆ సమయంలో వీరు తమ ఆలోచన విధానాన్ని సానుకూలంగా మార్చుకోవాలి. ఎందుకంటే, జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. మరెన్నోసార్లు సర్దుకుపోవాల్సి ఉంటుంది. కానీ, చివరగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు గనుక ఆనందంగా ఉంటే, మీ మధ్య సంబంధ బాంధవ్యం అలాగే కలకలం హాయిగా ఉంటుంది.

Tips For Indian Brides To Adjust In The New Family

భారతీయ పెళ్లి కూతుర్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చిట్కాల గుంచి ఇప్పడూ మనం తెలుసుకోబోతున్నాం. స్త్రీలు గనుక ఇప్పుడు చెప్పబోయే 8 తెలివైన అతి పెద్ద చిట్కాలను ఆ కొత్త కుటుంబంలోకి వెళ్లక ముందే పాటించగలిగితే ఈ ప్రపంచంలో మీరు కోరుకున్న ఆనందాన్ని మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తి ద్వారా పొందవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం...ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందడుకు వేయడం ప్రారంభించాలి. వివాహం అయిన వెంటనే, ఈ మార్పులను మీ జీవితంలో ఖచ్చితంగా అమలుచేయాలి. ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను అనుసరిస్తే గనుక మీరు మీ భర్త తో పాటు, అతని కుటుంబంతో కూడా ఎంతో హాయిగా జీవించగలరు.

కుటుంబం పై పరిశోధన చేయండి :

కుటుంబం పై పరిశోధన చేయండి :

మీరు వెళ్లబోయే కుటుంబం గురించి పెళ్ళికి ముందే పరిశోధన చేయడం చాలా తెలివైన పని. ఒక స్త్రీగా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తుల ఇష్టా ఇష్టాలు మీరు అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. కొత్త జీవితాన్ని అలవాటు చేసుకోబోయేవారు చేయవల్సిన మొట్టమొదటి పని ఇదే.

కొత్త జీవితానికి అలవాటు పడాలి :

కొత్త జీవితానికి అలవాటు పడాలి :

మీరు అడుగుపెట్టబోయే కొత్త జీవితంలో మీరు అన్నింటిని అలవాటు చేసుకోవాలి గాని, సర్దుకుపోకూడదు. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది.

సానిహిత్యం పెంపొందించుకోవాలి :

సానిహిత్యం పెంపొందించుకోవాలి :

భారతీయ పెళ్లి కూతుర్లు అత్తలతో సానిహిత్యం పెంచుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడైతే, భర్త అమ్మ బాగుంటుందో అప్పుడు అన్ని బాగున్నట్లు లెక్క.

వాళ్ల విలువలను మీరు గుర్తించండి :

వాళ్ల విలువలను మీరు గుర్తించండి :

ఎప్పుడైతే మీరు మీ భర్త ఇంటిలోకి అడుగుపెడతారో అలా అడుగుపెట్టిన వెంటనే, మార్పులు చేసేయాలి అనే నిర్ణయానికి రాకండి. కుటుంబంలోకి వచ్చిన కొత్త వ్యక్తిగా మీరు అందరికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారి విలువలను మీరు నేర్చుకొని విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా గనుక చేస్తే విపరీతమైన ఆనందం మీ సొంతం అవుతుంది.

మీరు ఎక్కువగా అంచనా వేస్తుంటారా ?

మీరు ఎక్కువగా అంచనా వేస్తుంటారా ?

మీరు గనుక ఎక్కువగా ఎదుటివారి గురించి అంచనా వేసే వ్యక్తులు అయితే అది మిమ్మల్ని మరింత గందరగోళంలోకి నెట్టివేస్తుంది. ఒక కొత్త పెళ్లికూతురిగా మీరు మీ భర్త ఇంట్లో చేయాల్సిన పని ఏమిటంటే, ఎదుటి వ్యక్తుల గురించి ఏమాత్రం అంచనాలు వేయకండి. మరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఒక అమ్మాయి కేవలం ఒక అబ్బాయి ని మాత్రమే పెళ్లిచేసుకోలేదు, అతడి కుటుంబం మొత్తాన్ని పెళ్లిచేసుకుంది అని గుర్తించాలి.

కారుణ్యంతో వ్యవహరించండి :

కారుణ్యంతో వ్యవహరించండి :

పెళ్లికూతురు ఎప్పుడు గాని, తాను చేస్తున్న పనులను ఎక్కువగా సమర్ధించుకోకూడదు. ఏ సమయంలో గాని వాదనకు దిగకూడదు అని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు ఏమైనా అమ్మాయి అర్ధం చేసుకొని మెలగాలి. కుటుంబంలోని ఇతర వ్యక్తుల పట్ల కారుణ్యంతో వ్యవహరించాలి.

సుహృద్భావ హృదయంతో వ్యవహరించాలి :

సుహృద్భావ హృదయంతో వ్యవహరించాలి :

మీరు ఆ కుటుంబంలో కొత్త వ్యక్తి గనుక మీరు కచ్చితంగా ప్రతి ఒక్కరితో బాగా మెలగాల్సిన అవసరం ఉంది. చిన్నవారుగాని, పెద్దవారు గాని, ఎవ్వరైనా సరే సుహృద్భావ హృదయంతో వ్యవహరించండి.

సంబంధ బాంధవ్యాల మధ్య సమతుల్యతను పాటించండి :

సంబంధ బాంధవ్యాల మధ్య సమతుల్యతను పాటించండి :

మీరు ఒక పెళ్లి కూతురు గనుక, మీ పై ఎన్నో బాధ్యతలు ఉంటాయి. కావున సంబంధ బాంధవ్యాల మధ్య సమతుల్యతను ఎలా పాటించాలి అనే విషయాన్ని మీరు తెల్సుకోవాలి. అత్తా మామలతో పాటు, ఇతర కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి, ఎలా మెలిగితే బాగుంటుంది అని తెలుసుకొని అలా వ్యవహరిస్తే బాగుంటుంది. ఎందుకంటే, అందరు ముఖ్యమైన వారే, అందర్నీ గౌరవించాల్సిన అవసరం ఉంది.

English summary

Tips For Indian Brides To Adjust In The New Family

Here are some tips dedicated to the Indian bride. Take a look ladies, to see how you can adjust in a new family after the wedding.
Story first published: Saturday, May 12, 2018, 16:00 [IST]