For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  పీరియడ్స్ సమయంలో భార్యతో ఎలా మెలగాలో ప్రతి భర్తా తెలుసుకోవాల్సిన విషయాలు

  |

  మూడ్ స్వింగ్స్, క్రామ్ప్స్, ఎమోషనల్ బ్రేక్ డవున్స్ తో పాటు ప్రతి నెలసరి సమయంలో మీ భార్య మీముందుంచే కొన్ని సమాధానం లేని ప్రశ్నల గురించి చింతిస్తున్నారా? అయితే, ఈ విషయం మీరు తెలుసుకోవాలి. నెలసరి సమయంలో ఇవి సహజ లక్షణాలు. ప్రతి 28 రోజుల కొకసారి నెలసరి వస్తుంది. ఆ సమయంలో ఆమెకు అసౌకర్యం అధికంగా ఉంటుంది. అది ఆమె తప్పు కాదు. ప్రకృతి సహజం.

  ఆమెపై రూడ్ గా ప్రవర్తించకండి. ఆమెతో సున్నితంగా వ్యవహరించండి.

  పీరియడ్స్ తో మీ వైఫ్ ఇబ్బందిపడుతున్న సమయంలో ఆమెతో ఎలా ప్రవర్తించాలో ఈ ఆర్టికల్ మీకు వివరిస్తుంది.

  సరిగ్గా ఇటువంటి విషయం గురించే మీరు వెతుకుతున్నారా? అయితే, ఈ ఆర్టికల్ మీ కోసమే.

  మహిళలకు అలాగే చంద్రుని దశలకు అవినాభావ సంబంధం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. చంద్రుడి దశ బట్టి మహిళ మానసిక స్థితి ఆధారపడి ఉంటుందని ఒక నమ్మకం ఉంది.

  పీరియడ్ అనేది మహిళ మూడ్ పై ప్రభావం చూపించడానికి వేయి కారణాలున్నాయి. పీరియడ్ సమయంలో తలెత్తే హార్మోన్ల అసమతుల్యతల వలన మహిళ మూడ్ అనేకరకాలుగా అప్సెట్ అవుతుంది.

  WHAT ALL YOU NEED TO DO WHEN YOUR WIFE IS GOING THROUGH HER PERIOD?

  మిమ్మల్ని ట్రబుల్ చేయడమే వారికిష్టమని మీరనుకుంటే మీ ఆలోచనా విధానం తప్పు.

  పీరియడ్ సమయంలో మహిళ అనేక అసౌకర్యాలకు గురవుతుంది. తాను మాములుగా మృదు స్వభావి అయి ఉండవచ్చు. నెమ్మదస్తురాలు కావచ్చు. అయితే, పీరియడ్ రాగానే ఆమెలోని అసహనం అలాగే అలసట విజృంభిస్తాయి. అనేక రకాల ఆలోచనలు ఆమెను చుట్టుముడతాయి. పొత్తికడుపు నొప్పితో ఆమె విలవిలలాడుతుంది.

  ఈ సమయంలో మీకు మీ భార్యకు మధ్య అనేక విషయాలపై వాగ్వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. పీరియడ్ సమయంలో మూడ్ స్వింగ్స్ వలన ఇలా జరుగుతుంది. సెన్సిటివిటీ వలన ఆమె ఇలా ప్రవర్తిస్తుంది.

  కాబట్టి, మీ వైపు నుంచి మీరు కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా మీరు పరిస్థితిని సున్నితంగా డీల్ చేయగలుగుతారు. మీ మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది.

  పీరియడ్ సమయంలో తన భార్యతో ఎలా ప్రవర్తించాలో ప్రతి పురుషుడూ తెలుసుకోవాలి.

  పీరియడ్ సమయంలో మీ భార్యతో ఎలా మెలగాలో ఇక్కడ వివరించాము.

  1. ఆమె సైకిల్ ను ట్రాక్ చేయండి:

  1. ఆమె సైకిల్ ను ట్రాక్ చేయండి:

  జీవిత భాగస్వామిగా మీ భార్యకు మీరు పీరియడ్స్ సమయంలో కూడా అండగా ఉండాలి.. ఆమె పీరియడ్ ని మీరు ట్రాక్ చేసి అందుకు తగిన జాగ్రత్తలను మీరు తీసుకోవాలి. ఒకవేళ క్యాలెండర్ అవసరమైతే డేట్స్ ను హైలైట్ చేసి పీరియడ్ ను ట్రాక్ చేయండి.

  పీరియడ్స్ సమయంలో కూడా అంతా నార్మల్ గానే ఉందనే విధంగా పరిస్థితులుండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. అందుకు, తన భర్త సహకారం ఆశిస్తుంది.

