For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సమయంలోనూ కొత్త జంటలకు చికాకు తెప్పించే ప్రశ్నలేంటో చూడండి...

కొత్తగా పెళ్లి అయిన తొలి రోజుల్లో వధువు, వరుడు నూతనోత్సాహంతో ఉన్నప్పటికీ వారు ఊహించని కొన్ని పరిస్థితులు, ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

|

అమ్మాయిలకైనా... అబ్బాయిలకైనా... వారి జీవితంలో పెళ్లి అనే ఘట్టం ఒక అందమైన మలుపు. పెళ్లి తర్వాత అబ్బాయిలకు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ.. అమ్మాయిలు మాత్రం చాలా అణుకువగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

Annyoing questions faced by every newly married couple

ఇక కొత్త వధువు కూడా ఎన్నో ఆశలు.. మరెన్నో ఊహాలతో అత్తగారింట్లోకి ఎంతో ఆనందంగా అడుగుపెడుతుంది. తన భర్తతో కలిసి జీవించే ప్రతి ఘడియ తనకు సుఖంగా, సంతోషంగా గడపాలని కోరుకుంటుంది.

Annyoing questions faced by every newly married couple

అయితే ఆమెకు అలాంటి ఆశలు, కోరికలు, ఆనందాలతో పాటు మరెన్నో సంశయాలు కూడా ఆమె మనసులో వెంటాడుతూ ఉంటాయి. అత్తగారింట్లో నేను నెట్టుకురాగలనా? వారు నన్ను బాగా చూసుకుంటారా? ఇలాంటి ప్రతికూల ఆలోచనలు ఆమెను నిత్యం వెంటాడుతూ ఉంటాయి.

Annyoing questions faced by every newly married couple

వీటన్నింటి సంగతి పక్కనబెడితే భార్యభర్తలిద్దరూ ఒక చోట కనిపిస్తే చాలు వారిద్దరినీ బంధువులైనా.. స్నేహితులైనా తెగ ఆటపట్టిస్తుంటారు. ఇవి మనలాంటి వారికి సరదాగా ఉండొచ్చు. కానీ వారికి మాత్రం చాలా చికాకు కలిగించవచ్చు.

Annyoing questions faced by every newly married couple

ఆ క్షణం మన ఎదుట ఓ చిన్న చిరునవ్వు నవ్వి.. లోలోపల మాత్రం తెగ ఫీలవుతుంటారు. ఇంతకీ కొత్తగా పెళ్లయిన వారిని ఇబ్బంది పెట్టే ఆ ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నలకు వారి మనసులో ఏమనుకుంటారు? ఇలాంటి విషయాల గురించి మనం కూడా ఓ లుక్కేద్దాం రండి...

ఇంకా జాబ్ చేస్తావా?

ఇంకా జాబ్ చేస్తావా?

ఉద్యోగం చేసే చాలా మంది అమ్మాయిలు పెళ్లి తర్వాత ఇలాంటి ప్రశ్నను వినాల్సి వస్తుంది. ‘‘పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తావా‘‘ అని అడుగుతారు. దానికి చాలా మంది అవుననే సమాధానం చెప్తారు. కొందరు ఇలాంటి ధైర్యాన్ని మెచ్చుకొంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి వాటిపై వ్యంగ్యంగా మాట్లాడతారు. ‘‘పెళ్లి తర్వాత కూడా ఉద్యోగానికి వెళతారా? మా ఇంటా వంటా ఇలాంటి అలవాట్లు లేవమ్మా. ఇంటిదగ్గరే ఉండి వంటావార్పు చేసుకోవాలి గానీ.. అలా జాబ్ చేస్తూ ఊరి మీద తిరుగుతారా‘‘ అని నోటికొచ్చినట్లు మాట్లాడతారు. అప్పుడు కోపం వచ్చినప్పటికీ పెద్దవాళ్లనే గౌరవంతో సైలెంట్ గా ఉండిపోతారు.

శారీ కట్టుకోవడం వచ్చా?

శారీ కట్టుకోవడం వచ్చా?

ఇప్పటితరం అమ్మాయిలలో చాలా మందికి ఇప్పటికీ చీర కట్టుకోవడం రాదని పెద్దల ఫీలింగ్. అందుకే కొత్త కోడలు ఇంట్లో అడుగుపెడితే చాలు. నూటికి 90 శాతం మందికి పైగా అడిగే ప్రశ్న ఇది. ‘ఏంటమ్మా నీకు చీర కట్టుకోవడం వచ్చా? ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలంతా మగాళ్లలా జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు వేసుకుని తిరుగుతున్నారు కదా నువ్వు కూడా అలాగే వేసుకొంటావా‘‘? అని అడుగుతుంటారు.

తప్పించుకోవడానికి నవ్వుతూ..

తప్పించుకోవడానికి నవ్వుతూ..

ఆ సమయంలో అలాంటి వారి నుండి మనం తప్పించుకోవడానికి మనసులో ఎంతగా తిట్టుకున్నా.. పైకి మాత్రం నవ్వుతూ ‘‘వచ్చండి‘‘ అని చెప్పి మెల్లగా జారుకుంటారు. అయినా వేసుకునే వారికి లేని ఇబ్బంది.. వీరికెందుకో అర్థం కాదు. ఊరికే దుస్తుల విషయంలో ఉలిక్కి పడుతూ ఉంటారు.