  మీ భార్య పీరియడ్స్ ని ట్రాక్ చేయడం ద్వారా మీరు ఆమెపై మరింత శ్రద్ధ కనబరిచవచ్చు.

  ఆమె పీరియడ్ గురించి మీరు ట్రాక్ చేయడం వలన మీరు ముందుగానే అన్నివిధాలా సిద్ధంగా ఉండవచ్చు. ఆమె మూడ్ స్వింగ్స్ కి అలాగే క్రామ్ప్స్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

  2. పనులలో సహాయపడండి:

  2. పనులలో సహాయపడండి:

  ఆఫీస్ వర్క్ కానివ్వండి లేదా ఇంటిపనులు కానివ్వండి, మీ నుంచి ఆమెకు సహాయం అందాలి. అప్పుడు, ఆమెకు రిలాక్సేషన్ లభిస్తుంది. అదే సమయంలో, మీపై ఆమెకు మరింత ప్రేమ పెరుగుతుంది. మిమ్మల్ని భాగస్వామిగా పొందడం వరంగా భావిస్తుంది. పీరియడ్స్ సమయంలో మహిళలు విశ్రాంతి తీసుకుంటే రిలీఫ్ గా ఫీల్ అవుతారు. క్రామ్ప్స్ తో పాటు పెయిన్ అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

  జీవిత భాగస్వామిగా, మీరు ఆమెకు సహాయ సహకారాలు అందించడం ద్వారా ఆమెకు అసౌకర్యాలు తొలగిపోతాయి.

  ఫుడ్ ని ప్రిపేర్ చేయండి, బ్రేక్ ఫాస్ట్ ను తయారుచేయండి, లాండ్రీతో పాటు క్లీనింగ్ యాక్టివిటీస్ లో పాలుపంచుకోండి. మీకు వీలైనన్ని విధాలుగా ఆమెకు హెల్ప్ చేయండి.

  3. ఆమెతో సహనంగా మెలగండి:

  3. ఆమెతో సహనంగా మెలగండి:

  ఈ సమయంలో ఆమె కొంత చికాకుగా ఉండవచ్చు. అందువలన, మీకు ఇరిటేషన్ కలగవచ్చు. అయితే, ఇక్కడే మీరు సహనం పాటించాలి. ఇవన్నీ హార్మోన్ల అసమతుల్యతల వలన ఏర్పడిన చికాకులు. కాబట్టి, ఈ విషయాన్ని గమనించి ఆమెతో కనీసం మూడు రోజుల పాటు సహనంగా ఉండండి. ఆ తరువాత అన్నీ సర్దుకుంటాయి.

  ఈ సమయంలో, మీ పేషన్స్ ఆమెకు ఎంతో అవసరం. మీ పేషన్స్ కి ఆమె సంతోషిస్తుంది. మీరు ఆమెను సంరక్షిస్తున్నారని తెలుసుకుని ఆనందిస్తుంది.

  4. సర్ప్రైజ్ లు ఇవ్వండి:

  4. సర్ప్రైజ్ లు ఇవ్వండి:

  ఈ సమయంలో మీ భార్యను సంతోషపెట్టడం చాలా సులభం. ఆమెకు సర్ప్రైజ్ లను అందివ్వండి.

  సర్ప్రైజ్ పెద్దదా లేదా చిన్నదా అన్నది మ్యాటర్ కాదు. మీరు కేటాయించే సమయమే ముఖ్యమైనది.

  కాబట్టి ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ తో సర్ప్రైజ్ లను ప్లాన్ చేయకండి. మీ క్రియేటివిటీని జోడించండి.

  ఆమెకు నచ్చిన ఫుడ్, చాకోలెట్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్ వంటి వాటితో సర్ప్రైజ్ ఇవ్వండి. లేదా కీ చెయిన్, విండ్ చార్మ్, డ్రీం క్యాచర్ వంటి వాటితో కూడా సర్ప్రైజ్ చేయవచ్చు.

  మీ పార్ట్నర్ కి నచ్చే విషయాలేంటో మీకే ఎక్కువగా తెలుసు. ఆమె అభిరుచులకు తగ్గట్టుగా ఆమెను సర్ప్రైజ్ చేసి ఆమె అభిమానాన్ని పొందండి.

  English summary

  WHAT ALL YOU NEED TO DO WHEN YOUR WIFE IS GOING THROUGH HER PERIOD?

  There are like a thousand reasons why a woman's mood changes over time with the onset of her period and it is found that all these are related to the hormonal imbalance that keeps happening during her periods. This article will definitely guide you about the ways you can handle your wife or your girlfriend while she is on her periods.
  Story first published: Thursday, May 3, 2018, 18:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more