సింగిల్ గా వెళ్తావా?

సింగిల్ గా వెళ్తావా?

ఒకవేళ జాబ్ చేసే అమ్మాయి అయితే, ఆఫీసుకు వెళ్లే సమయంలో అత్తగారి నుండి ఎదురయ్యే ప్రశ్నలలో ఇది కూడా ప్రధానమైనదే. ‘ఏంటీ ఆఫీసుకి సింగిల్ గా వెళ్తావా? మీ ఆయన్ని తోడు తీసుకెళ్లచ్చుగా‘ అంటూ ఉంటారు. అయితే నేటి తరం అమ్మాయిలు మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతారు. అందుకే అలాంటి వారి చుట్టూ ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేయకండి.

షాపింగుకు వెళితే..

షాపింగుకు వెళితే..

ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులు దొరికాయని సరదాగా షాపింగుకు వెళితే.. కొందరు రెడీగా ఉంటారు దెప్పి పొడవడానికి.. ‘డబ్బులు అలా ఖర్చు పెట్టకండమ్మా.. ఇప్పుడే పెళ్లయ్యింది కదా.. అసలే కరోనా లాక్ డౌన్ కాలం.. ముందు ముందు బోలెడు ఖర్చులుంటాయి కదా‘ అని తెగ క్లాస్ పీకుతూ ఉంటారు.

వంటల విషయంలో..

వంటల విషయంలో..

ఎన్నీ ప్రశ్నలడిగానా సర్దుకుంటారు కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు. ఇలా అడిగితే మాత్రం వారికి చిర్రెత్తుకొస్తుంది. నేటి తరం అమ్మాయిలు చక్కగా చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వారికి వంటలు రావనుకుంటే పొరపాటే. వారు అవసరమైనంత మేరకు నేర్చుకుంటున్నారు. కొత్త వెరైటీలు కావాలన్నా ఇంటర్నెట్ లో కావాల్సినన్ని వంటకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి చక్కగా వంట చేయగలుగుతున్నారు.

ఫోన్ మాట్లాడినా..

ఫోన్ మాట్లాడినా..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కారణంగా అరచేతిలోనే ప్రపంచం మన ముందు ఉంటోంది. ప్రస్తుతం మనం ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా స్మార్ట్ ఫోన్ మీదే ఆధారపడుతున్నాం. ఇక మన బంధువులతో స్నేహితులతో నిత్యం మాట్లాడటానికి ఇది ఒక అద్భుత వారధిగా పని చేస్తుంది. అయితే మనకు బాగా క్లోజ్ గా ఉండేవాళ్లు ఫోన్ చేస్తే కాస్త ఎక్కువ సమయమే మాట్లాడతాం. దీనికి కూడా ఇలా అంటూ ఉంటారు పెద్దలు. పుట్టింటి వారితో అంతంత సేపు మాట్లాడటం అవసరమా అని ప్రశ్నిస్తారు.

శుభవార్త ఎప్పుడు చెబుతారు?

శుభవార్త ఎప్పుడు చెబుతారు?

కొత్తగా పెళ్లయిన జంటలలో నూటికి 95 శాతానికి పైగా దంపతులకు ఇలాంటి ప్రశ్న ఎదురవుతుంది. పెళ్లి అయి కనీసం కొన్ని రోజులైనా గడవక ముందే రెడీగా ఉంటారు ఇబ్బందిపెట్టడానికి. ఏంటి ఎప్పుడు శుభవార్త ఎప్పుడు చెబుతారు అని అడుగుతారు.

వేరే కాపురం పెడతారా?

వేరే కాపురం పెడతారా?

పెళ్లి అయిన వెంటనే చాలా మంది జంటలకు ఎదురయ్యే ప్రశ్నలలో ఇది కూడా ముఖ్యమైనదే. పెళ్లి అయ్యాక అత్తగారితో కలిసి ఉంటారా? లేదా వేరే కాపురం పెట్టేస్తారా? అని అడుగుతూ ఉంటారు. వారి గురించి చూసుకోకుండా ఇతరుల వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టడానికి మాత్రం ఓ రెఢీ అయిపోతారు.

హనీమూన్ వెళ్లలేదా?

హనీమూన్ వెళ్లలేదా?

అసలే ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై ఇప్పుడిప్పుడే బయటకు అడుగు పెడుతున్నాం. అయితే ఇంతలోనే కొందరు ఇలా అడుగుతారు. హనీమూన్ కు వెళ్లలేదా? ఎక్కడికెళ్లుతున్నారు? పెళ్లయిన వారి కంటే వీరికే ఎక్కువ అత్యుత్సాహం ఉంటుంది.

మీకు నచ్చినట్టు..

మీకు నచ్చినట్టు..

ఇలాంటి ప్రశ్నలు పెళ్లయిన వారిలో చాలా మందికి ఏదో ఒక సందర్భంలో ఎదుర్వడం అనేది అత్యంత సహజం. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు అస్సలు ఫీలవ్వకండి. ఇతరుల కోసం మిమ్మల్నీ మీరు మార్చుకోవద్దు. ఎందుకంటే మీకు నచ్చినట్టు మీరు ఉన్నప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారు.

English summary

Annyoing questions faced by every newly married couple

Here are the annyoing questions faced by every newly married couple. Take a look.
Story first published:Wednesday, May 27, 2020, 14:15 [IST]
Desktop Bottom Promotion